Rakhi Festival: రాఖీ పండుగను ఎందుకు జరుపుకుంటారు.. దీనికి సంబంధించిన నమ్మకం, పురాణ కథలు ఏమిటంటే

హిందూ మతానికి చెందిన పవిత్రమైన పండుగల్లో ఒకటి.. సోదర సోదరీమణుల మధ్య పవిత్ర సంబంధానికి చిహ్నం. రక్షాబంధన్ అనే పదం రక్ష + బంధన్ అనే రెండు పదాలతో రూపొందించబడింది. రక్షణ బంధం  అంటే ఈ రక్షా సూత్రాన్ని కట్టిన తర్వాత..  సోదరుడు తన సోదరిని రక్షిస్తానంటూ వాగ్దానం. రాఖీ పండుగను జరుపుకోవడానికి సంబంధించిన పౌరాణిక కథలు వాడుకలో ఉన్నాయి. దేవతామూర్తుల కాలం నుంచి ఈ పండుగను జరుపుకుంటున్నారని నమ్మకం.

Rakhi Festival: రాఖీ పండుగను ఎందుకు జరుపుకుంటారు.. దీనికి సంబంధించిన నమ్మకం, పురాణ కథలు ఏమిటంటే
rakhi festival hindu mythology
Follow us
Surya Kala

|

Updated on: Aug 28, 2023 | 1:19 PM

హిందువులు జరుపుకునే పండగల్లో ఒకటి రాఖీ.. ఈ పండగ సోదరులు, సోదరీమణుల మధ్య ప్రేమకు చిహ్నంగా పరిగణించబడుతుంది. రాఖీ కట్టిన తన సోదరికి సోదరుడు తన జీవితాంతం కాపాడుతానని వాగ్దానం చేస్తాడు. ఈ రోజున సోదరీమణులు తమ సోదరుడి మణికట్టుపై రక్షణ దారాన్ని కట్టి, స్వీట్లు అందించి, సోదరుడికి హారతినిస్తారు. తనకు రాఖీ కట్టిన తన సోదరికి ఏదైనా బహుమతి ఇవ్వడం ద్వారా, ఆమెను జీవితాంతం కాపాడతానని వాగ్దానం చేస్తాడు. ఈ పండుగ ప్రతి సంవత్సరం శ్రావణ మాసం పౌర్ణమి రోజున జరుపుకుంటారు. ఈ పండుగను రాఖీ పండగ అని కూడా అంటారు. ఈ ఏడాది 2023లో రాఖీని ఆగస్టు 30, 31 తేదీల్లో జరుపుకోనున్నారు.

హిందూ మతానికి చెందిన పవిత్రమైన పండుగల్లో ఒకటి.. సోదర సోదరీమణుల మధ్య పవిత్ర సంబంధానికి చిహ్నం. రక్షాబంధన్ అనే పదం రక్ష + బంధన్ అనే రెండు పదాలతో రూపొందించబడింది. రక్షణ బంధం  అంటే ఈ రక్షా సూత్రాన్ని కట్టిన తర్వాత..  సోదరుడు తన సోదరిని రక్షిస్తానంటూ వాగ్దానం. రాఖీ పండుగను జరుపుకోవడానికి సంబంధించిన పౌరాణిక కథలు వాడుకలో ఉన్నాయి. దేవతామూర్తుల కాలం నుంచి ఈ పండుగను జరుపుకుంటున్నారని నమ్మకం. ఈ రోజు రాఖీ పండగను ఎందుకు జరుపుకుంటారో ఈ రోజు  తెలుసుకుందాం.

సంతోషిమాత కథ..

ఒకరోజు శ్రీ గణేశుడు తన సోదరి మానస దేవితో రక్షా సూత్రాన్నికట్టించుకుంటున్నాడు.. అప్పుడు గణపతి తనయులు శుభః, లాభ్ లు ఇది ఏమిటి అని అడిగారు. అప్పుడు శ్రీ గణేశుడు ఇది రక్షణ కవచం అని చెప్పాడు. ఈ రక్షా సూత్రం సోదర సోదరీమణుల మధ్య ప్రేమకు ప్రతీక అని చెప్పారు. ఇది విన్న శుభ్, లాభ్ లు తమకి కూడా ఒక సోదరి కావాలని పట్టుబట్టారు. తన పిల్లల మొండితనానికి లొంగి గణేశుడు తన శక్తుల నుండి ఒక మంటను సృష్టించాడు. దానిని తన భార్యలు సిద్ధి, బుద్ధిల ఇద్దరి ఆత్మ శక్తితో కలిపాడు. ఆ వెలుగు నుండి ఒక అమ్మాయి (సంతోషి) పుట్టింది. ఆమెకు సంతోషిమాత అని పేరు పెట్టారు. రక్షా బంధన్ సందర్భంగా సోదరులిద్దరికీ ఒక సోదరి వచ్చింది.

ఇవి కూడా చదవండి

లక్ష్మీదేవి బలికి చెందిన కథ

ఒకప్పుడు అసుర రాజు బలి దాతృత్వానికి సంతోషించిన విష్ణువు అతనిని వరం కోరమని కోరినప్పుడు.. బలి రాజు తనతో పాతాళ లోకానికి రమ్మనమని ఆహ్వానించాడు. అప్పుడు విష్ణువు తన నివాసాన్ని వదిలి పాతాళ లోకానికి చేరుకున్నాడు. అప్పుడు వైకుంఠంలో లక్ష్మీదేవి ఒంటరిగా మిలిగిపోయింది. తిరిగి తన భర్తను తన దగ్గరకు తీసుకుని తెచ్చుకోవడానికి బలి రాజుకు మణికట్టుకు లక్ష్మీదేవి రక్షణ దారాన్ని కట్టింది. అప్పుడు బలి రాజు లక్ష్మీదేవిని ఏదైనా అడగమని చెప్పగా.. అప్పుడు లక్ష్మీదేవి తనకు మహా విష్ణువుని వరంగా ఇవ్వమని కోరింది. దీంతో మహావిష్ణువు లక్ష్మీదేవితో కలిసి తిరిగి వైకుంఠానికి చేరుకున్నారు.

శ్రీ కృష్ణుడు ద్రౌపది కథ

మహాభారత కాలంలో ఒకసారి పాండవులు రాజసూయ యాగానికి శ్రీకృష్ణుడిని ఆహ్వానించారు. ఆ యాగంలో శ్రీకృష్ణుని బంధువు శిశుపాలుడు కూడా ఉన్నాడు. ఆ సమయంలో శిశుపాలుడు శ్రీకృష్ణుడిని చాలా అవమానించాడు. నూరు తప్పులు కాచిన శ్రీకృష్ణుడు చివరికి తన సుదర్శన చక్రంతో శిశుపాలుడిని వధించాడు. ఆ సుదర్శన చక్రం శ్రీకృష్ణునికి తిరిగి వచ్చినప్పుడు.. చూపుడు వేలికి లోతైన గాయం అయింది.  అది చూసిన ద్రౌపది తన చీరలోంచి ఒక ముక్క చించి శ్రీకృష్ణుని వేలికి కట్టింది. ద్రౌపది ఈ అనురాగాన్ని చూసి శ్రీకృష్ణుడు చాలా సంతోషించాడు. ద్రౌపదికి ఎటువంటిసందర్భంఎదురైనా తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని ..ఎల్లప్పుడూ రక్షిస్తానని వాగ్దానం చేశాడు.

మహారాణి కర్ణావతి ,చక్రవర్తి హుమాయున్ కథ

సుల్తాన్ బహదూర్ షా చిత్తోర్‌పై దాడి చేసినప్పుడు రాణి కర్ణవతి తన రాజ్య రక్షణ కోసం హుమాయూన్ చక్రవర్తికి రాఖీని పంపి రక్షించమని అభ్యర్థించింది. హుమాయున్ రాఖీని అంగీకరించాడు.. అంతేకాదు తన  సైనికులతో కలిసి ఆమెను రక్షించడానికి చిత్తోర్‌కు బయలుదేరాడు, అయితే హుమాయున్ చిత్తోర్ చేరుకోవడానికి ముందే రాణి కర్ణావతి ఆత్మహత్య చేసుకుంది.

మయుడు, యమున కథ

ఒక పౌరాణిక కథనం ప్రకారం యముడు 12 సంవత్సరాల పాటు తన సోదరి యమునను సందర్శించలేదు. అప్పుడు యమున దిగులుపడి తన తల్లితో ఈ విషయం చెప్పింది. నీ చెల్లులు నీకోసం ఎదురుచూస్తోందని యమడుకి వార్త తెలియజేసింది. ఇది విన్న యమ తన సోదరి యమునాదేవిని కలవడానికి వచ్చాడు. యముని యముని చూసి చాలా సంతోషించి అతని కోసం ఎన్నో వంటకాలు కూడా సిద్ధం చేసింది. తనపై చెల్లెలు ప్రేమని చూసి చాలా సంతోషించిన యముడు చెల్లెలని వరం కోరమని చెప్పాడు. అప్పటి నుంచి సోదరి సోదరుడికి రాఖీ కట్టే సంప్రదయం మొదలైందని కథనం.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)

ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?