Pitru Paksha: పూర్వీకులు చేసిన పాపాలు ప్రస్తుత తరంకు శాపాలా .. అవి పోవాలంటే ఈరోజు ఏం చేయాలంటే..

Sarva Pitru Amavasya 2021: మన హిందూ సనాతన ధర్మ శాస్త్రములలో ఈ పితృ పక్ష శ్రాద్ద కర్మ కాండలు అతి ముఖ్యమైనదిగా భావిస్తారు. ఈ శ్రాద్ద కార్యమాలను గతించిన..

Pitru Paksha: పూర్వీకులు చేసిన పాపాలు ప్రస్తుత తరంకు శాపాలా .. అవి పోవాలంటే ఈరోజు ఏం చేయాలంటే..
Pitru Paksha 2021
Follow us
Surya Kala

|

Updated on: Oct 03, 2021 | 8:59 AM

Sarva Pitru Amavasya 2021: మన హిందూ సనాతన ధర్మ శాస్త్రములలో ఈ పితృ పక్ష శ్రాద్ద కర్మ కాండలు అతి ముఖ్యమైనదిగా భావిస్తారు. ఈ శ్రాద్ద కార్యమాలను గతించిన మన పితృ దేవతల ఆత్మశాంతికై చేసే కార్యములుగా వివరించబడ్డాయి. పితృలు తమ ఆత్మ శాంతిని పొంది..  తమ వారసులకు ధన , వస్తు , వాహన కనక , ఆయురారోగ్యములను ప్రసాదిస్తారని శాస్త్రముల యందు చెప్పబడినది. ఈ పితృ పక్ష అమావాస్య నాడు అశ్విన్ నెల అమావాస్య నాడు పితృ పక్షం ముగుస్తుంది. ఈ తేదీని సర్వ పితృ అమావాస్య అంటారు. ఈ రోజు పూర్వీకులకు శ్రాద్ధం  , తర్పణం కర్మలను చేయడం ద్వారా ప్రత్యేక ఫలాలను పొందవచ్చు.

16 రోజుల పాటు జరిగే పితృ పక్షంలో.. పూర్వీకులు భూమిపైకి వచ్చి కుటుంబ సభ్యుల నుండి ఆహారం, నీటిని తీసుకుంటారు. ఈ సమయంలో పితృ పక్షంలో పూర్వీకులకు తర్పణం సమర్పించడం వల్ల పితృ దోషం నుండి  విముక్తి లభిస్తుంది. అంతేకాదు ఈ సమయంలో విడిచే తర్పణంతో పూర్వీకులు   సంతోషించి తమ వారసులను ఆశీర్వదిస్తారు.

ఈసారి పితృ పక్షం ఆశ్యియుజ అమావాస్య రోజుతో ముగుస్తుంది. ఈ అమావాస్యను సర్వ పితృ అమావాస్య అంటారు. ఈ రోజు స్నానం చేయడం,  దానం చేయడం ప్రత్యేక ప్రాముఖ్యత కలిగి ఉంది. సర్వ పితృ అమావాస్య రోజు ఏమి చేయాలో , చేయకూడదో తెలుసుకుందాం..

అమావాస్య రోజు చేయాల్సిన పనులు: 

అమావాస్య రోజు ఉదయం నిద్రలేచి స్నానం చేసి పూర్వీకులను జ్ఞాపకం చేసుకుంటూ.. తర్పణ విడవాలి.  బ్రాహ్మణులను ఇంటికి పిలిచి భోజనం పెట్టండి.  అనంతరం వారికి దక్షిణ తాంబూలం ఇవ్వవ్వాలి. అంతేకాదు శ్రాద్ధ ఆహారాన్ని ఆవు, కుక్క , కాకికి పెట్టాలి. * పూర్వీకులను సంతోషపెట్టడానికి పేద ప్రజలకు అన్నదానం చేయండి. ఇలా చేసినవారికి  ఆర్ధిక కష్ఠాలు తీరతాయని నమ్మకం. * అమావాస్య రోజున ఇంటి ఈశాన్యంలో పూజ చేసి ఆవు నెయ్యి దీపం వెలిగించండి. ఇలా చేయడం వల్ల సమస్యలన్నీ దూరమవుతాయి.

 ఈరోజు ఈ పని చేయడం మర్చిపోవద్దు: 

*సర్వ పితృ అమావాస్య రోజున ఎవరైనా దానం-దక్షిణ ఇవ్వమని వచ్చిన వారిని తిరిగి ఖాళీ చేతులతో పంపవద్దు. అంతేకాదు ఆకలి అని ఇంటికి వచ్చినవారిని ఖాళీ కడుపుతో అతనిని పంపించవద్దు. ఈరోజు పిండి,  అన్నం దానం చేయాలి.

* అమావాస్య రోజున మాసం, ఉల్లిపాయ, వెల్లుల్లిని ఆహారంగా తీసుకోరాదు. ఇలా చేయడం వల్ల పితృ దేవతల ఆత్మ ఇబ్బంది పడుతుంది..  అందువల్ల ఈ వస్తువులను తినకూడదు.

* సర్వ పితృ అమావాస్య రోజున జుట్టు, గోళ్లను కత్తిరించకూడదు. ఈ రోజు గడ్డం షేవింగ్ చేయించుకోరాదు. ఈరోజు ఈ పనులు చేస్తే అశుభాలుగా పరిగణిస్తారు.

Also Read: Political Friendship: చిక్కుల్లో ఉన్న దిగ్విజయ్‌ను ఆదుకున్న అమిత్ షా.. స్వయంగా వెల్లడించిన కాంగ్రెస్ సీనియర్ నేత..