Shani – Shiva: ఒకే రోజు మహాశివరాత్రి, శనిత్రయోదశి.. అదృష్టమా.? అరిష్టమా.? పండితులు ఏమన్నారంటే..!
ఓ వైపు పండుగ.. మరోవైపు పరేషాన్.. మహాశివరాత్రి ముంగిట్లో మహా సంకటకం. శివుడిని తలవాలా? శనిని కొలవాలా? శివరాత్రి రోజే శనిత్రయోదశి..
ఓ వైపు పండుగ.. మరోవైపు పరేషాన్.. మహాశివరాత్రి ముంగిట్లో మహా సంకటకం. శివుడిని తలవాలా? శనిని కొలవాలా? శివరాత్రి రోజే శనిత్రయోదశి.. చాలా అరుదుగా వచ్చే ఈ సందర్బం అదృష్టమా? అరిష్టమా? తొలి పూజ ఎవరికి చేయాలి? శివారాధానా చేయాలా? శనేశ్వరుడిని అభిషేకించాలా? ఈ నెల 18 శనివారం నాడు మహా శివరాత్రి. అదే రోజు మరో అత్యంత అరుదైన సంఘటన కూడా జరగబోతోంది. మహా శివరాత్రి నాడే శని త్రయోదశి కూడా రాబోతోంది. ఇదే ఇప్పుడు ఉత్కంఠను రేపుతోంది.
మహా శివరాత్రి నాడు శని త్రయోదశి రావడం ఎలాంటి ఫలితాలను ఇస్తుంది. ఇది అదృష్టమా? అరిష్టమా? అసలు శివరాత్రి నాడు ప్రథమ పూజ ఎవరికి చేయాలి అనే ధర్మ సందేహం కొందరు వెలిబుచ్చుతున్నారు. ఈశ్వరుడికి తొలి పూజ చేస్తే శనీశ్వరుడికి ఆగ్రహం వస్తుందా? శనీశ్వరుడికి ప్రథమ తాంబూలం ఇస్తే ముక్కంటి మూడో కన్ను తెరుస్తాడా? ఎవరికి ముందు పూజ చేస్తే ఏం కొంప మునుగుతుందో అనే సంకటంలో పడ్డారు భక్తులు. మహా శివరాత్రి నాడు శివుడికే తొలి పూజ చేయాలని కొందరు అంటుంటే, శనీశ్వరుడికే అగ్ర తాంబూలం ఇవ్వాలంటున్నారు మరికొందరు. ఇలా పండితుల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇక ఈ వాదనలతో భక్తులు మరింత అయోమయానికి గురవుతున్నారు.
జాతకంలో శని దోషం ఉన్నవాళ్లు, ఏలిన్నాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని దశలు నడుస్తున్నవాళ్లు…ప్రతి శనివారం శనీశ్వరుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేసి, నల్ల వస్త్రాలు, నల్ల నువ్వులు దానం ఇస్తారు. అలాగే శనీశ్వరుడి వాహనమైన కాకికి బెల్లం నివేదిస్తారు. దీనివల్ల శని దోషం తొలగిపోతుందని భక్తుల విశ్వాసం. శని త్రయోదశి నాడు చేస్తే మరింత ఫలితం వస్తుందని భక్తులు నమ్ముతారు. అయితే ఈసారి మహా శివరాత్రి రోజే శని త్రయోదశి రావడంతో ఏం చేయాలా అనే ఆలోచనలో పడ్డారు భక్తులు. శనిగ్రహ ప్రభావంపై ఎన్నెన్నో కథలు ప్రాచూర్యంలో ఉండనే ఉన్నాయి. శివుడంతటి వాడికి సైతం శని ఎఫెక్ట్ తప్పలేదంటారు. శివుడు అంతటివాడికి కూడా శని దోషం తప్పలేదు. ఈశ్వరుడ్ని కూడా శని వదల్లేదు. పట్టుకున్నాడు. దీని వెనుక కథ ఉండనే ఉంది మరి.
శని కరుణిస్తే కష్టాలుండవు. శని కన్నెర్ర చేస్తే మటాషే. ఈశ్వరుడికైనా. సరే శని దోషం తప్పదు. శని.. యముడికి సోదరుడు. జ్యేష్టాదేవికి భర్త. శివుడికి పరమ భక్తుడు. అతని భక్తిని పరీక్షించాలనుకున్నాడు పరమేశ్వరుడు. శనీశ్వరా..! నేనంటే నీకు చాలా ప్రీతి కదా. నేను ఏ రూపంలో వున్నా సరే నన్ను గుర్తుపట్టగలవా? అని అడిగాట. తప్పకుండా అని బదులిచ్చాడట శని. అంతే శనిని టెస్ట్ చేసేందుకు శివుడు సూర్యోదయం వేళ బిల్వవృక్షంగా మారాడాట. సాయంత్రానికి మళ్లీ మాములు రూపంలో ప్రత్యక్షమయ్యాడు. బిల్వ వృక్షం నుంచి తన అసలు రూపంలోకి వచ్చిన శివుడికి శని కన్పించాడట. శనీశ్వరా నన్ను పట్టుకోలేకపోయావుగా అన్నాడట ఈశ్వరుడు. అదేంటి స్వామి నేను పట్టుకోవడం వల్లే కదా మీరు బిల్వ వృక్ష రూపం దాల్చాల్సి వచ్చింది అన్నాడట శివుడు. అలా ఈశ్వరుడికి కూడా శని ఎఫెక్ట్ తప్పదలేదన్న మాట. మొత్తానికి శని భక్తిని మెచ్చాడు శివుడు. అలా శనీ కాస్తా శనీశ్వరుడయ్యాడు. బిల్వదళాలతో పూజిస్తే శనీశ్వరుడు కరుణిస్తాడని.. శుభాలను అనుగ్రహిస్తాడని భక్తుల నమ్మకం.