AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చలికాలంలో ఆరోగ్యానికి అమృతం వంటి ఆహారం ఇది..! ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అవాక్కే!

చలికాలంలో బీట్‌రూట్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. చాలా మంది బీట్‌రూట్‌ను సలాడ్ రూపంలో తింటారు. మరికొందరు దాని రసాన్ని తాగడానికి ఇష్టపడతారు. ఇందులో పొటాషియం, ఐరన్, మెగ్నీషియం, జింక్, కాపర్, విటమిన్లు వంటి అనేక యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి. ఉదయాన్నే బీట్‌రూట్ జ్యూస్ తాగడం వల్ల చలికాలంలో చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దాని ప్రయోజనాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.

చలికాలంలో ఆరోగ్యానికి అమృతం వంటి ఆహారం ఇది..! ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అవాక్కే!
Beetroot Juice
Follow us
Jyothi Gadda

|

Updated on: Dec 24, 2023 | 6:41 PM

చలికాలంలో సరైన జీవనశైలి, ఆహారాన్ని నిర్వహించడం చాలా ముఖ్యం. చలికాలంలో చిన్న పొరపాటు కూడా అనారోగ్యానికి దారి తీస్తుంది. చల్లటి వాతావరణంలో శరీరంలో రోగనిరోధక శక్తి తరచుగా బలహీనపడుతుంది. దీంతో శరీరం జలుబు, దగ్గు, జ్వరం వంటి సీజనల్ వ్యాధులకు గురవుతుంది. రోగనిరోధక శక్తిని పెంచడానికి, ఆహారాన్ని మార్చడం చాలా ముఖ్యం. చలికాలంలో బీట్‌రూట్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. చాలా మంది బీట్‌రూట్‌ను సలాడ్ రూపంలో తింటారు. మరికొందరు దాని రసాన్ని తాగడానికి ఇష్టపడతారు. ఇందులో పొటాషియం, ఐరన్, మెగ్నీషియం, జింక్, కాపర్, విటమిన్లు వంటి అనేక యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి. ఉదయాన్నే బీట్‌రూట్ జ్యూస్ తాగడం వల్ల చలికాలంలో చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దాని ప్రయోజనాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.

1. రక్తహీనతలో..

రక్తహీనతతో బాధపడేవారు తమ ఆహారంలో బీట్‌రూట్‌ను ఏ రూపంలోనైనా చేర్చుకోవచ్చు.. రక్తహీనత ఉన్నవారు ఉదయం ఖాళీ కడుపుతో బీట్‌రూట్ జ్యూస్ తాగితే అద్భుత ఫలితం ఉంటుంది.

ఇవి కూడా చదవండి

2. బరువు తగ్గడం..

స్థూలకాయంతో బాధపడే వారికి బీట్‌రూట్ జ్యూస్ బాగా ఉపయోగపడుతుంది. ఇది చాలా తక్కువ కేలరీలు కలిగి ఉండి కొవ్వులో పూర్తిగా సున్నా శాతం ఉంటుంది. ఈ కారణంగా బీట్‌రూట్‌ బరువు తగ్గడానికి సహాయపడుతుంది. చలికాలంలో ఉదయాన్నే పరగడుపున బీట్ రూట్ జ్యూస్ తాగితే కొవ్వు తగ్గుతుంది.

3. కొలెస్ట్రాల్ నియంత్రణ..

ఇది శరీరంలోని ట్రైగ్లిజరైడ్ స్థాయిలను అదుపులో ఉంచుతుంది. బీట్‌రూట్ జ్యూస్ తాగడం వల్ల చెడు కొలెస్ట్రాల్ స్థాయిని నియంత్రిస్తుంది. మంచి కొలెస్ట్రాల్ స్థాయిని పెంచుతుంది. ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో బీట్‌రూట్ జ్యూస్ తాగడం వల్ల గుండె సంబంధిత వ్యాధులు దరిచేరవు.

4. మెరుగైన జీర్ణవ్యవస్థ..

బీట్‌రూట్‌లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని తినడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. ప్రతి రోజూ ఉదయం ఖాళీ కడుపుతో బీట్‌రూట్ జ్యూస్ తాగడం వల్ల మలబద్ధకం, అజీర్ణం, కడుపునొప్పి వంటి పొట్టకు సంబంధించిన రుగ్మతలు దూరమవుతాయి.

(గమనిక: ఆరోగ్య నిపుణులు, ఇతర అధ్యాయనాల ద్వారా అందిన సమాచారం మేరకు ఈ వివరాలు అందిస్తున్నాం.. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఏదైనా సందేహాలు,సమస్యలు ఉన్నా వైద్యులను సంప్రదించడమే మంచిదని గమనించగలరు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..