AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bhadadri: రాములోరి కల్యాణానికి ముహర్తం ఖరారు.. ఈ నెల 22 నుంచి ఏప్రిల్‌ 5 వరకు శ్రీరామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు

రాములోరి కల్యాణానికి మార్చి 22 నుంచి ఏప్రిల్‌ 5 వరకు శ్రీరామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు అంగరంగవైభవంగా జరగనున్నాయి. మార్చి 22వ తేదీన ఉగాది పండుగను పురస్కరించుకొని నూతన పంచాంగ శ్రవణం జరుపనున్నారు. 

Bhadadri: రాములోరి కల్యాణానికి ముహర్తం ఖరారు.. ఈ నెల 22 నుంచి ఏప్రిల్‌ 5 వరకు శ్రీరామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు
Sitarama Kalyanam
Surya Kala
|

Updated on: Mar 19, 2023 | 12:07 PM

Share

భద్రాచలం శ్రీరామ దివ్యక్షేత్రం.. శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం సన్నిధిలో నిర్వహించనున్న శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని వైభవంగా ఏర్పాట్లు చేస్తున్నారు.కలియుగ వైకుంఠం భద్రాచలంలో రాములోరి కల్యాణానికి మార్చి 22 నుంచి ఏప్రిల్‌ 5 వరకు శ్రీరామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు అంగరంగవైభవంగా జరగనున్నాయి. మార్చి 22వ తేదీన ఉగాది పండుగను పురస్కరించుకొని నూతన పంచాంగ శ్రవణం జరుపనున్నారు.

భద్రాచల రామయ్య పెండ్లికి ముహూర్తం ఖరారైంది. శ్రీ సీతారాముల కల్యాణం మార్చి 30న జరగనుందని  ఆలయ అధికారులు వెల్లడించారు. కల్యాణ క్రతువు నిర్వహించాలని నిర్ణయించారు. అనంతరం మార్చి 31న పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకం ఉంటుంది. మార్చి 22 నుంచి ఏప్రిల్‌ 5 వరకు శ్రీరామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలను కన్నుల పండువగా జరిపేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

సీతారాముల కళ్యాణ తలంబ్రాలు కలిపే వేడుక, వసంతోత్సవం, డోలోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని నిర్ణయించారు. సీతారాముల కల్యాణానికి 150 క్వింటాళ్లకు పైగా బియ్యం, ఒక క్వింటాకు పైగా ముత్యాలతో తలంబ్రాలను సిద్ధం చేస్తున్నారు. ఉత్సవాలు, కల్యాణం, పట్టాభిషేకాన్ని భారీ సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి

పట్టాభిషేకానికి ఏర్పాట్లు:

కళ్యాణం అనంతరం నిర్వహించనున్న పట్టాభిషేకం కోసం గోదావరి, గంగాధర, శ్వేత పుష్కరిణి, నర్మద, పూరిలోని సముద్రం తీర్థాన్ని తూర్పు దిక్కు నుంచి తీసుకురానున్నారు.

గోపీ తలాబ్‌, పుష్కర్‌, చంద్రభాగ జలాన్ని పాత్రల్లో పడమర దిక్కు నుంచి తేవాల్సి ఉంది.

ఉత్తరంలోని గంగ, యమున, సరస్వతి, సరయు, గోమతి నదులను గుర్తించారు.

దక్షిణంలోని కావేరి, తామ్రపర్ణి, పినాకిని, కపిల తీర్థం, తిరుమల స్వామి పుష్కరిణి, పద్మ పుష్కరిణి, అనంత పుష్కరిణి, కల్యాణ పుష్కరిణి, ఇంద్ర పుష్కరిణి, శ్రీరామ పుష్కరిణి వంటి చోట్లకు వెళ్లి తీర్ధాన్ని తీసుకుని రానున్నారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
‘విశ్వనాథ్ & సన్స్’ సినిమాతో ప్రతి ఒక్కరూ ప్రేమలో పడతారు: సూర్య
‘విశ్వనాథ్ & సన్స్’ సినిమాతో ప్రతి ఒక్కరూ ప్రేమలో పడతారు: సూర్య
జస్ట్ 3 రోజుల్లోనే ఇంట్లో కొత్తిమీర పెంచండి.. ఈ చిన్న ట్రిక్..
జస్ట్ 3 రోజుల్లోనే ఇంట్లో కొత్తిమీర పెంచండి.. ఈ చిన్న ట్రిక్..
అమ్మవారి హుండీలో భారీగా జర్మన్ సిల్వర్! దాని విలువెంత అంటే..?
అమ్మవారి హుండీలో భారీగా జర్మన్ సిల్వర్! దాని విలువెంత అంటే..?
ఆగస్టు 12 రాశిఫలాలు: ఈ రాశుల వారికి ఆర్థిక లాభాలు
ఆగస్టు 12 రాశిఫలాలు: ఈ రాశుల వారికి ఆర్థిక లాభాలు
ఎముకలు ఉక్కులా బలంగా మారాలా.. ఇవి తింటే మీకు తిరుగుండదు..
ఎముకలు ఉక్కులా బలంగా మారాలా.. ఇవి తింటే మీకు తిరుగుండదు..
చిరంజీవిని చూసి కన్నీళ్లు పెట్టుకున్న పొట్టి మామ.. వీడియో ఇదిగో
చిరంజీవిని చూసి కన్నీళ్లు పెట్టుకున్న పొట్టి మామ.. వీడియో ఇదిగో
తిరుపతిలో పుల్కిత్ టిఎమ్‌టి విజయోత్సవం 2026..
తిరుపతిలో పుల్కిత్ టిఎమ్‌టి విజయోత్సవం 2026..
మార్కెట్లోకి ఈ3 ట్రయాన్ కొత్త ఈవీ స్కూటర్
మార్కెట్లోకి ఈ3 ట్రయాన్ కొత్త ఈవీ స్కూటర్
బాబీతో చేస్తోన్న మెగా 158 మూవీ టైటిల్ చెప్పేసిన చిరంజీవి..వీడియో
బాబీతో చేస్తోన్న మెగా 158 మూవీ టైటిల్ చెప్పేసిన చిరంజీవి..వీడియో
ఇంటిచుట్టూ కనిపించే ఈ మొక్కను అస్సలు తక్కువ అంచనా వేయకండి..
ఇంటిచుట్టూ కనిపించే ఈ మొక్కను అస్సలు తక్కువ అంచనా వేయకండి..