Sravana Masam 2024: శ్రీశైలంలో ఆగస్ట్ 5 నుండి సెప్టెంబర్ 3 వరకు శ్రావణ మాసోత్సవాలు..

నంద్యాల జిల్లా శ్రీశైల మహాక్షేత్రంలో ఆగష్టు 5 నుండి సెప్టెంబర్ 3 వరకు దేవస్థానం శ్రావణ మాసోత్సవాలు నిర్వహించనుంది శ్రావణ మసోత్సవాలపై ఆలయ ఈవో పెద్దిరాజు దేవస్థానం అధికారులు, అర్చకులు,సిబ్బందితో దేవస్థానం పరిపాలన భవనంలో సమీక్ష సమావేశం నిర్వహించారు.

Sravana Masam 2024: శ్రీశైలంలో ఆగస్ట్ 5 నుండి సెప్టెంబర్ 3 వరకు శ్రావణ మాసోత్సవాలు..
Srisailam
Follow us

| Edited By: Rajitha Chanti

Updated on: Jul 09, 2024 | 9:04 PM

శ్రావణమాసం వచ్చేస్తోంది. భక్తిని పవిత్రతను మంచిని మోసుకొచ్చే శ్రావణమాసం కోసం అందరూ ఎదురుచూస్తున్న రోజులు అప్పుడే వచ్చేస్తున్నాయి. శ్రీశైలంలో ఆగస్టు 5 నుండి సెప్టెంబర్ 3 వరకు శ్రావణ మాసోత్సవాలు భక్తులకు సకల ఏర్పాట్లు చేస్తామన్నారు ఈవో పెద్దిరాజు . నంద్యాల జిల్లా శ్రీశైల మహాక్షేత్రంలో ఆగష్టు 5 నుండి సెప్టెంబర్ 3 వరకు దేవస్థానం శ్రావణ మాసోత్సవాలు నిర్వహించనుంది. శ్రావణ మసోత్సవాలపై ఆలయ ఈవో పెద్దిరాజు దేవస్థానం అధికారులు, అర్చకులు,సిబ్బందితో దేవస్థానం పరిపాలన భవనంలో సమీక్ష సమావేశం నిర్వహించారు.

శ్రావణమాసంలో భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తారని వారికి ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా శ్రీస్వామి అమ్మవారిని దర్శించుకునేల ఏర్పాట్లు చేయాలన్నారు. అలానే శ్రావణమాసం శని, ఆది, సోమ, శ్రవణ పౌర్ణమి, స్వాతంత్ర్య దినోత్సవం, వరలక్ష్మి వ్రతం రోజులలో గర్భాలయ, సామూహిక అభిషేకాలు, అమ్మవారి కుంకుమార్చనలు మొత్తంగా 16 రోజుల పాటు పూర్తిగా నిలుపుదల ఈవో పెద్దిరాజు అన్నారు. శ్రావణ మాసంలో ఆగస్టు 15 నుండి 19 తేదీలలో మినహా మిగిలిన అన్ని రోజులలో రోజుకు 4 విడతలుగా శ్రీస్వామివారి స్పర్శ దర్శనానికి అవకాశం కల్పించినట్లు ఈవో పెద్దిరాజు తెలిపారు. అలానే శ్రవణ మసోత్సవాలలో వేకువజామున 3 గంటలకు ఆలయ ద్వారాలు తెరచి ప్రాతకాల పూజల అనంతరం ఉదయం 5:30 నుండి రాత్రి 11 భక్తులను దర్శనాలు కల్పిస్తామన్నారు. ముఖ్యంగా లోక కళ్యాణార్ధం శివనామస్మరణతో శివ సప్తాహ భజనలు 7 భక్తబృందాలచే ఏర్పాటు చేస్తామన్నారు.

శ్రావణ రెండు,నాలుగోవ శుక్రవారాలలో ముత్తైదువులకు ఉచితంగా సామూహిక వరలక్ష్మీవ్రతాలు,నాలుగోవ శుక్రవారం 500 మంది చెంచు గిరిజన మహిళలకు ఉచితంగా వరలక్ష్మి వ్రతాలు నిర్వహిస్తామని ఆలయ ఈవో పెద్దిరాజు తెలిపారు.