AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mahesh Babu: మహేష్ బాబు లాంటి హీరోను ఎక్కడ చూడలేదు.. ఎలాంటి సపోర్ట్ లేకుండా బిల్డింగ్ పై నుంచి దూకేశాడు..

డి.ఓ.పి. యువరాజు మహేష్ బాబు అంకితభావం, సినీ రంగంలో తన ప్రయాణం గురించి ఇటీవల వెల్లడించారు. వన్ నేనొక్కడినే సినిమా షూటింగ్ సమయంలో మహేష్ బాబు డూప్ లేకుండా, 150 అడుగుల ఎత్తు నుండి దూకడం, లైఫ్ జాకెట్ లేకుండా బోట్ ఛేజ్ సీక్వెన్స్‌లో పాల్గొనడం వంటి సాహసాలు చేశారని యువరాజు తెలిపారు. ఆయన వృత్తి పట్ల అంకితభావం, సాహసం సెట్‌లో అందరినీ ఆశ్చర్యపరిచాయని చెప్పారు.

Mahesh Babu: మహేష్ బాబు లాంటి హీరోను ఎక్కడ చూడలేదు.. ఎలాంటి సపోర్ట్ లేకుండా బిల్డింగ్ పై నుంచి దూకేశాడు..
Mahesh Babu
Rajitha Chanti
|

Updated on: Apr 14, 2026 | 2:03 PM

Share

సుదీర్ఘ కాలంగా సినీ రంగంలో పనిచేస్తున్న ప్రసిద్ధ సినిమాటోగ్రాఫర్ (డి.ఓ.పి.) యువరాజు, తమ కెరీర్‌లోని కీలక సంఘటనలు, ప్రముఖ నటులు, దర్శకులతో తమ అనుభవాలను ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. మహేష్ బాబు అంకితభావం, అల్లు అర్జున్ ఎదుగుదల, దర్శకుడు అట్లీ ప్రతిభ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏ.ఐ.) సినిమాటోగ్రఫీపై చూపుతున్న ప్రభావం వంటి అనేక అంశాల గురించి మాట్లాడారు. వన్ నేనొక్కడినే చిత్రం షూటింగ్ సమయంలో జరిగిన రెండు సంఘటనలను యువరాజు వివరించారు. లండన్‌లో జరిగిన ఒక ఛేజ్ సీక్వెన్స్‌లో, మహేష్ బాబు 150 అడుగుల ఎత్తు నుండి డూప్ లేకుండా దూకారని ఆయన తెలిపారు. ఈ ప్రమాదకరమైన స్టంట్ సెట్‌లో ఉన్నవారందరినీ ఆశ్చర్యానికి గురి చేసిందని, ఒక చిన్న రోప్‌తో మాత్రమే మహేష్ బాబు ఈ రిస్క్ చేశారని చెప్పారు.

ఎక్కువ మంది చదివినవి : Cinema : థియేటర్లలో మూడు కోట్ల మంది చూసిన ఏకైక సినిమా.. విడుదలైన మూడు రోజులకే సంచలనం..

రెండవ సంఘటన బోట్ ఛేజ్ సీక్వెన్స్‌కు సంబంధించింది. లైఫ్ జాకెట్ లేకుండా మహేష్ బాబు అత్యంత వేగంగా బోట్‌ను నడిపారని, సుకుమార్ కూడా ఈ విషయాన్ని గతంలో ప్రస్తావించారని యువరాజు గుర్తుచేసుకున్నారు. సీన్‌కు తగ్గట్టుగా లైఫ్ జాకెట్ ధరించడం సాధ్యం కాకపోవడం వల్ల, మహేష్ బాబు ఎంతో ధైర్యంగా ఆ సన్నివేశాన్ని పూర్తి చేశారని, ఇది ఆయన నిజమైన హీరో అని నిరూపించిందని ప్రశంసించారు. ఫైట్ మాస్టర్ పీటర్ హెయిన్‌తో కలిసి లైఫ్ జాకెట్ వేసుకుని బోట్‌లో వెళ్ళినప్పుడు కూడా తమకు భయం వేసిందని, అలాంటిది మహేష్ బాబు ధైర్యం తమకు స్ఫూర్తినిచ్చిందని యువరాజు పేర్కొన్నారు.

ఎక్కువ మంది చదివినవి : Singer Mangli : అతడికి శ్రీముఖి పై క్రష్.. బిగ్ బాస్ కోసమే ఈ ప్లాన్.. మంగ్లీ సంచలన కామెంట్స్..

డి.ఓ.పి. యువరాజు తమ సినీ ప్రస్థానం అల్లు అర్జున్ ఆర్య చిత్రంతో ప్రారంభమైందని, ఆ సినిమాలో తాను చివరి అసిస్టెంట్‌గా పనిచేశానని వెల్లడించారు. అప్పటి నుండి అల్లు అర్జున్ పుష్ప వరకు సాధించిన ఘనత తనకు తెలుసునని అన్నారు. . అల్లు అర్జున్ ఎదుగుదల అందరికీ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.

ఎక్కువ మంది చదివినవి : Monalisa Bhosle: మోనాలిసా మిస్సింగ్.. సెల్ఫీ వీడియో రిలీజ్ చేసిన ఫర్మాన్ ఖాన్..

 

Follow Us