ఇంట్లో అద్దం ఏ దిశలో ఉండాలో తెలుసా ? మీ ఇంటిని ఎల్లప్పుడూ నిండుగా ఉంచుకోవడానికి సులువైన ట్రిక్ ఇది..!

వ్యాపారంలో పురోగతి కోసం చాలా మంది దక్షిణ దిశలో అద్దం వేస్తారు. కానీ వాస్తు శాస్త్రం ప్రకారం ఇది సరైనది కాదు. ఇంటికి ఈశాన్య దిక్కు నీటి దిక్కుగా చెబుతారు. ఈశాన్యం అంటే తూర్పు, ఉత్తరం మధ్య దిశ. మీరు ఇక్కడ అద్దం పెట్టవచ్చు. ఇంటికి తూర్పు లేదా ఉత్తరాన ఉంచిన అద్దాలు ఎల్లప్పుడూ శుభప్రదంగా ఉంటాయి. అలాగే 6 x 6 అద్దం కూడా చాలా శుభప్రదమని చెబుతారు. వీక్షకుడి ముఖం తూర్పు లేదా ఉత్తరం వైపు ఉండేలా తూర్పు లేదా ఉత్తరం గోడకు అద్దం వేలాడదీయాలని జ్యోతిశాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

ఇంట్లో అద్దం ఏ దిశలో ఉండాలో తెలుసా ? మీ ఇంటిని ఎల్లప్పుడూ నిండుగా ఉంచుకోవడానికి సులువైన ట్రిక్ ఇది..!
Mirror Direction In Home
Follow us
Jyothi Gadda

|

Updated on: Dec 24, 2023 | 6:09 PM

ప్రతి ఇంట్లో అద్దం కచ్చితంగా ఉంటుంది. ప్రతి వ్యక్తికి వారి రోజూ వారి జీవితంలో ఇది చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ప్రతి ఇంట్లోనూ ఏదో ఒక మూలలో ఖచ్చితంగా అద్దం ఉంటుంది. అయితే, ఈ అద్దం కూడా మీ అదృష్టానికి సంబంధించినది అంటున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు. ఇది మన ముఖాన్ని అందంగా ఉంచుకోవడంలో సహాయపడుతుంది. అందుకే అలాంటి అద్దాన్ని ఇంట్లో సరైన దిశలో ఉంచుకోవటం అతి ముఖ్యం. తద్వారా వ్యక్తి సానుకూల ఫలితాలను పొందుతాడు, కాని అద్దం తప్పు దిశలో ఉంచడం వల్ల ఇంట్లో నివసించే వారికి అనేక రకాల సమస్యలు వస్తాయి.

అద్దాన్ని సరైన దిశలో ఉంచడం చాలా ముఖ్యం. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో అమర్చిన అద్దం ద్వారా ఒక ప్రత్యేక రకమైన శక్తి ప్రసరిస్తుంది. అటువంటి పరిస్థితిలో మీ ఇంట్లో అద్దం ఉంచేటప్పుడు దాని దిశలో ప్రత్యేక శ్రద్ధ వహించండి. ఇంట్లో అద్దం సరైన దిశలో ఏ విధంగా ఉండాలి. వాస్తు ప్రకారం ఏ పరిమాణంలో ఉండే అద్దాలు సరైనవి. ఈ విషయాలన్నీ వాస్తు శాస్త్రంలో వివరించబడ్డాయి.. మీ ఇంట్లో సుఖసంతోషాలు, ఐశ్వర్యం పెరుగుతాయని చెబుతున్నారు. దీని వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ప్రవహిస్తుంది. దృష్టిలో ఉంచుకుని అద్దాలకు సంబంధించిన కొన్ని విషయాలను తెలుసుకుందాం.

ఇంట్లో అద్దం ఎప్పుడు ఇంటికి దక్షిణం, నైరుతి దిశలో పెట్టకూడదు. అద్దం నీటి వనరు కాబట్టి, దానిని సరైన దిశలో ఉంచడం అవసరం. దక్షిణ లేదా పడమర గోడలపై ఉంచిన అద్దం వ్యతిరేక దిశల నుండి వచ్చే శక్తిని ప్రతిబింబిస్తుంది.

ఇవి కూడా చదవండి

* రంగురంగుల అద్దాలను పెట్టరాదు..

ఇంట్లో ఎప్పుడూ రంగురంగుల అద్దాలు పెట్టకండి, అది చెడు అభిప్రాయాన్ని కలిగిస్తుంది. అలాగే మీ పడకగదిలో అద్దాలను అమర్చకండి. నీటి వనరుగా ఉండటం వల్ల అద్దం కూడా శ్రేయస్సును తెస్తుంది. కానీ దాని స్థలం సరిగ్గా ఉంటేనే అది ప్రభావవంతంగా ఉంటుంది. ఇంటి గోడకు దక్షిణం వైపు అద్దం పెట్టకూడదు. ఈ దిక్కు యముడికి ఆస్థానంగా చెబుతారు. దీని ప్రభావంతో ధన నష్టం కలుగుతుంది. వ్యాపారంలో పురోగతి కోసం చాలా మంది దక్షిణ దిశలో అద్దం వేస్తారు. కానీ వాస్తు శాస్త్రం ప్రకారం ఇది సరైనది కాదు.

* ఇంటికి ఈ దిక్కున అద్దం పెడితే..

ఇంటికి ఈశాన్య దిక్కు నీటి దిక్కుగా చెబుతారు. ఈశాన్యం అంటే తూర్పు, ఉత్తరం మధ్య దిశ. మీరు ఇక్కడ అద్దం పెట్టవచ్చు. ఇంటికి తూర్పు లేదా ఉత్తరాన ఉంచిన అద్దాలు ఎల్లప్పుడూ శుభప్రదంగా ఉంటాయి. అలాగే 6 x 6 అద్దం కూడా చాలా శుభప్రదమని చెబుతారు. వీక్షకుడి ముఖం తూర్పు లేదా ఉత్తరం వైపు ఉండేలా తూర్పు లేదా ఉత్తరం గోడకు అద్దం వేలాడదీయాలి.

* అద్దం ఏర్పాటులో ఈ విషయాలను గుర్తుంచుకోండి..

> డైనింగ్ టేబుల్ ముందు అద్దం ఉంచండి. అది శ్రేయస్సును కలిగిస్తుంది.

>> డ్రాయింగ్ రూమ్ ఉత్తర గోడపై అద్దం ఉంచండి.

>> అద్దాన్ని చతురస్రాకారంగా లేదా వృత్తాకారంగా తయారు చేయవచ్చు. కానీ వింత డిజైన్లు ఉండకూడదు.

>> మూలలో లేదా అల్మారాలో అద్దం ఉంచండి. అది మీ సంపదను పెంచుతుంది.

>> ఉత్తర దిక్కును సంపదల కుబేరుని దిక్కుగా పరిగణిస్తారు. దక్షిణ దిశలో అద్దం ఉంచడం వలన అద్దంలో ఉత్తరం నుండి చిత్రం కనిపిస్తుంది. కాబట్టి ఇది మంచిది కాదు.

>> చాలా బరువైన, పదునైన లేదా విరిగిన అంచులు ఉన్న అద్దాన్ని ఎప్పుడూ ఇంట్లో ఉంచవద్దు. అలాగే త్రిభుజాకారంలో అంటే మూడు మూలల అద్దం వాడకూడదు. ఇది ప్రతికూలతను పెంచుతుంది.

Note: (వాస్తు వివరాలు, రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. కేవలం మనుషుల ఆసక్తిని, నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..