Feng shui tips: ఈ ఐదు లక్కీ వస్తువులు ఇంట్లో పెట్టుకుంటే డబ్బుకు కొదవ ఉండదు..! వెంటనే తెచ్చేసుకోండి..

China Vastu Tips: మనకు వాస్తుశాస్త్రం ఎలానో చైనీయులకు ఫేంగుషుయీ అనే గ్రంథాన్ని ఆచరిస్తారు. ఇంట్లో సుఖ సంతోషాలతో పాటు అభివృద్ధి మార్గాలు అందులో ప్రస్తావించిబడింది. చైనా వాస్తుశాస్త్రం ప్రకారం కొన్ని వస్తువుల్ని ఇంట్లో లేదా ఆఫీసులో పెట్టుకోవటం వల్ల చుట్టుపక్కల పరిసరాల్లో పాజిటివిటీ అలముకుంటుంది. ఆ వ్యక్తి జీవితంలో సుఖ సంతోషాలు నెలకొంటాయని నమ్ముతారు. ప్రతి వ్యక్తి అదృష్టం మారిపోయే..ముఖ్యమైన 5 వస్తువుల గురించి ఫేంగ్‌షుయీలో ప్రస్తావించారు. ఈ వస్తువుల్ని మీ ఇంట్లో ఉంచడం వల్ల లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుందని నమ్ముతారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

Jyothi Gadda

|

Updated on: Jul 10, 2024 | 5:28 PM

Tortoise- పురాణాల ప్రకారం తాబేలు విష్ణుమూర్తికి ప్రతి రూపంగా భావిస్తారు. విష్ణుమూర్తి దశావతారాలలో కూర్మవతారం కూడా ఉంది. ఇదే కాదు ఫెంగ్ షూయి ప్రకారం ఇంట్లో తాబేలు ఉంచడం చాలా శుభప్రదంగా పరిగణిస్తారు. ఇంటి ఉత్తర దిశ సంపదకు దేవుడైన కుబేరుడికి సంబంధించినది. కావున తాబేలును ఆక్వేరియంలో ఉత్తర దిక్కున ఉంచితే ఆర్థిక సమస్యలు తీరుతాయి. ఉత్తర దిశలో తాబేలు ఉంచడం వల్ల కుబేరుడి ఆశీస్సులు లభిస్తాయి. తాబేలు ఉన్న చోట లక్ష్మీదేవి నివసిస్తుందని అంటారు.

1 / 5
Laughing Buddha- చైనీస్‌ వాస్తు శాస్త్రం ప్రకారం..లాఫింగ్ బుద్ధ బొమ్మను ఇంట్లో ఉంచడం శుభప్రదంగా భావిస్తారు. ఇంట్లో లాఫింగ్ బుద్ధ పెడితే ఆ ఇంట్లో శ్రేయస్సు నెలకొంటుందని నమ్ముతారు. లాఫింగ్ బుద్ధను ఎక్కువగా మెయిన్ డోర్ ముందు పెడుతుంటారు. ఇలా చేస్తే మీరు ఇంట్లోకి వచ్చిన వెంటనే మీ చూపు లాఫింగ్ బుద్ధపై పడుతుంది. ఇది ఇంటికి సంతోషాన్నిస్తుందని, అదృష్టంతో పాటు ఆర్థిక లాభాలను కలిగిస్తుందని విశ్వాసం.

2 / 5
Aquarium- చేపల అక్వేరియం ఇంట్లో ఉంటే వారికి డబ్బు కొరత ఉండదని అంటారు. వాస్తు శాస్త్రంలో కూడా చేపల అక్వేరియం పెట్టుకోవడం శుభకరంగా పేర్కొనబడింది. మీరు ఆర్థికంగా బలహీనంగా ఉంటే మీ ఇంటికి ఫిష్ అక్వేరియం తీసుకురండి. ఇంట్లో చేపల అక్వేరియం ఉంచడం వల్ల ఇంట్లోని పేదరికం తొలగిపోతుంది. అయితే అక్వేరియంలో వేసే చేపల సంఖ్య కూడా చాలా ముఖ్యం. ఇందులో గోల్డ్ ఫిష్ వేసుకోవడం వల్ల ఆర్థికంగా బలపడతారని నమ్ముతారు.

3 / 5
Jade Plant- ఈ మొక్కను కుబేర మొక్కగా చెబుతుంటారు. ఇది ఎక్కువగా ప్రాచుర్యంలో ఉంది. చిన్న చిన్న ఆకులు కలిగిన ఈ జడే మొక్క చాలా అదృష్టమని భావిస్తారు. ఇంటి ప్రవేశ ద్వారం వద్ద ఈ మొక్కను ఉంచడం వల్ల సానుకూల శక్తి వస్తుంది. ప్రతికూల శక్తి తొలగిపోతుందని నమ్ముతారు. ఈ మొక్క ఆక్సిజన్‌ను పెంచడమే కాకుండా ఆనందం, శ్రేయస్సును కూడా పెంచుతుంది.

4 / 5
Chinese Coins-  ఫెంగ్ షూయి శాస్త్రంలో చైనీస్ నాణేలకు గొప్ప ప్రాముఖ్యత ఉంది. ఈ నాణేలను ఎర్రటి గుడ్డలో కట్టి భద్రంగా ఉంచడం వల్ల పేదరికం తొలగిపోయి, సంతోషం, ఐశ్వర్యం లభిస్తాయని నమ్ముతారు. వీటిని ఇంట్లో వేలాడదీయడం లేదా పూజ గదిలో ఉంచుకోవడం శుభకారంగా భావిస్తారు.

5 / 5
Follow us