Trending: నాలుకతో 57 తిరిగే ఫ్యాన్స్‌ని ఆపి గిన్నిస్ రికార్డ్ సాధించిన వ్యక్తి..
సాధారణంగా ప్రపంచంలో తమకంటూ ఓ గుర్తింపు సాధించాలని చాలా మంది ఏవేవో చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే తెలంగాణకు చెందిన క్రాంతి కుమార్ అనే వ్యక్తి.. వేగంగా తిరుగుతున్న ఎలక్ట్రిక్ ఫ్యాన్ బ్లేడ్‌లను తన నాలుకతో ఆపి.. అబ్బుర పరిచాడు. ఏకంగా 57 ఫ్యాన్స్‌ని ఆపి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించాడు..
ప్రపంచ రికార్డులు సాధించడానికి అనేక మంది తమలోని టాలెంట్‌ని బయట పెడుతూ ఉంటారు. వాళ్లు చేశాక ఇలా కూడా చేయవచ్చా అనిపిస్తుంది. ఇప్పటికే ఎంతో మంది ప్రపంచ రికార్డులు సాధించారు. అలా ఎంతో మంది గిన్నిస్ బుక్‌లో స్థానం సంపాదించుకున్నారు. తమలోని ప్రతిభను కనబరిచిన వారికి గిన్నిస్ బుక్ గౌరవించి.. గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులను అందజేస్తూ ఉంటారు. తాజాగా తెలంగాణకు చెందని క్రాంతి కుమార్ అలియాస్ డ్రిల్ మ్యాన్.. తన ప్రతిభను బయట పెట్టి గిన్నిస్ బుక్‌లో స్థానం సంపాదించుకున్నాడు. కదిలే ఫ్యాన్స్‌ని తన నాలుకతో ఆపి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశాడు.
స్పీడుగా తిరగే ఎలక్ట్రిక్ ఫ్యాన్ బ్లేడ్లను నాలుకతో ఎంతో స్పీడుగా ఆపి.. డ్రిల్ మ్యాన్ గిన్నీస్ బుక్‌లో చోటు సంపాదించాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అవుతుంది. ఈ వీడియోను గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్.. నెట్టింట షేర్ చేశారు. ఈ వీడియోలో ఎంతో స్పీడుగా తిరుగుతున్న ఎలక్ట్రిక్ ఫ్యాన్స్‌ని తన నాలుకతో ఆపాడు. తన నాలుకకు గాయం అయినా సరే పట్టించుకోకుండా ఫ్యాన్ రెక్కలను ఆఫాడు. అతను చేసిన పనికి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ సంస్థ అధికారులు షాక్ అయ్యారు. అనంతరం అతను చేసిన పనిని పొగుడుతూ.. గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డును అందజేశారు.
View this post on Instagram
అనంతరం క్రాంతి కుమార్ మాట్లాడుతూ.. ఇదివరకే తనకు 4 గిన్నిస్ రికార్డులు వచ్చాయని.. మరొకటి అందుకుంటున్నందుకు సంతోషంగా ఉందని వెల్లడించాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట జోరుగా వైరల్ అవుతుంది. ఈ వీడియోకు మిలియన్ల వ్యూస్ వస్తన్నాయి. ఈ వీడియోపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. క్రాంతి కుమార్‌కు కంగ్రాట్స్ తెలుపుతూ అభినందిస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..