Shravana Masam: శ్రావణ మాసంలో ఆకుకూరలు తినొద్దు అంటారు.. దీని వెనుక శాస్త్రీయకోణం ఏమిటంటే
శ్రావణ మాసంలో ఆకు కూరలు మాత్రమే కాదు మరికొన్ని వస్తువులను తినడం కూడా నిషేధించబడింది. మత విశ్వాసాల ప్రకారం పచ్చి పాలు, పెరుగును శివునికి నైవేద్యంగా సమర్పిస్తారు. అందువల్ల పచ్చి పాలను.. పాలతో తయారు చేసిన పదార్ధాలను తీసుకోవడం ఈ మాసంలో నిషేధించబడింది. హిందూ మతానికి చెందిన పూజా నియమాల ప్రకారం.. వెల్లుల్లి, ఉల్లిపాయ వంటి తామసిక ఆహారం తినడం కూడా నిషేధించబడింది.
హిందూ మతంలో శ్రావణ మాసం చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఈ మాసం అమ్మవార్లకు మాత్రమే కాదు శివునికి చాలా ప్రీతికరమైనది. అందుకే ఈ నెలలోని సోమవారం శివుని పూజించడానికి చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ మాసంలో పూజకు సంబంధించిన నియమాలను పాటించడమే కాకుండా.. భోజనం చేసేటప్పుడు, త్రాగేటప్పుడు కూడా కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. శ్రావణ మాసంలో ఆకు కూరలు తినడం అశుభం అని ఒక నమ్మకం. దీని వెనుక శాస్త్రీయ కోణం కూడా దాగుందని అంటారు పెద్దలు.
శివుడిని పూజ ప్రాముఖ్యత
పురాణాల ప్రకారం శివుడు శ్రావణ మాసంలో తన అత్తమామల ఇంటికి వెళ్తాడని నమ్మకం. అక్కడ అతనికి గొప్ప వైభవంగా ఘన స్వాగతం పలికి అభిషేకం చేసినట్లు పురాణాల కథనం. శ్రావణ మాసంలో పరమశివుడు, పార్వతీదేవి భూమిపై నివసిస్తారని అందుకే ఈ సమయంలో పూజలు చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని నమ్మకం.
శ్రావణ మాసంలో వీటిని పొరపాటున కూడా తినకండి
శ్రావణ మాసంలో ఆకు కూరలు మాత్రమే కాదు మరికొన్ని వస్తువులను తినడం కూడా నిషేధించబడింది. మత విశ్వాసాల ప్రకారం పచ్చి పాలు, పెరుగును శివునికి నైవేద్యంగా సమర్పిస్తారు. అందువల్ల పచ్చి పాలను.. పాలతో తయారు చేసిన పదార్ధాలను తీసుకోవడం ఈ మాసంలో నిషేధించబడింది. హిందూ మతానికి చెందిన పూజా నియమాల ప్రకారం.. వెల్లుల్లి, ఉల్లిపాయ వంటి తామసిక ఆహారం తినడం కూడా నిషేధించబడింది.
ఆకుకూరలు ఎందుకు తినకూడదంటే?
శాస్త్ర నియమాల ప్రకారం శ్రావణ మాసంలో ఆకు కూరలను తినకూడదు. శివునికి ప్రకృతి అంటే చాలా ఇష్టం అని నమ్ముతారు. అటువంటి పరిస్థితిలో ఆకుకూరలను తినడం మంచిది కాదని.. శివుడి ఆగ్రహిస్తాడని విశ్వాసం. ఆకు కూరలు తిన వద్దు అనడానికి మతపరమైన కారణాలతో పాటు… కొన్ని శాస్త్రీయ కారణాలు కూడా ఉన్నాయి. శ్రావణ మాసంలో ఆకుకూరల్లో పిత్తాన్ని పెంచే అంశాలు అధికంగా ఉంటాయి. ఇవి జీర్ణక్రియలో సమస్యలను కలిగిస్తాయి. మరోవైపు ఈ నెలలో ఎక్కువ వర్షం కురుస్తుంది. భారీ వర్షం కారణంగా ఆకుకూరల్లో కీటకాలు గుడ్లు పెడతాయి. అటువంటి పరిస్థితిలో ఆకు కూరలు శ్రావణ మాసంలో తినడం మంచిది కాదు..ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి కనుక ఈ నియమం పెట్టి ఉంటారు పెద్దలు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు