AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఎయిర్‌పోర్ట్‌లోని ఏసీలో ఏదో కదులుతూ కనిపించింది.. అంతలోనే వింత శబ్ధాలు..!

సాధారణంగా ఎయిర్‌పోర్ట్‌లు ఎప్పుడు ప్రయాణికుల రద్దీ, హై సెక్యూరిటీతో నిండి ఉంటుంది. ఇక్కడ చీమ కదిలినా తెలిసి పోతుంది. అలాంటి ఒక అంతర్జాతీయ విమానాశ్రయంలో ఒక్కసారిగా అలజడి మొదలైంది. అంతటి సెక్యూరిటీని దాటుకుని ఒక అనుకోని అతిథి విమానాశ్రయంలోకి ప్రవేశించింది. అంతేకాదు.. ఏకంగా ఎయిర్‌ పోర్టు సీలింగ్‌ ఎక్కేసింది. అది చూసిన ప్రయాణికులు, సిబ్బంది ఆందోళన చూడాలి.

Viral Video: ఎయిర్‌పోర్ట్‌లోని ఏసీలో ఏదో కదులుతూ కనిపించింది.. అంతలోనే వింత శబ్ధాలు..!
Mumbai Airport
Jyothi Gadda
|

Updated on: Apr 14, 2026 | 1:49 PM

Share

సాధారణంగా విమానాశ్రయాల్లో ప్రయాణికుల రద్దీ, విమానాల శబ్దాలు వినిపిస్తుంటాయి. కానీ, ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అనూహ్యంగా ఒక అతిథి ప్రత్యక్షమై అందరినీ హడలెత్తించింది.. ఒక కార్యాలయ గదిలోని ఏసీ యూనిట్ పైన సుమారు 7 అడుగుల భారీ జెర్రిపోతు (Rat Snake) కనిపించింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో, ఒక భారీ పాము ఏసీ వెనుక భాగంలో అత్యంత ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోవడం కనిపిస్తుంది. సిబ్బంది దీనిని గమనించి వెంటనే అధికారులకు ఫిర్యాదు చేశారు. విమానాశ్రయం వంటి హై-సెక్యూరిటీ, రద్దీ ప్రాంతంలో ఇంత పెద్ద పాము ఎలా ప్రవేశించిందనేది చర్చనీయాంశంగా మారింది.

సమాచారం అందుకున్న వెంటనే వన్యప్రాణి సంరక్షణ బృందం (Snake Rescuers) రంగంలోకి దిగింది. రెస్క్యూ టీమ్ సభ్యులు ఒక స్టిక్ సహాయంతో అత్యంత నేర్పుగా ఆ పామును ఏసీ పైనుంచి కిందకు దించారు. నిపుణుల ప్రకారం, జెర్రిపోతులు విషపూరితమైనవి కావు మరియు ఇవి సాధారణంగా ఎలుకల కోసం జనావాసాల్లోకి వస్తుంటాయి. అయితే, దాని భారీ పరిమాణం చూసి అక్కడి వారు భయాందోళనకు గురయ్యారు. పామును పట్టుకున్న అనంతరం దానికి ఎటువంటి గాయాలు కాలేదని నిర్ధారించుకుని, జనసంచారం లేని అటవీ ప్రాంతంలో సురక్షితంగా వదిలిపెట్టారు.

ఇవి కూడా చదవండి

ఈ సంఘటన వల్ల విమాన సర్వీసులకు ఎటువంటి అంతరాయం కలగలేదు. వన్యప్రాణుల రక్షణ పట్ల సిబ్బంది చూపిన సమయస్ఫూర్తిని నెటిజన్లు అభినందిస్తున్నారు. విమానాశ్రయ పరిసరాల్లో పచ్చదనం ఎక్కువగా ఉండటం వల్ల ఇలాంటి వన్యప్రాణులు అప్పుడప్పుడు కనిపిస్తుంటాయని అధికారులు తెలిపారు. కాగా, ఈ వీడియో గత ఫిబ్రవరిలో జరిగిన సంఘటనగా తెలుస్తోంది. కానీ, సోషల్ మీడియాలో మరోమారు వైరల్‌గా మారింది. దీంతో నెటిజన్లు మళ్లీ మళ్లీ షేర్లు, లైకులు చేస్తూ మరింత వైరల్‌గా మార్చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి…

Follow Us
ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలతో జనం..
ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలతో జనం..
పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..
పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ
శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..
శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..
ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!
ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!
విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..
విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..
దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!
దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!
పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు
పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు
న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!
న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!
మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..
మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..