AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ramnami Tribe: ఈ గిరిజన తెగ రామ భక్తికి సాటి ఎవరు?.. వందల ఏళ్లుగా వళ్లంతా రామ నామంతో పచ్చ బొట్లు..

Ramnami Tribe: భారతదేశం(Bharath) అనేక గిరిజన సముదాయాలకు నెలవు. ఈ ఆదివాసీలు తమదైన ప్రత్యేక సంస్కృతి, సంప్రదాయం, సామాజిక విలువలను కలిగి ఉంటారు. ఛత్తీస్‌గఢ్‌లో..

Ramnami Tribe: ఈ గిరిజన తెగ రామ భక్తికి సాటి ఎవరు?.. వందల ఏళ్లుగా వళ్లంతా రామ నామంతో పచ్చ బొట్లు..
Ram Navami Tribes
Surya Kala
|

Updated on: Apr 21, 2022 | 12:28 PM

Share

Ramnami Tribe: భారతదేశం(Bharath) అనేక గిరిజన సముదాయాలకు నెలవు. ఈ ఆదివాసీలు తమదైన ప్రత్యేక సంస్కృతి, సంప్రదాయం, సామాజిక విలువలను కలిగి ఉంటారు. ఛత్తీస్‌గఢ్‌లో(Chattisgarh) ప్రధాన గిరిజన తెగ రామ-నామిలు. వీరు మహానది నది ఒడ్డున ఉన్న గ్రామాల్లో  నివసిస్తున్నారు. అయితే ఈ రామ-నామి తెగ స్పెషాలిటీ ఏమిటంటే.. ఈ తెగలోని ప్రతి ఒక్కరు తమ శరీరంలోని ప్రతి భాగంలోనూ శ్రీరాముడి పేరును పచ్చబొట్టుగా వేయించుకుంటారు. అయితే ఇలా రాముడి పేరును పచ్చబొట్టుగా వేయించుకోవానికి చరిత్రకారులు ఒక కథను  చెబుతుంటే.. పురాణాల్లో మరొక కథనం ఉందట..పూర్తి వివరాల్లోకి వెళ్తే..

చాలా మంది చరిత్రకారులు రామనామి సమాజం అంటరాని తనం ఉద్యమంలోని ఉపశాఖగా భావిస్తారు. ఈ తెగవారిని శ్రీరాముని ఆలయంలోకి అనుమతించకపోవడంతో.. ఒక పెద్ద తన వంటిపై శ్రీరాముడి పేరును నుదిటిపై పచ్చబొట్టు వేసుకుని.. తమ నుంచి రాముడిని వేరు చేయలేరని చెప్పారట.. అప్పటి నుంచి ఈ సంప్రదాయం నేటికీ పాటిస్తున్నారని ఒక కథనం..

ప్రముఖ పురాణం ప్రకారం..  నిమ్న కులానికి చెందిన పరశురామ్ భరద్వాజ్  ప్రారంభించాడు. అతను పంతొమ్మిదవ శతాబ్దం మధ్యకాలంలో ఛత్తీస్‌గఢ్‌లోని జంజ్‌గిర్-చంపా జిల్లాలోని చర్పారా గ్రామంలో జన్మించాడు. చిన్నతనంలో రామాయణ కథల నుంచి ఎంతో స్ఫూర్తి పొందారు. చిన్నతనంలోనే తండ్రి దగ్గర వ్యవసాయ కూలీగా పనిచేయడం ప్రారంభించి 12 ఏళ్లకే పెళ్లి చేసుకున్నాడు. పరశురాం రామాయణంలోని కథలను అర్థం చేసుకోవడానికి, వాటి అర్థాలను అర్థం చేసుకోవడానికి చదవడం, రాయడం నేర్చుకున్నాడు.

స్థల పురాణం ప్రకారం.. పరశురాముడు కుష్టు వ్యాధి బారిన పడ్డాడు.  ఈ సమయంలో, అతను ఒక సాధువు (ఋషి)ని కలుసుకున్నాడు. రామాయణం పఠించమని సూచించాడు. మరుసటి రోజు నుంచి అతని ఆరోగ్యంలో మార్పులు వచ్చాయి. అంతేకాదు అతని శరీరంపై ‘రామ్-రామ్’ అనే పదం పచ్చబొట్టు రూపంలో కనిపించిందని పరశురామ్ తెలుసుకున్నాడు. ఇది ఒక అద్భుతంగా భావించబడింది. అప్పటి నుంచి అతడిని అనుసరిస్తూ.. శరీరంపై శ్రీరాముడి పేరును పచ్చబొట్టుగా వేయించుకుంటారు.  ”రాముడిని మన నుండి ఎవరూ వేరు చేయలేరు” అంటూ ఒళ్ళంతా రామ నామాన్ని పొడిపించుకుంటారు. కనురెప్పలను సైతం రామనామంతో నింపేస్తారు.

ఈ రామనామి తెగ ప్రజలు ప్రశాంతంగా జీవిస్తారు. కేవలం రామనామాన్ని పచ్చబొట్టుగా పొడిపించుకోవడమే కాదు. వారి జీవన విధానంలోని ప్రతీ పనిని, ప్రతీ శుభకార్యాన్ని రామ నామంతోనే ముడి పెడతారు. ఇప్పుడు ఈ తెగ ప్రజలు కూడా ఆలయానికి వెళతారు.. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది కాని రామ్ పేరు రాయించుకుని సంప్రదాయం ఈ రోజు వరకు మారలేదు. “రామ్” అని ముద్రించిన శాలువాలు, నెమలి ఈకలతో చేసిన తలపాగా ధరిస్తారు. ఈ శాఖకు చెందినవారు మద్యపానం, ధూమపానం చేయరు. ప్రతిరోజూ రామ్ నామాన్ని జపిస్తారు. అయితే కాలంలో వస్తున్నా మార్పుల్లో భాగంగా నేటి తరం రామ్ నామాన్ని పచ్చబొట్టుగా వేయించుకునేవారి సంఖ్య తగ్గుతున్నట్లు తెలుస్తోంది.

Also Read: No Loudspeakers: ఆ రాష్ట్రంలో మతపరమైన స్థలాల్లో మూగబోతున్న సౌండ్ సిస్టమ్స్.. ఇప్పటికే మథుర ఆలయంలో లౌడ్ స్పీకర్ స్విచ్ ఆఫ్