Trending: జిమ్‌కి వెళ్లకుండానే దాదాపు 40 కిలోల బరువు తగ్గిన మహిళ..
ఈ మధ్య కాలంలో బరువు తగ్గడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఓ మహిళ 6 సంవత్సరాల్లో 37 కేజీలు తగ్గి ఆశ్చర్య పరిచింది. ఎలాంటి జిమ్‌కి, డైట్ మెయిన్‌టైన్ చేయకుండా ఇంట్లోనే ఇన్ని కేజీల బరువు తగ్గి షాక్ ఇచ్చింది. అందుకు సంబంధించి ఆమె ఏం చేసిందో వివరించింది..
ప్రస్తుత కాలంలో చాలా మందిని ఇబ్బంది పెట్టే సమస్యల్లో అధిక బరువు, ఊబకాయం కూడా ఒకటి. శరీరం బరువు పెరిగిందంటే.. అనేక ఇతర దీర్ఘకాలిక సమస్యలు రావడం ఖాయం. ముఖ్యంగా గుండె జబ్బులు, డయాబెటీస్ అనేవి ఖచ్చితంగా ఎటాక్ చేస్తున్నాయి. బరువు తగ్గడం పెద్ద కష్టం అనుకుంటున్నారు. కానీ ఇంట్లోనే ఎలాంటి వ్యాయామాలు, ఎక్సర్ సైజులు లేకుండా మన ఇంటి ఫుడ్ తీసుకుంటూనే ఈజీగా మనం బరువు తగ్గవచ్చు. ఇప్పటికే ఎంతో మంది బరువు తగ్గి ఆశ్చర్య పరుస్తున్నారు. బరువు తగ్గడం అనేది మన చేతుల్లోనే ఉంటుంది. అయితే ఎప్పుడైనా సరే వెంటనే బరువు తగ్గకూడదు. క్రమంగా నెలకు ఇంత బరువు అన్నట్టుగా తగ్గుతూ రావాలి. లేదంటే ఆరోగ్యంపై ఎఫెక్ట్ పడుతుంది. మీ శరీర ఆరోగ్యం మెయిన్‌టైన్ చేస్తూ ఫుడ్ తీసుకోవాలి. తాజాగా ఓ ఫిట్ నెస్ ఇన్‌ఫ్లుయెన్సర్, సోషల్ మీడియాలో ఎంతో ఫాలోయింగ్ ఉన్న తను శ్రీ.. ఏకంగా 37 కిలోల బరువు తగ్గి అందర్నీ ఆశ్చర్య పరిచింది.
ఒకప్పుడు తాను 85 కిలోల బరువు ఉన్నానని, తల్లి అయిన తర్వాత తన వెయిట్ లాస్ ప్రయాణాన్ని మొదలు పెట్టినట్టు వెల్లడించింది. ఈ క్రమంలో తాను అనే సవాళ్లను, ఒత్తిడిని ఎందుర్కొన్నట్లు తెలిపింది. మరి తాను ఎలా బరువు తగ్గిందో, ఎలా డైట్ మెయిన్ టైన్ చేయాలో వెల్లడించింది. ఈ బరువు తగ్గేందుకు తనకు ఆరు సంవత్సరాల సమయం పట్టిందని చెప్పింది. అదేంటో ఇప్పుడు మీరు చూసేయండి.
ఓపిక అవసరం:
బరువు తగ్గడానికి ముందు మీకు ఓపిక అవసరం.అ నుకున్నంత మాత్రాన బరువు తగ్గలేరు. సమయం పడుతుంది. వెంటనే బరువు తగ్గినా ఆరోగ్యానికి మంచిది కాదు. కాబట్టి కాస్త సమయం వేచి చూడండి. బరువు తగ్గడంలో ఓపిక అనేది చాలా అవసరం.
అతిగా తినవద్దు:
అతిగా తినడం వల్ల కూడా బరువు తగ్గలేరు. మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోవడం ముఖ్యం. ఈ క్రమంలో మీరు ఒత్తిడిని ఎదుర్కొనాల్సి ఉంటుంది. చాలా తక్కువ మోతాదులో తింటూ కంట్రోల్ చేసుకోండి. ఇది చాలా అవసరం. అప్పుడే మీరు బరువు తగ్గుతారు.
నీటిని ఎక్కువగా తీసుకోండి:
బరువు తగ్గడంలో హైడ్రేషన్ చాలా ముఖ్యం. కేవలం నీటిని మాత్రమే కాకుండా మజ్జిగ, కొబ్బరి నీళ్లు వంటివి కూడా తీసుకుంటూ ఉండాలి. నీరు ఎక్కువగా తీసుకుంటే.. శరీరంలో పేరుకు పోయిన కొలెస్ట్రాల్ కరుగుతుంది.
మీ రొటీన్‌ని మార్చుకోండి:
ఎప్పుడూ ఒకేలాంటి ఆహారం కాకుండా మీ రొటీన్‌ని మార్చుకోండి. చిన్న పాటి వాకింగ్ వంటివి చేయడం వల్ల కూడా అవి బరువు తగ్గేందుకు హెల్ప్ చేస్తాయి. ఇంటి భోజనానికి ప్రాధాన్యత ఇవ్వండి. అదే విధంగా మీ ఇంట్లో పనులు మీరు చేసేందుకు ప్రయత్నం చేయండి. బయట ఫాస్ట్ ఫుడ్స్‌ని తినడం వదిలేయండి.
మెట్లు దిగడం:
మెట్లు ఎక్కుతూ, దిగుతూ ఉండటం వల్ల కూడా బరువు తగ్గేందుకు ఇది చాలా హెల్ప్ చేస్తుంది. కాబట్టి ప్రతి రోజూ మెట్లు ఎక్కుతూ దిగేందుకు ట్రై చేయండి.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..