కాలి వేళ్ల మధ్య గ్యాప్ మీ లవ్ లైఫ్ గురించి ఏం చెప్తుందో తెలుసా..? ఈ రహస్యాలు తెలిస్తే..
మన జాతకం అరచేతుల్లోనే కాదు.. మన పాదాల వేళ్లలో కూడా దాగి ఉంటుందని మీకు తెలుసా? చాలామంది పాదాల ఆకారాన్ని పెద్దగా పట్టించుకోరు, కానీ సముద్రిక శాస్త్రం ప్రకారం మీ కాలి బొటనవేలు, చూపుడు వేలు మీ ప్రేమ జీవితం గురించి ఎన్నో రహస్యాలను వెల్లడిస్తాయి. మీ భాగస్వామి స్వభావం ఏంటి? మీ వైవాహిక బంధం ఎలా ఉండబోతుది? అనే విషయాలను ఇలా తెలుసుకోండి..

సాధారణంగా మనం ముఖం, అరచేతులను చూసి ఎదుటివారి వ్యక్తిత్వాన్ని అంచనా వేస్తుంటాం. కానీ మన పాదాల ఆకారం, వేళ్ల మధ్య ఉండే దూరం కూడా మన జీవిత రహస్యాలను వెల్లడిస్తాయని మీకు తెలుసా? సముద్రిక శాస్త్రం ప్రకారం.. పాదాల ఆకృతిని బట్టి ఒక వ్యక్తి స్వభావం, వారి ప్రేమ జీవితం, వైవాహిక బంధం ఎలా ఉండబోతుందో ముందే తెలుసుకోవచ్చు. ముఖ్యంగా బొటనవేలు, చూపుడు వేలు ఇచ్చే సంకేతాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి.
వేళ్ల మధ్య దూరం లేదు.. అంటే బంధాలకు ప్రాధాన్యత
పాదాల బొటనవేలు, దాని పక్కనే ఉన్న చూపుడు వేలు ఒకదానికొకటి ఆనుకుని, దగ్గరగా ఉంటే.. వారు చాలా వివేకవంతులని శాస్త్రం చెబుతోంది. ఇలాంటి వారు సంబంధాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. గొడవలు అంటే వీరికి అస్సలు పడదు. కుటుంబంలో శాంతిని కాపాడటం కోసం వీరు ఎంతటి త్యాగానికైనా సిద్ధపడతారు.
ఖాళీ ఉంటే.. స్వతంత్ర భావాలు
బొటనవేలుకు, చూపుడు వేలుకు మధ్య స్పష్టమైన ఖాళీ కనిపిస్తుంటే.. ఆ వ్యక్తికి స్వతంత్ర ఆలోచనలు ఎక్కువగా ఉంటాయని అర్థం. వీరు ఎవరి కింద పనిచేయడానికి లేదా ఎవరి మాటా వినడానికి ఇష్టపడరు. ప్రేమ బంధంలో ఉన్నా సరే, తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఉండాలని కోరుకుంటారు. అయితే ఈ స్వభావం వల్ల అప్పుడప్పుడు భాగస్వామితో చిన్నపాటి విభేదాలు వచ్చే అవకాశం ఉంటుంది.
చూపుడు వేలు పొడవుగా ఉంటే లీడర్
చాలామందికి బొటనవేలు కంటే దాని పక్కన ఉన్న చూపుడు వేలు పొడవుగా ఉంటుంది. సముద్రిక శాస్త్రం ప్రకారం ఇది నాయకత్వ లక్షణానికి సంకేతం. ఇలాంటి వారు ఇంట్లో కానీ, ఆఫీసులో కానీ తమ మాటే చెల్లాలని కోరుకుంటారు. సంబంధాల్లో కీలక నిర్ణయాలు వీరే తీసుకుంటారు.
బొటనవేలు కంటే పొట్టిగా ఉంటే.. సున్నిత మనస్కులు
చూపుడు వేలు బొటనవేలు కంటే చిన్నదిగా ఉంటే, వారు చాలా ప్రశాంతమైన స్వభావం కలిగి ఉంటారు. ఇతరుల భావాలను గౌరవించడంలో వీరు ముందుంటారు. బంధాలను బ్యాలెన్స్ చేయడంలో వీరు నిపుణులు. ఎదుటివారికి చిన్న కష్టం వచ్చినా తట్టుకోలేని సున్నితత్వం వీరి సొంతం.
బొటనవేలు ఆకారం చెప్పే జీవిత సత్యం
గుండ్రంగా, బొద్దుగా ఉంటే: జీవితం చాలా సుఖమయంగా, సంతోషంగా సాగుతుందని అర్థం. వీరు అదృష్టవంతులుగా చెప్తారు.
సాఫ్ట్ లేదా వంగి ఉంటే: జీవితంలో పోరాటాలు, కష్టాలు ఎదురవుతాయని సూచిస్తుంది. అయితే, ఇలాంటి వారు చాలా సహనం కలిగి ఉంటారు. పట్టుదలతో అనుకున్నది సాధించే గుణం వీరిలో ఎక్కువగా ఉంటుంది.
