Mahabharat Moral Story: దేశాన్ని ఏలే రాజుకు ఉండాల్సిన లక్షణాలు ఏమిటో చెప్పిన ద్రోణాచార్య..

Mahabharat Moral Story: మహాభారతం పంచమవేదంగా కీర్తిగాంచింది. మహాభారతం లోని ప్రతి పర్వం నేటి మానవునకు జీవిత గమనానికి దిశానిర్దేశాన్ని చేస్తాయి. ఈ మహాభారతంలో ఒక ప్రధానమైన..

Mahabharat Moral Story: దేశాన్ని ఏలే రాజుకు ఉండాల్సిన లక్షణాలు ఏమిటో చెప్పిన ద్రోణాచార్య..
Dronacharya
Follow us

|

Updated on: Jul 22, 2021 | 3:59 PM

Mahabharat Moral Story: మహాభారతం పంచమవేదంగా కీర్తిగాంచింది. మహాభారతం లోని ప్రతి పర్వం నేటి మానవునకు జీవిత గమనానికి దిశానిర్దేశాన్ని చేస్తాయి. ఈ మహాభారతంలో ప్రతి ఒక్క పాత్ర ప్రత్యేకతను సంతరించుకుంది. శ్రీకృష్ణుడు, పాండవులు, కౌరవులు, భీష్ముడు వంటి అనేక మంది జీవన విధానం మంచి చెడులకు ప్రతీకలుగా నిలుస్తాయి. ఇక కురుపాండవుల గురువైన ద్రోణాచార్యుడు ఆచార్యడుగా అనుసరణీయం.. అందుకనే మన ప్రభుత్వం ఉత్తమ క్రీడాకారులను తీర్చిదిద్దినవారికి ద్రోణాచార్య అవార్డుని ఇచ్చి  సత్కరిస్తుంది. అటువంటి ద్రోణాచార్యుడు ఒక దేశాన్ని పాలించే రాజు ఎలా ఉండాలి అన్న విషయం పై పెట్టిన పరీక్ష .. గురించి ఈరోజు తెలుసుకుందాం..

కురుపాండవులకు శిక్షణ ఇస్తున్న సమయంలో ఒకసారి ద్రోణాచార్యుడుకి రాజ్యానికి రాజుగా ఎవరు కరెక్ట్ అనే విషయం పై అలోచన వచ్చింది. దీంతో పాండవులలో పెద్దవాడు ధర్మరాజు.. కౌరవుల్లో పెద్దవాడు దుర్యోధనుడి ని పిలిచి ఒక ఏడాది పాటు దేశ పర్యటన చేసి.. రావాల్సింది అని ఆజ్ఞాపించాడు. అదే సమయంలో మీకు కనిపించిన విషయాలను తనతో పంచుకోవాలని తెలిపాడు.. గురువాజ్ఞతో.. ధర్మరాజు.. దుర్యోధనుడు దేశాటనకు బయలు దేరారు.. ఒక ఏడాది పాటు దేశ పర్యటనలో అన్ని చూసి.. తిరిగి గురుకులానికి చేరుకున్నారు.

ద్రోణాచార్యుడు సంతోషంతో శిష్యులను ఆదరించి… ఏడాది లో ఏమేమి చూశారు.. ఏమి తెలుసుకున్నారు అని ప్రశ్నించాడు.. ముందుగా దుర్యోధనుడిని అడిగాడు.. నువ్వు ఈ పర్యటనలో చూసిన విశేషాలు ఏమిటి అని ద్రోణాచార్యుడు అడిగిన వెంటనే.. దుర్యోధనుడు ఛీ ఛీ గురువుగారు లోకం పాడైపోయింది. ఎక్కడ చూసినా స్వార్ధం.. కపటం.. కుళ్ళు కుతంత్రాలు త్వరలో అందరూ సర్వనాశనం అయిపోతారు అని చెప్పాడు… అంతరం ధర్మరాజు తన పర్యటన విశేషాలను చెబుతూ… గురువుగారు లోకం ఎంత అందంగా ఉంది.. పచ్చని పొలాలు… పాడిపంటలు… కల్లాకపటం లేని జనం… విశ్వమంతా సుందరంగా సంతోషంగా ఉంది… ఇలా పచ్చగా పదికాలాల పాటు దేశం సుభిక్షంగా ఉండలని తాను కోరుకుంటున్నానని చెప్పాడు ధర్మరాజు

అప్పుడు ద్రోణాచార్యుడుకి తెలిసిందట.. ఎవరు ఎలా ఆలోచిస్తూ.. చూస్తే అవతలివారు అలాగే కనిపిస్తారు.. దుర్యోధనుడి మనస్సు అంతా స్వార్ధం.. కుళ్ళు అసూయలతో నిండి ఉంది.. అందుకే లోకంలో అందరూ అలాగే కనిపించారు.. అదే లోకం ధర్మరాజుకి కనిపించింది.. అంటే ఎదుటి వారిని మనం ఎలా చూస్తే అలా కనిపిస్తుంది.. అని అర్ధం చేసుకున్నాడు.. ధర్మరాజు పాలనలో ప్రజలు సుఖశాంతులతో వర్ధిల్లుతారని అనుకున్నాడు.

Also Read:  ఆయన దేశ భక్తి ముందు డబ్బూ , వ్యాపారం ఎప్పుడూ చిన్నదే.. రతన్ టాటా గురించి చిన్న ఇన్స్పైరింగ్ స్టోరీ..