నిప్పులు కురిపిస్తున్న భానుడు.. లోక కళ్యాణం కోసం 41 రోజుల అగ్ని తపస్సు చేస్తున్న సాధువు..
మండే ఎండలో ఒక సాధువు 20 ఏళ్ల సంప్రదాయాన్ని కొనసాగిస్తూ.. అగ్ని తపస్సు చేస్తున్నాడు. ఈ సంక్లిష్ట తపస్సు ఒక రోజు రెండు రోజులు కాదు ఏకంగా 41 రోజులు సాగుతుంది. ఈ 41 రోజులు సాధువు నిరంతరం 4 గంటల పాటు అగ్ని సమిధల ను ఏర్పాటు చేసుకుని వాటి మధ్య కూర్చుని తపస్సు చేస్తాడు. అది కూడా సూర్యుడు ఆకాశంలో నడినెత్తిమీదకు చేరుకుని నిప్పుల వర్షం కురిపించే సమయంలో అగ్ని తపస్సుని చేస్తాడు.
ప్రస్తుతం దేశంలో విచిత్ర వాతావరణం నెలకొంది. కొన్ని ప్రాంతాల్లో ఆకాశం నుంచి నిప్పుల వర్షం కురిపిస్తుందా అన్నంతగా వేడి ఉంటుంది. ఒకొక్క ప్రాంతంలో 50 డిగ్రీల ఉష్ణోగ్రత కూడా నమోదవుతుంది. ముఖ్యంగా ఎడారి ప్రాంతమైన రాజస్తాన్ భానుడి భాగభాగాలతో మండుతోంది. దీంతో ప్రజలు ఉదయమే ఇంటి నుంచి బయటకు రావాలంటే భయపడుతున్నారు. అటువంటి మండే ఎండలో ఒక సాధువు 20 ఏళ్ల సంప్రదాయాన్ని కొనసాగిస్తూ.. అగ్ని తపస్సు చేస్తున్నాడు. ఈ సంక్లిష్ట తపస్సు ఒక రోజు రెండు రోజులు కాదు ఏకంగా 41 రోజులు సాగుతుంది. ఈ 41 రోజులు సాధువు నిరంతరం 4 గంటల పాటు అగ్ని సమిధల ను ఏర్పాటు చేసుకుని వాటి మధ్య కూర్చుని తపస్సు చేస్తాడు. అది కూడా సూర్యుడు ఆకాశంలో నడినెత్తిమీదకు చేరుకుని నిప్పుల వర్షం కురిపించే సమయంలో అగ్ని తపస్సుని చేస్తాడు.
సాధువు ప్రజా సంక్షేమం కోసం అగ్ని తపస్సు చేస్తున్నాడు. తపస్సు చేసే సమయంలో ఆలయ ప్రాంగణంలో సాధువు తన చుట్టూ తొమ్మిది అగ్ని సమిధలను ఏర్పాటు చేసుకుంటాడు. బహిరంగ ప్రదేశంలో ఎండ నుంచి ఎటువంటి రక్షణ లేకుండా భూమి మీద కూర్చుని 41 రోజుల పాటు అగ్ని తపస్సు చేసి ప్రజల శ్రేయస్సు కోసం ప్రార్థిస్తారు. మండుతున్న వేడిలో సాధువు చేస్తున్న ఈ తపస్సు చూసి ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. సాధువు చేస్తున్న తపస్సును చూడటానికి, పూజించడానికి భారీ సంఖ్యలో భక్తులు చేరుకుంటున్నారు.
41 రోజుల పాటు అగ్ని తపస్సు రాష్ట్రంలోని దౌసా జిల్లాలోని హింగ్వా గ్రామంలోని నాథ్ శాఖకు చెందిన పురాతన సిద్ధపీఠ్ ఆశ్రమంలో అగ్ని తపస్సు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం జూన్ 25 వరకు కొనసాగుతుంది. సన్యాసి విజయనాథ్ యోగి 41 రోజుల పాటు అగ్ని తపస్సు నిర్వహించనున్నారు. ఈ తపస్సుని తొమ్మిది అగ్ని సమిధల మధ్య కూర్చుని కొనసాగిస్తున్నాడు. విజయనాథ్ యోగి హింగ్వా నాథ్ పీఠ్ మహంత్ నాథ్ శాఖకు చెందిన 41వ మహంత్ అయిన బాబా లక్ష్మణ్ నాథ్ శిష్యుడు. మహంత్ బాబా లక్ష్మణ్ నాథ్ 40 ఏళ్లుగా సిద్ధపీఠ్ ఆశ్రమాన్ని నిర్వహిస్తున్నారు. మహంత్ లక్ష్మణ్ నాథ్ మాట్లాడుతూ గత 20 ఏళ్లుగా అగ్ని తపస్సు నిర్వహిస్తున్నామని చెప్పారు. లోక కళ్యాణార్థం సిద్ధపీఠం ఆశ్రమంలో ప్రతి సంవత్సరం ఈ అగ్ని తపస్సు నిర్వహిస్తారు. మధ్యాహ్న సమయంలో చేసే ఈ అగ్ని తపస్సును చూసేందుకు భారీ సంఖ్యలో భక్తులు ఆశ్రమానికి తరలివస్తారు.
నాథ్ శాఖకు చెందిన పురాతన సిద్ధపీఠం ఆశ్రమం
హింగ్వా గ్రామంలో ఉన్న నాథ్ శాఖకు చెందిన పురాతన సిద్ధపీఠ్ ఆశ్రమం నాథ్ సమాజానికి ప్రధాన కేంద్రంగా ఉంది. ఈ ప్రదేశం మెహందీపూర్ బాలాజీ ధామ్ నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఆశ్రమం అనేక మంది సాధువులు, మహాత్ములకు నివాసం. వీరి అద్భుతాలు ప్రపంచ ప్రసిద్ధి చెందాయి. ఈ ప్రదేశాన్ని రాజస్థాన్‌లోని నాథ్ శాఖకు చెందిన అతిపెద్ద ఆశ్రమం. గురు పూర్ణిమ రోజున ఇక్కడ జాతర నిర్వహిస్తారు. అలాగే శ్రీమద్ భగవత్ కథ … భండారా ఆశ్రమంలో ఏడు రోజుల పాటు నిర్వహించబడుతుంది. దేశం నలుమూలల నుంచి భారీ సంఖ్యలో భక్తులు హింగ్వా ఆశ్రమానికి వచ్చి మహంత్ ఆశీస్సులు తీసుకుంటారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు