AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kids Health: 10 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు పారాసెటమాల్ టాబ్లెట్ ఇవ్వాలా..? వద్దా..?

నేషనల్ హెల్త్ సర్వీస్ (NHS) ప్రకారం 10 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు వారి వయస్సు, బరువు ఆధారంగా జ్వరం తగ్గేందుకు తగిన మందులు ఇవ్వాలి. జ్వరం వస్తే వెంటనే మందులు ఇవ్వొద్దు. పిల్లల జ్వరం 100 నుంచి 102 డిగ్రీల వరకు ఉంటే పిల్లల జ్వరం తగ్గడానికి గోరువెచ్చని నీటిలో స్పాంజ్ ముంచి దానితో శరీరాన్ని తుడవండి.

Kids Health: 10 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు పారాసెటమాల్ టాబ్లెట్ ఇవ్వాలా..? వద్దా..?
Kids HealthImage Credit source: pexels
Surya Kala
|

Updated on: Oct 03, 2024 | 4:33 PM

Share

ప్రస్తుతం డెంగ్యూ, మలేరియా, చికున్‌గున్యా, ఫ్లూ, వైరల్‌ ఫీవర్‌ల సీజన్‌ కొనసాగుతోంది. పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా భారీ సంఖ్యలో ప్రజలు వాటి బారిన పడుతున్నారు. ఈ వ్యాధులన్నీ జ్వరంతో మొదలవుతాయి. వృద్ధుల నుంచి చిన్న పిల్లల వరకు కూడా జ్వరాల బారిన పడుతున్నారు. చాలా మంది జ్వరం వచ్చినప్పుడు పారాసెటమాల్ టాబ్లెట్ తీసుకుంటారు. దీనివల్ల ఉపశమనం కూడా లభిస్తుంది. కుటుంబంలోని కొందరు చిన్న పిల్లలకు జ్వరం వచ్చినప్పుడు కూడా పారాసెటమాల్ టాబ్లెట్ ని వేస్తారు. అయితే పిల్లలకు పారాసిటమాల్ ఇవ్వడం మంచిదేనా..! ముఖ్యంగా 10 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న వారికి ఈ ఔషధం ఇవ్వడం సరైందేనా? దీని గురించి తెలుసుకుందాం..

నేషనల్ హెల్త్ సర్వీస్ (NHS) ప్రకారం 10 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు వారి వయస్సు, బరువు ఆధారంగా జ్వరం తగ్గేందుకు తగిన మందులు ఇవ్వాలి. జ్వరం వస్తే వెంటనే మందులు ఇవ్వొద్దు. పిల్లల జ్వరం 100 నుంచి 102 డిగ్రీల వరకు ఉంటే పిల్లల జ్వరం తగ్గడానికి గోరువెచ్చని నీటిలో స్పాంజ్ ముంచి దానితో శరీరాన్ని తుడవండి. పిల్లల నుదిటి, మెడ, ఛాతీపై కాటన్ క్లాత్ సహాయంతో సున్నితంగా రుద్దండి. ఇలా చేయడం శరీర ఉష్ణోగ్రతను తగ్గించడంలో సహాయపడుతుంది. ఈ పద్ధతి ఉపశమనం కలిగించకపోతే అప్పుడు పిల్లలకు కొన్ని మందులు ఇవ్వాలి.

జ్వరం వచ్చినప్పుడు పారాసిటమాల్ ఇవ్వాలా?

పారాసిటమాల్ మాత్రలకు బదులు పిల్లలకు సిరప్ ఇస్తే మంచిదని న్యూఢిల్లీలోని ఎయిమ్స్ లోని పీడియాట్రిక్ విభాగంలో డాక్టర్ రాకేష్ కుమార్ చెబుతున్నారు. 6 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు సిరప్‌లో 120 mg పారాసెటమాల్ ఉంటుంది. 6+ అంటే 6 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న పిల్లలకు 250 mg పారాసెటమాల్ సిరప్ ఇవ్వాలి. 8 నుండి 9 సంవత్సరాలకు 7.5 మి.లీ. మోతాదు సిరప్ ఇవ్వాలి.

ఇవి కూడా చదవండి

24 గంటల్లో 4 సార్లు కంటే ఎక్కువ మోతాదులో సిరప్ ఇవ్వవద్దు. ఒకటి లేదా రెండు మోతాదుల సిరప్ ఇచ్చిన తర్వాత కూడా పిల్లలకు జ్వరం ఎక్కువగా ఉంటే.. వైద్యుడిని సంప్రదించండి. ఇంట్లో పిల్లలకు ఎప్పుడూ పారాసెటమాల్ సిరప్ 3 డోసుల కంటే ఎక్కువ ఇవ్వకండి. ఎందుకంటే ఈ మోతాదులో ఉపశమనం కలుగుతుంది. అప్పుడు కూడా జ్వరం తగ్గక పోతే అది ఏదైనా వైరల్ ఇన్ఫెక్షన్ అయ్యి ఉండొచ్చు. అటువంటి పరిస్థితిలో వైద్యుడిని సంప్రదించడం చాలా ముఖ్యం.

డాక్టర్ కుమార్ చెప్పిన ప్రకారం 10 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు 500 mg పారాసెటమాల్ టాబ్లెట్ ఇవ్వకండి. పిల్లలకు ఎల్లప్పుడూ సిరప్ ఇవ్వాలి. అది కూడా వారి వయస్సు, సూచించిన మోతాదు ప్రకారం ఇవ్వాలి. ఎక్కువ జ్వరం ఉందని 10 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు 500 mg పారాసెటమాల్ ఇస్తే.. అది హాని కలిగించవచ్చు.

పిల్లలలో సాధారణ ఉష్ణోగ్రత ఎంత?

పిల్లల ఉష్ణోగ్రత 99 F వరకు ఉంటే ఇబ్బంది ఉండదని బీహార్‌లోని శిశువైద్యుడు డాక్టర్ అరుణ్ షా చెబుతున్నారు. పిల్లల శరీరం చాలా వేడిగా ఉండటం సహజం. అలాంటి జ్వరం వచ్చినప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. పిల్లలకి 100 F కంటే ఎక్కువ జ్వరం ఉంటే తక్కువ వేడి నీటిలో ముంచిన స్పాంజింగ్ చేయాలి. జ్వరం 102 లేదా అంతకంటే ఎక్కువ పెరిగితే పారాసెటమాల్ సిరప్ ఇవ్వాలి.

పిల్లలకు సిరప్ ఎలా ఇవ్వాలంటే

కనీసం 10 సెకన్ల పాటు సిరప్‌ సీసాను బాగా కదిలించండి. ఔషధంతో పాటు వచ్చే ప్లాస్టిక్ క్యాప్ లో లేదా స్పూన్‌ను ఉపయోగించి సరైన మొత్తాన్ని కొలవండి. అయితే ఇలా కొలిచే సమయంలో వంటగది చెంచాను ఉపయోగించవద్దు ఎందుకంటే ఇది సరైన మొత్తాన్ని కొలవదు.

డాక్టర్ షా చెప్పిన ప్రకారం ఏ సిరప్‌నైనా సరే ఎప్పుడూ అధిక మోతాదులో ఇవ్వొద్దు. అప్పటికీ ఉపశమనం పొందకపోతే పొరపాటున కూడా సొంత ఆలోచనలో ఎక్కువ మోతాదు పెంచవద్దు. ఈ విషయంలో వైద్యుడిని సంప్రదించండి. అంతేకానీ పిల్లలకు మీరే సొంతంగా చికిత్స చేయడానికి ఎప్పుడూ ప్రయత్నించవద్దు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)