AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Singer Mangli : అతడికి శ్రీముఖి పై క్రష్.. బిగ్ బాస్ కోసమే ఈ ప్లాన్.. మంగ్లీ సంచలన కామెంట్స్..

ప్రముఖ తెలుగు సింగర్ మంగ్లీ ఇటీవల ఎక్కువగా వివాదాల్లో చిక్కుకుంటున్న సంగతి తెలిసిందే. పెట్టుబడుల పేరుతో 100మందిని పైగా ఆమె మోసం చేసింది అనే ఆరోపణలతో పాటు, తనను బెదిరించిందని పోలీసులకు ఫిర్యాదు చేశారు సుబ్బారావు అనే న్యాయవాది. అతడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మంగ్లీపై కేసు నమోదు చేశారు. దీనితో ఒక్కసారిగా మంగ్లీ వార్తల్లో నిలిచారు.

Singer Mangli : అతడికి శ్రీముఖి పై క్రష్.. బిగ్ బాస్ కోసమే ఈ ప్లాన్.. మంగ్లీ సంచలన కామెంట్స్..
Mangli
Rajitha Chanti
|

Updated on: Apr 13, 2026 | 10:53 AM

Share

రీసెంట్‌గా లాయర్ సుబ్బారావు రిలీజ్ చేసిన కరెన్సీ కట్టల కౌంటింగ్ వీడియో ఇది. ఇందులో ఉన్నది భరత్ చౌహన్‌. ఇతనితో పాటు మంగ్లీ సోదరుడు శివ మరికొందరు కలిసి అధిక వడ్డీ ఎరజూపి.. కోట్ల రూపాయల పెట్టుబడులు లాగారని ఆరోపించారాయన. ఈ టీమ్‌ వసూళ్లకి పాల్పడితే మంగ్లీ ప్రమోషన్ చేశారంటూ బాధితులతో కలిసి పోలీసులకు కంప్లయింట్ ఇచ్చారు. కాస్త లేటయినా ఘాటుగా రియాక్ట్ అయ్యారు మంగ్లీ. మనీ మ్యాటర్‌.. లాయర్ ఆరోపణలు.. ఈ రెండింటిని తిప్పికొట్టారు. తన వ్యక్తిత్వానికి భంగం కలిగేలా.. అసత్య ప్రచారాలు చేస్తున్నారంటూ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. కోట్ల రూపాయల స్కామ్ అంటూ జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం నిజం లేదన్నారామె.

బిగ్ బాస్ రియాల్టీ షోకు వెళ్లాలనే సుబ్బారావు కలలుగంటున్నారని.. ఆ డ్రీమ్‌లో భాగంగానే తనను సీన్‌లోకి లాగారని మంగ్లీ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాతో ఎదిగిన తనను.. అదే సోషల్ మీడియా అప్రతిష్టపాలు చేస్తుందని ఊహించలేదని మంగ్లీ కన్నీటిపర్యంతమయ్యారు. కాస్త ఎమోషనల్‌ అవుతూనే ఇన్వెస్ట్‌మెంట్‌ ఫ్రాడ్‌తో సంబంధం లేదని మంగ్లీ కుండబద్దలు కొట్టారు. మరి స్కీమ్ పేరుతో జరిగిన స్కామ్‌లో ఉన్నదెవరు? పైసా వసూల్‌ డైరెక్షన్‌ ఎవరిది? వీడియోలో కన్పిస్తోన్న డబ్బంతా ఎవరి చేతుల్లోకి వెళ్లిపోయింది? మంగ్లీ ఆరోపిస్తున్నట్టు ఫేమ్ అయ్యేందుకే అడ్వకేట్ సుబ్బారావు ఇంత హంగామా చేస్తున్నారా అన్నది పోలీసుల విచారణలోనే తేలాలి.

” నేను పాటే ప్రపంచంగా బతుకుతున్నాను. నాకు పాట తప్ప ఇంకొక వ్యాపారం తెలియదు. నాకు ఎలాంటి వ్యాపారాలు లేవు. పాటలతో నాకు ప్రజల నుంచి ఎలాంటి ఆదరణ వస్తుందో తెలుసు కదా. అలాంటప్పుడు నాకు మరో బిజినెస్ చేయాల్సిన అవసరం ఏంటి. సుబ్బారావు అనే న్యాయవాది సెలేబ్రిటిగా మారాలి అని టార్గెట్ పెట్టుకున్నారు. ఫేమస్ అవ్వడమే తన లక్ష్యం. అందుకే ఇలాంటి వివాదాలు పెట్టుకుంటున్నాడు. సుబ్బారావుకి భరతనాట్యం తెలుసు. సినిమాలు అంటే పిచ్చి. శ్రీముఖి అంటే క్రష్ అని చెప్పాడు. నా ద్వారా ఫేమస్ అయి బిగ్ బాస్ లోకి వెళ్ళాలి అనుకుంటున్నాడు. అందుకే నన్ను ఇలా ఇరికించాలి అని ప్రయత్నిస్తున్నాడు ” అంటూ ఎమోషనల్ అయ్యింది మంగ్లీ.

ఎక్కువ మంది చదివినవి : Rocket Raghava : జీవితంలో చెరుపుకోలేని తప్పు చేశా.. ఇప్పటికీ గిల్టీగా ఫీల్ అవుతున్నా.. సారీ అన్నా.. రాకేట్ రాఘవ..

Follow Us
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ఐయామ్‌ సారీ పానీపూరీ అంటున్న బిగ్ బాస్ కంటెస్టెంట్‌? వీడియో వైరల్
ఐయామ్‌ సారీ పానీపూరీ అంటున్న బిగ్ బాస్ కంటెస్టెంట్‌? వీడియో వైరల్
రూ.95 కోట్లతో స్పిరిట్ ఎయిర్‌లైన్స్ డేటాను సొంతం చేసుకున్న గూగుల్
రూ.95 కోట్లతో స్పిరిట్ ఎయిర్‌లైన్స్ డేటాను సొంతం చేసుకున్న గూగుల్
500లకు పైగా పాటలు.. ప్రతి సాంగ్ ఓ సంచలనం..
500లకు పైగా పాటలు.. ప్రతి సాంగ్ ఓ సంచలనం..
కోర్టు ఇచ్చే ఇంజక్షన్ ఆర్డర్ అంటే ఏమిటి?
కోర్టు ఇచ్చే ఇంజక్షన్ ఆర్డర్ అంటే ఏమిటి?
మా ఓటమికి ఆ ఇద్దరే కారణం.. శ్రీలంక కెప్టెన్ షాకింగ్ కామెంట్స్..!
మా ఓటమికి ఆ ఇద్దరే కారణం.. శ్రీలంక కెప్టెన్ షాకింగ్ కామెంట్స్..!
చన్నీళ్లా.. వేడి నీళ్లా? ఏ టైమ్‌లో ఏ నీటితో స్నానం చేస్తే మంచిది?
చన్నీళ్లా.. వేడి నీళ్లా? ఏ టైమ్‌లో ఏ నీటితో స్నానం చేస్తే మంచిది?
చిదంబర రహస్యం అంటే ఏమిటి? గర్భగుడి తెర వెనుక ఆధ్యాత్మిక సత్యం ఇదే
చిదంబర రహస్యం అంటే ఏమిటి? గర్భగుడి తెర వెనుక ఆధ్యాత్మిక సత్యం ఇదే
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర