Kanuma: కనుమ రోజున అత్తారింటికి వెళ్లే చిన వెంకన్న.. కూతురు, అల్లుడికి ఘన స్వాగతం చెప్పే గ్రామస్థులు..

కనుమ రోజున కాకి కూడా ఊరు దాటదు అంటూ ఊరు దాటి వెళ్లడాన్ని పెద్దవారు అంగీకరించరు. ఎంతో అత్యవసరం అయితే తప్ప కనుమ రోజున ప్రయాణం చేయరాదని.. ఒక వేళ ఎవరైనా ఇదంతా చాదస్తం అంటూ కనుమ రోజు ప్రయాణం చేస్తే ఆటంకాలు తప్పవని పెద్దలు అంటూ అంటారు. కానీ  ఏలూరులో ఉన్న చిన వెంకన్న మాత్రం కనుమ రోజున ఊరు దాటడం కాదు.. తన అత్తగారింటింకి వెళ్తాడు.

Kanuma: కనుమ రోజున అత్తారింటికి వెళ్లే చిన వెంకన్న.. కూతురు, అల్లుడికి ఘన స్వాగతం చెప్పే గ్రామస్థులు..
Dwaraka Tirumala Kalyanotsa
Follow us
Surya Kala

| Edited By: Ravi Kiran

Updated on: Jan 17, 2024 | 7:40 AM

పెద్ద సంక్రాంతి పండగల సంబరాల్లో అందరూ మునిగి తేలుతూ ఉంటారు. కుటుంబ సభ్యులు , స్నేహితులు అందరూ కలిసి సంతోషంగా ఈ పండగను జరుపులుంటారు. ఈ సంక్రాంతి పండగల్లో మూడో రోజున కనుమ పండగగా జరుపుకుంటారు తెలుగు ప్రజలు. దీనిని పశువులు పండగ అని కూడా అంటారు. ఈ రోజున రైతన్నలు పంటలు చేతికి అందడంలో తమకు సహాయపడిన పశు పక్షాదులను పూజిస్తారు. ఆవులను, ఎద్దులను అందంగా అలంకరించి పూజించి వాటిని పూజిస్తారు. అయితే కనుమ రోజున కాకి కూడా ఊరు దాటదు అంటూ ఊరు దాటి వెళ్లడాన్ని పెద్దవారు అంగీకరించరు. ఎంతో అత్యవసరం అయితే తప్ప కనుమ రోజున ప్రయాణం చేయరాదని.. ఒక వేళ ఎవరైనా ఇదంతా చాదస్తం అంటూ కనుమ రోజు ప్రయాణం చేస్తే ఆటంకాలు తప్పవని పెద్దలు అంటూ అంటారు. కానీ  ఏలూరులో ఉన్న చిన వెంకన్న మాత్రం కనుమ రోజున ఊరు దాటడం కాదు.. తన అత్తగారింటింకి వెళ్తాడు. వివరాల్లోకి వెళ్తే..

ఏలూరులోని పవిత్ర పుణ్య క్షేత్రం ద్వారకా తిరుమల. ఇక్కడ కొలువైన శ్రీ వేంకటేశ్వర స్వామి కనుమ రోజున గ్రామం విడిచి అత్త గారింటికి వెళ్తారు. సంవత్సరంలో ఏ రోజు గ్రామం దాటి వెళ్ళని వెంకన్న స్వామి కనుమ రోజున గిరి ప్రదక్షణ చేస్తూ.. ఏకంగా మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న తన అత్తవారిల్లైనా దొరసానిపాడు గ్రామం వెళ్తాడు. అప్పుడు అక్కడ గ్రామ ఉత్సవం నిర్వహిస్తారు.

ఇవి కూడా చదవండి

ఇలా వెంకన్న స్వామి అత్తగారి ఇంటికి  వెళ్లే ఆచారం ఎప్పటి నుంచి ఉందో తెలియదు కానీ. ఊదొరసానిపాడు గ్రామస్థులు కనుమని అత్యంత ఘనంగా జరుపుకుంటారు. తమ చుట్టాలు, స్నేహితులు అందరినీ పిలుచుకుంటారు. కూతురు,అల్లుడు ఇంటిక వస్తున్నారని ఊరంతా ఆనందం నెలకొంటుంది. రోజంతా ఉత్సవాన్ని నిర్వహిస్తారు.

దొరసాని పాడు అనే రెండు తెలుగు పదాల కలయికతో ఏర్పడింది. దొరగారి భార్యను దొరసానిగా పిలవడం పల్లెలలో వాడుక. పాడు అనగా గ్రామం అని అర్ధం.. స్వామిని దొరగా భావించి.. భార్య ఇంటికి వచ్చారు కనుక ఈ గ్రామం దొర సానిపాడు పేరు ఏర్పడిందని పెద్దల నమ్మకం.

ద్వారకా తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఊరేగింపుగా గిరి ప్రదక్షిణగా గ్రామానికి తీసుకువస్తారు. తమ గ్రామానికి వస్తున్న స్వామివారికి గ్రామస్థులు కలియుగ వైకుంఠ నారాయణునికి మంగళ వాయిద్యాలతో ఆహ్వానం పలుకుతారు. తమ ఊరిలో ఉన్న కనుమ మండపంలో విడిది చేయిస్తారు. అనంతరం స్వామివారికి పూజాదికార్యక్రమాలను జరిపించి అనంతరం మండపం నుంచి ఊరేగింపుగా గిరి ప్రదక్షణ చేస్తూ తిరిగి ద్వారకా తిరుమల చేరుకుంటారు.

ఇలా ద్వారకా తిరుమల చిన వెంకన్న ప్రతి ఏడాది కనుక రోజున తన అత్త గారి ఇంటికి వెళ్తాడు. దీనిని కనుమోత్సవం అంటారు. ఈ ఉత్సవంలో పాల్గొనడానికి స్వామివారితో గిరి ప్రదక్షిణ చేయడానికి భారీ సంఖ్యలో ద్వారకా తిరుమలకు భక్తులు చేరుకుంటారు. కనుమోత్సవంలో పాల్గొని స్వామివారి తీర్ధ ప్రసాదాలు అందుకుంటారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు