మొహర్రం అసలు రహస్యం ఇదే..! బీబీకా ఆలంలో వెలకట్టలేని వజ్రాలు..

మొహర్రం వేడుకల్లో మాత్రం ఇలా చేస్తూ తమ సంతాపాన్ని తెలియజేస్తారు. పాతబస్తీలో బీబీకా ఆలం ఊరేగింపు కోసం హైదరాబాద్ దక్షిణ మండలం పోలీసులు భారీగా భద్రత ఏర్పాటు చేశారు. చార్మినార్ దగ్గర బీబీకా ఆలంను చూసేందుకు రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు పెద్దఎత్తున తరలివస్తుంటారు.

మొహర్రం అసలు రహస్యం ఇదే..! బీబీకా ఆలంలో వెలకట్టలేని వజ్రాలు..
Muharram Festival Diamonds
Follow us

| Edited By: Jyothi Gadda

Updated on: Jul 09, 2024 | 7:19 PM

ఇస్లాం మతంలో మొహర్రం చాలా ప్రత్యేకమైనది. దీనిని నూతన సంవత్సరంగా జరుపుకుంటారు. ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం మొహర్రం ఇస్లాం మొదటి నెల. బక్రీద్ తర్వాత మొహర్రాన్ని జరుపుకుంటారు. ఇస్లామిక్ క్యాలెండర్‌లో 12 నెలలు ఉంటాయి. వాటిలో 4 అత్యంత పవిత్రమైనవిగా పరిగణించబడుతున్నాయి. వీటిలో జుల్-ఖదా, జుల్-హిజ్జా, మొహర్రం, రజబ్. అల్లా దయ, ఆశీర్వాదాలు పొందడానికి ఈ నెలలు అత్యంత పవిత్రమైనవిగా ముస్లింలు భావిస్తారు. మొహర్రం సమయంలో దానధర్మాలు చేయడం చాలా శుభప్రదం. ఇలా చేయడం వల్ల అల్లా ఆశీస్సులు ఏడాది పొడవునా ఉంటాయని నమ్ముతారు.

ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం ఈ సంవత్సరం మొహర్రం జూలై 7, 2024 నుంచి ప్రారంభమై, జూలై 17న అషురా జరుపుకుంటారు. ఒకవైపు మొహర్రంను నూతన సంవత్సరంగా జరుపుకుంటారు. అంతేకాకుండా సంతాప దినంగా కూడా పరిగణిస్తారు. మొహర్రం 10వ రోజుని యౌమ్-ఎ-అషురా అని పిలుస్తారు. ఇస్లామిక్ విశ్వాసాల ప్రకారం హజ్రత్ ఇమామ్ హుస్సేన్ ఈ రోజున అమరుడయ్యాడు. ప్రజలు హజ్రత్ ఇమామ్ హుస్సేన్ బలిదానం జ్ఞాపకార్థం మొహర్రం 10వ రోజును సంతాపంగా జరుపుకుంటారు. దీనిని అషూరా అని పిలుస్తారు. కొంతమంది ఇమామ్ హుస్సేన్ బలిదానం జ్ఞాపకార్థం ఈ రోజున ఊరేగింపు కూడా జరుపుతారు.

షియా, సున్నీ కమ్యూనిటీలు మొహర్రం గురించి భిన్నమైన నమ్మకాలను కలిగి ఉంటారు. ఇద్దరూ ఈ రోజును వివిధ రకాలుగా జరుపుకుంటారు. ఉపవాసం ఉండడం వల్ల అల్లా సంతోషిస్తాడని, ఆయన ఆశీస్సులు ఉంటాయని చెబుతారు. సున్నీ కమ్యూనిటీ ప్రజలు 9, 10 తేదీలలో ఉపవాసం ఉంటారు. మొహర్రం జూలై 17వ తేదీ హైదరాబాద్​లోని పాతబస్తీలో బీబీకా ఆలం ఊరేగింపును భక్తి, శ్రద్ధలతో నిర్వహించనున్నారు. డబీర్‌పురలో ప్రారంభమైన బీబీకా ఆలం ఊరేగింపు పలు ప్రాంతాలమీదుగా చాదర్​ఘాట్​ వరకు కొనసాగనుంది.

ఇవి కూడా చదవండి

బోనాలు, మొహర్రం ఊరేగింపు కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా కర్ణాటక నుంచి గజరాజును తీసుకురానున్నారు. అయితే బీబీకా ఆలంతో పాటు ఇతర పీర్లకు నిజాం ప్రభు ప్రత్యేకంగా వెలకట్టలేనన్ని వజ్రాలు, బంగారు ఆభరణాలు బహుకరించారని చెబుతారు. ముఖ్యంగా బీబీకా ఆలంలోని ప్రత్యేక సంచుల్లో చివరి నిజాం మీర్‌ ఉస్మాన్ అలీ ఖాన్ లెక్క కట్టలేని వజ్రాలు ఉంచారని అంటున్నారు. అలం అంటే పీరు.. అలంకు కట్టిన నల్ల సంచుల్లోనే వజ్రాలు ఉంటాయి. బీబీకా ఆలం ప్రతిష్ట జరిగిన నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు బీబీకా అలవా పరిసర ప్రాంతాల్లో భద్రత ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాలతో ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు. ఉత్సవం ముగిసిన తర్వాత ప్రభుత్వం ఈ వజ్రాలను స్వాధీనం చేసుకుంటుందని అంటున్నారు.

త్యాగానికి ప్రతీకగా నిలిచే మొహర్రం సందర్భంగా సంతాప దినాల్లో భాగంగా షియా ముస్లింలు కత్తులతో, బ్లేడ్లతో తమ శరీరాలపై కొట్టుకుంటూ రక్తాన్ని చిందిస్తారు. మొహర్రం వేడుకల్లో మాత్రం ఇలా చేస్తూ తమ సంతాపాన్ని తెలియజేస్తారు. పాతబస్తీలో బీబీకా ఆలం ఊరేగింపు కోసం హైదరాబాద్ దక్షిణ మండలం పోలీసులు భారీగా భద్రత ఏర్పాటు చేశారు. చార్మినార్ దగ్గర బీబీకా ఆలంను చూసేందుకు రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు పెద్దఎత్తున తరలివస్తుంటారు.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి.