కడ్తాల్ మహాపిరమిడ్‌లో 4వ రోజు పత్రీజీ ధ్యాన మహాయాగం.. ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన మాస్టర్లు, ధ్యానులు
అన్నదాన కార్యక్రమాలకు చేవెళ్ల నియోజకవర్గం రామన్న గూడెం సర్పంచ్ శంకర్ రూ.2 లక్షల విరాళం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత సంవత్సర కాలంగా ధ్యానం చేస్తున్నానని, ప్రతిరోజూ ధ్యానం చేయడం వలన దీర్ఘకాలికంగా ఉన్న నడుము నొప్పి పూర్తిగా నయం అయ్యిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ది హైదరాబాద్ పిరమిడ్ స్పిరిచ్యువల్ ట్రస్ట్ చైర్మన్ విజయ భాస్కర్ రెడ్డి, పిఎంసి ఎండీ బాలకృష్ణ, డైరెక్టర్లు నవకాంత్, ఆనంద్, దామోదర్ రెడ్డి, మారం శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
కడ్తాల్(కైలాసపురి), డిసెంబర్ 24 : అహింస, ధ్యానం, సేవ, సత్యం అనే వాటిపై పిఎస్ఎస్ఎం నిలబడిందని పత్రీజీ కూతురు, పిఎస్ఎస్ఎం ఫౌండర్ పరిమళ పత్రీ అన్నారు. ఎలాంటి పెద్ద పెద్ద డిగ్రీలు లేకుండా ఒక సామాన్యుడిలా పత్రీజీ తన సామ్రాజ్యన్ని నిర్మించుకున్నారని కొనియాడారు. ప్రపంచ శాంతికై మహేశ్వరా మహా పిరమిడ్ వద్ద నిర్వహిస్తున్న ‘పత్రీజీ ధ్యాన మహా యాగం’ వేడుకలను ఆదివారం నాలుగవ రోజు వైభవంగా నిర్వహించారు. ప్రపంచం నలుమూలల నుంచి పిరమిడ్ కు చేరుకున్న ధ్యానులు పత్రీజీ శక్తి స్థల్ ను సందర్శించి ధ్యానంతో ఘనంగా పత్రీజీకి నివాళులర్పించారు.
డిసెంబర్ 24 ను గ్లోబల్ డే సందర్బంగా విదేశాల నుంచి విచ్చేసిన ధ్యానుల సందేశాలతో పాటు పత్రీజీ వీడియోల ద్వారా ఆధ్యాత్మిక సందేశాలను వినిపించారు. ఈ సందర్బంగా పరిమళ పత్రీ మాట్లాడుతూ అందరి లక్ష్యం ధ్యాన, శాకాహార, అహింస, పిరమిడ్ జగత్ అన్నారు. ఎంతో మంది చదువు లేని వారు సైతం అద్భుతంగా ధ్యాన ప్రచారాలు నిర్వహిస్తున్నారని, ఇది ఎంతో గొప్ప విషయం అన్నారు.
పరిణిత పత్రీ మాట్లాడుతూ ధ్యానాన్ని, శాకాహారాన్ని ప్రపంచ వ్యాప్తంగా పత్రీజీ ధైర్యంగా ప్రచారం చేశారని అన్నారు. అతి సులువైన ధ్యాన పద్దతి అనాపానసతిని అందించారని అన్నారు. ఆత్మ జ్ఞానంతోనే కుటుంబంలో ఆనందం, ఆరోగ్యం వెల్లివిరుస్తుందని అన్నారు. పిరమిడ్ మెడిటేషన్ ఛానల్(పిఎంసి) ద్వారా ఎంతో మంది ధ్యానంలోకి వస్తున్నారని అన్నారు. ఈ సందర్బంగా హాజరైన విదేశీయురాలు జెన్నీఫర్, ఏమీలు తమ ధ్యాన అనుభవాలు వివరించారు.
ఉదయం 5 నుంచి 8 ప్రాతః కాల ధ్యానం అనంతరం స్పిరిచ్యువల్ ఇండియా మాస పత్రిక రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్, లైట్ వర్కర్స్ టీవీ క్యాలెండర్-2024, ఓషో రజనీష్ రచించిన ‘జీవిత రహస్యాలు’ తెలుగు పుస్తకం, పండంటి రాజమణి త్రిగునాథ్(పీ.హెచ్.డీ) రచించిన ‘అగ్ని స్పర్శ’ పుస్తకం, ’40 ఎక్స్ పీరియెన్సెస్ అఫ్ ది యూత్ ఇన్ మెడిటేషన్’, పిరమిడ్ యూత్(పైమా) రూపొందించిన ‘సోల్ ఫుల్ జర్నీ’ అనే ఇంగ్లిష్ పుస్తకాలతో పాటు పిఎస్ఎస్ఎం గ్లోబల్ బ్రోచర్ ఈ సందర్బంగా వారు ఆవిష్కరించారు.
అన్నదాన కార్యక్రమాలకు చేవెళ్ల నియోజకవర్గం రామన్న గూడెం సర్పంచ్ శంకర్ రూ.2 లక్షల విరాళం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత సంవత్సర కాలంగా ధ్యానం చేస్తున్నానని, ప్రతిరోజూ ధ్యానం చేయడం వలన దీర్ఘకాలికంగా ఉన్న నడుము నొప్పి పూర్తిగా నయం అయ్యిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ది హైదరాబాద్ పిరమిడ్ స్పిరిచ్యువల్ ట్రస్ట్ చైర్మన్ విజయ భాస్కర్ రెడ్డి, పిఎంసి ఎండీ బాలకృష్ణ, డైరెక్టర్లు నవకాంత్, ఆనంద్, దామోదర్ రెడ్డి, మారం శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..