Andhra Pradesh: డోకిపర్రులో శ్రీ వెంకటేశ్వర స్వామి అష్టమ సాలకట్ల బ్రహ్మోత్సవాలు..
తొలిరోజు ఉదయం ఆలయంలోని అన్ని ఉత్సవమూర్తులకు అభిషేకం నిర్వహించారు. సాయంత్రం మహాక్షేత్రం అనుబంధంగా ఉన్న వరసిద్ధి వినాయక దేవాలయానికి విఖాసనాచార్యులు, విశ్వక్సేనుల ఆధ్వర్యంలో వెళ్లి భూదేవిని ప్రార్ధించి పుట్టమన్ను తెచ్చి పాలతో తడిపిన నవ ధాన్యాలను 12 మూకుళ్లలో వేసి దేవాలయ పరిసర ప్రాంతాల్లో ధాన్యం సమృద్ధిగా పండటంతో పాటు, పాడి పంట అభివృద్ధి చెందాలని ఉత్సవాల అంకురారోపణ శాస్త్రోక్తంగా చేశారు. ఆలయంలో
కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం డోకిపర్రులో శ్రీ వెంకటేశ్వర స్వామి అష్టమ సాలకట్ల బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవోపేతంగా ప్రారంభమయ్యాయి. ఆలయ నిర్వాహకులు కొమ్మారెడ్డి బాపిరెడ్డి, విజయ భాస్కరమ్మ, ప్రసన్న ఆధ్వర్యంలో బ్రహ్మోత్సవాలు ఆరంభమయ్యాయి. ఉత్సవాల ప్రారంభ సూచకంగా ఆలయంలోని ఉత్సవ మూర్తులకు వేద పండితులు విశేష స్నపన తిరుమంజనం నిర్వహించారు.
ఉత్సవాల తోలి రోజు స్నపన తిరుమంజనం, సేనాధిపతి ఉత్సవం, అంకురారోపణ, వాహనం, పల్లకీ సేవ నిర్వహించారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు, డోకిపర్రు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఏడు కొండల వెంకటేశ్వర స్వామికి తిరుమలలో త్రైయాహానిక దీక్షతో దివ్యశ్రీ వైఖానస భగవ చాస్త్ర మార్గానుసారంగా బ్రహ్మోత్సవాలు నిర్వహించినట్టే.. డోకిపర్రులోనూ నిర్వహిస్తున్నామన్నారు ఆలయ ప్రధాన ఆచార్యులు శ్రీధర్.
డిసెంబర్ 2 వరకు ప్రతిరోజు విశేష హోమాలు, ఉత్సవాలు, ఊంజల, వాహన సేవలు బ్రహ్మోత్సవాల్లో భాగంగా జరుగుతాయి. వైఖానస, ఆగమ శాస్త్ర ప్రకారం డోకిపర్రు మహాక్షేత్రంలో జరిగే అర్చన కైంకర్యాల ఫలం రాజ, రాష్ట్ర, గ్రామ, యాజమాన్య, ఆచార్య, అర్చక, పరిచారికలకు ఆయా వైభవం కొద్దీ లభిస్తుందని అనుగ్రహ భాషణలో వేద పండితులు వివరించారు. డోకిపర్రు మహాక్షేత్రం లో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని చిత్తా నక్షత్రం రోజున 2015 లో ప్రతిష్టించారు. ప్రతి సంవత్సరం ఆ నక్షత్రానికి మూడు రోజుల ముందు బ్రహ్మోత్సవాలు ప్రారంభించి నిర్వహిస్తున్నామన్నారు బాపిరెడ్డి, విజయభాస్కరమ్మ దంపతులు.
తొలిరోజు ఉదయం ఆలయంలోని అన్ని ఉత్సవమూర్తులకు అభిషేకం నిర్వహించారు. సాయంత్రం మహాక్షేత్రం అనుబంధంగా ఉన్న వరసిద్ధి వినాయక దేవాలయానికి విఖాసనాచార్యులు, విశ్వక్సేనుల ఆధ్వర్యంలో వెళ్లి భూదేవిని ప్రార్ధించి పుట్టమన్ను తెచ్చి పాలతో తడిపిన నవ ధాన్యాలను 12 మూకుళ్లలో వేసి దేవాలయ పరిసర ప్రాంతాల్లో ధాన్యం సమృద్ధిగా పండటంతో పాటు, పాడి పంట అభివృద్ధి చెందాలని ఉత్సవాల అంకురారోపణ శాస్త్రోక్తంగా చేశారు. ఆలయంలో ధ్వజారోహణ కార్యక్రమం రేపు ఉదయం జరుగుతుంది. అనంతరం సూర్యప్రభ వాహనం, శేషవాహనోత్సవం, సాయంత్రం ఊంజల సేవ, హంస వాహనోత్సవం, ఏకాంత సేవ నిర్వహిస్తారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..