Amdhra Pradesh: పుష్పగిరి పుణ్యక్షేత్ర సమీపంలో పంచమనది ఒడిలో సైకత లింగం.. అద్భుతం అంటున్న భక్తులు

చాలామంది సైకత శిల్పాలు అలాగే సైకత రూపాలను చేసేవారు నదీ తీరాలలో లేదా సముద్ర తీరాల వద్ద వాటిని చేసి ప్రశంసలు పొందుతూ ఉంటారు. అలాంటి ఒక సైకత శిల్పి దక్షిణ కాశీగా పేరు పొందిన పుష్పగిరి పుణ్యక్షేత్రం వద్ద పారే పంచమనది ఒడిలో సైకత శివలింగాన్ని చేసి అందరి మన్ననలు పొందారు. పారే నీటి మధ్యలో ఇసుకతో చాలా అద్భుతంగా ఆ సైకత శిల్పాన్ని రూపొందించారు.

Amdhra Pradesh: పుష్పగిరి పుణ్యక్షేత్ర సమీపంలో పంచమనది ఒడిలో సైకత లింగం.. అద్భుతం అంటున్న భక్తులు
Sand Shiva Lingam
Follow us
Sudhir Chappidi

| Edited By: Surya Kala

Updated on: Nov 30, 2024 | 9:13 AM

కడప జిల్లా కమలాపురం నియోజకవర్గంలోని పుష్పగిరి పుణ్యక్షేత్రంలో శ్రీ చెన్నకేశ్వర స్వామి ఆలయ సమీపంలో గల పంచమనది మధ్యలో ఇన్ టాక్ సభ్యుడు కడిమెల్ల రాఘవేంద్ర వర్మ అద్భుతమైన సైకత శివలింగాన్ని రూపొందించారు. పారే నీటి మధ్యలో ఇసుకను చేకూర్చి దానితో శివలింగాన్ని చేసి అందరి మన్ననలు పొందారు. కార్తీక మాసం సందర్భంగా దక్షిణ కాశీగా పిలవబడే పుష్పగిరి పుణ్యక్షేత్రం భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది. ఐదు నదులు కలిసే ఈ పంచమ నది లో స్నానం చేసి చెన్నకేశ్వర స్వామి ఆలయంలోని స్వామివారిని దర్శనం చేసుకుంటే సకల పాపాలు పోతాయి అని నమ్మకం. అంతేకాక అరుణాచలంలో గిరి ప్రదక్షణ ఎలా చేస్తారు పుష్పగిరిలో కూడా అలా గిరి ప్రదక్షిణ ఉంటుంది. అలాంటి ఈ పుణ్యక్షేత్రం సమీపంలోని పంచమనది మధ్యలో రాఘవేంద్ర వర్మ సైకత శివలింగాన్ని చేసి ఆ శివలింగానికి పూజలు చేయడం తో భక్తులందరూ ఆయనను అభినందించారు.

పారే నీటి మధ్య ఇలా సైకత లింగాన్ని చేయడం అంటే చాలా కష్టంతో కూడుకున్న పని. అలాంటిది శివుని అనుమతి లేనిదే చీమైనా కొట్టదు అన్నట్లుగా శివుని అనుమతితోనే పారుతున్న నీటి మధ్యలో సైకత లింగాన్ని రూపొందించారు. ఈ శివలింగం భక్తులకు కనువిందు చేసింది. తాము సైకత శివలింగాన్ని దర్శించుకోవడం ఎంతో అదృష్టం అని అక్కడి భక్తులు అంటున్నారు. ఏది ఏమైనా నీటి మధ్యలో సైకత లింగాన్ని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని భక్తులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. పువ్వులతో పూజలను చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..