AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shabarimala: శబరిమల ఆలయంలో మండల పూజ ఎప్పుడు? పూజా విధానం, ప్రాముఖ్యత తెలుసుకోండి

శబరిమలలోని అయ్యప్పను దర్శించుకోవడానికి దేశ విదేశాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు వస్తారు. అయ్యప్ప ఆలయంలో నిర్వహించే మండల పూజ, మకర జ్యోతి దర్శనానికి అత్యంత విశిష్టత ఉంది. ఈ పూజల సమయంలో సుదూర ప్రాంతాల నుంచి భక్తులు అయ్యప్ప ఆలయానికి వస్తుంటారు. మండల పూజ సమయంలో ఆలయం ఎల్లప్పుడూ తెరిచి ఉంటుంది? భక్తులు ఏ సమయంలోనైనా భగవంతుని దర్శనం చేసుకోవచ్చు? పురాణాలలో మండల పూజ ప్రస్తావన ఏమిటో తెలుసుకుందాం..

Shabarimala: శబరిమల ఆలయంలో మండల పూజ ఎప్పుడు? పూజా విధానం, ప్రాముఖ్యత తెలుసుకోండి
Sabarimala Mandala Puja 2024
Surya Kala
|

Updated on: Dec 18, 2024 | 6:54 PM

Share

కేరళలోని శబరిమల ఆలయంలో మండల పూజ నిర్వహణ కోసం ఏర్పాట్లు ఘనంగా చేస్తున్నారు. శబరిమల ఆలయం అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు మాల ధరించి నియమ నిష్టలతో 41 రోజుల పాటు దీక్షగా ఉండి స్వామీ దర్శనం కోసం వెళ్తారు. మండల పూజతో అయ్యప్ప స్వామి భక్తులు చేసే 41 రోజుల మండల దీక్ష ముగుస్తుంది. మండల కాలంలో అయ్యప్ప స్వామి భక్తులు మండల పూజను ఎంతో వైభవంగా నిర్వహిస్తారు. ఈ పూజ చేసేవారికి పాజిటివ్ ఎనర్జీ లభిస్తుందని నమ్ముతారు.

మండల పూజ తేదీ, శుభ సమయం ఎప్పుడంటే

ఈ ఏడాది డిసెంబర్ 26వ తేదీ గురువారం శబరిమల ఆలయంలో మండల పూజ నిర్వహించనున్నారు. మండల పూజ శుభ ముహూర్తం తెల్లవారుజామున 4.54 గంటలకు బ్రహ్మ ముహూర్తం ప్రారంభమవుతుంది. ఇది సాయంత్రం 5:48 గంటల వరకు కొనసాగుతుంది. ఉదయం 11.38 గంటలకు అభిజీత్ ముహూర్తం ప్రారంభమవుతుంది. ఇది మధ్యాహ్నం 12.20 గంటల వరకు కొనసాగుతుంది. మధ్యాహ్నం 1:44 గంటలకు విజయ ముహూర్తం ప్రారంభమవుతుంది. ఇది మధ్యాహ్నం 2:27 వరకు కొనసాగుతుంది. కాగా అమృత కాలం ఉదయం 8.20 గంటలకు ప్రారంభమవుతుంది. ఇది రాత్రి 10.07 గంటల వరకు కొనసాగుతుంది.

మండల పూజ సమయంలో గుర్తుంచుకోవలసిన విషయాలు

  1. మండల పూజ సమయంలో ఉపవాసం ఉండాలి.
  2. పూజ సమయంలో స్వచ్ఛమైన, సరళమైన జీవితాన్ని గడపాలి.
  3. ఇవి కూడా చదవండి
  4. ఉపవాస రోజుల్లో శరీరాన్ని శుభ్రంగా , మనస్సును స్వచ్చంగా ఉంచుకోవాలి.
  5. భక్తులు 41 రోజులపాటు ప్రాపంచిక సుఖాలను వదులుకుని జీవించాలి.
  6. ఈ కాలంలో మద్యపానం, ధూమపానం చేయకూడదు.
  7. భక్తులు రోజుకు రెండుసార్లు అయ్యప్ప స్వామికి పూజ చేస్తూ ప్రార్థనలు చేయాలి.
  8. దీక్ష పూర్తి అయిన తర్వాత అయ్యప్ప స్వామికి ‘ఇరుముడి’ సమర్పించాలి.
  9. ఈ దీక్షను తీసుకున్న భక్తులు మంచంపై నిద్రపోకూడదు.
  10. ఈ సమయంలో భక్తులు పాదరక్షలు దరించరు.
  11. ఈ దీక్ష సమయంలో దానధర్మాలు కూడా చేయాలి.

మండల పూజ ప్రాముఖ్యత

శబరిమల ఆలయంలో నిర్వహించే మండల పూజ చాలా ప్రసిద్ధి చెందినది. పూజల సమయంలో సుదూర ప్రాంతాల నుంచి భక్తులు అయ్యప్ప ఆలయానికి వస్తుంటారు. మండల పూజ సమయంలో ఆలయం ఎల్లప్పుడూ తెరిచి ఉంటుంది. భక్తులు ఏ సమయంలోనైనా భగవంతుని దర్శనం చేసుకోవచ్చు. మండల పూజ గురించి అనేక పురాణాలలో ప్రస్తావించబడింది. ఈ పూజ ప్రాముఖ్యత పురాణాలలో కూడా వివరించబడింది. నమ్మకాల ప్రకారం మండల పూజ చేసే వ్యక్తి జీవితం పూర్తిగా మారిపోతుంది. అయ్యప్ప తన భక్తుల పూజకు సంతోషిస్తాడు.. వారి కోరికలన్నింటినీ తీరుస్తాడని నమ్మకం.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..