Telugu News Photo Gallery Monsoon Health Tips: These Herbal Tea Best Consumed During Monsoon For Immunity
Monsoon Health Tips: జలుబు దగ్గుతో ఇబ్బంది పడుతున్నారా..! మెడిసిన్ బదులు ఈ హెర్బల్ టీలను ట్రై చేసి చూడండి..
వేసవి నుంచి ఉపశమనం ఇస్తూ వర్షాలు కురుస్తున్నాయి. ఓ వైపు వర్షాలు పడుతుంటే మరోవైపు ఎండ వేడి ఇబ్బంది పెడుతోంది. విభిన్న వాతావరణంతో చాలా ఈజీగా సీజనల్ వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ వాతావరణ మార్పు వల్ల ఎక్కువుగా జలుబు, దగ్గు సమస్య పెరుగుతోంది. వర్షాకాలంలో ఈ వ్యాధి సంక్రమణ ప్రమాదాన్ని నివారించడానికి రోజువారీ ఆహారంలో హెర్బల్ టీని చేర్చుకోవాలి. వర్షాకాలంలో ఈ హెర్బల్ టీలు మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. ఈ సీజన్ లో దగ్గు జలుబు నుంచి ఉపశమనం కోసం ఈ హెర్బల్ టీలను ట్రై చేసి చూడండి..