AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: చలికాలంలో ఈ డ్రై ఫ్రూట్స్ ను వేయించి తింటే జలుబు, దగ్గు పరార్..!

ఈ డ్రై ఫ్రూట్ లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఇవి జ్వరం, తలనొప్పిని నివారిస్తాయి. ఖర్జూరాన్ని నానబెట్టి తింటే జలుబు, దగ్గు తగ్గుతాయి. ఇది శరీరాన్ని చాలా వెచ్చగా ఉంచుతుంది. ఇది శరీరం నుండి కఫాన్ని బయటకు పంపడానికి కూడా పనిచేస్తుంది. బట్టి ఖర్జూరాన్ని పాలలో 24 గంటలు లేదా రాత్రంతా నానబెట్టి మరుసటి రోజు అందులో కాస్త కుంకుమపువ్వు, యాలకులు, అల్లం కలిపి తాగితే మంచి ఫలితాలు ఉంటాయి.

Health Tips: చలికాలంలో ఈ డ్రై ఫ్రూట్స్ ను వేయించి తింటే జలుబు, దగ్గు పరార్..!
ఖర్జూరం, వాల్‌నట్స్, బాదం, ఎండుద్రాక్షలో మన శరీరానికి మేలు చేసే అనేక పోషకాలు ఉన్నాయి. ఇవి శరీరానికి శక్తిని అందిస్తుంది. రోజంతా పనిచేసినా అలసట ఉండదు. రోజూ 2-3 ఖర్జూరాలు తినాలి. అలాగే నీటిలో నానబెట్టిన ఎండుద్రాక్షను తిన్నా ఎసిడిటీ సమస్య తొలగిపోతుంది. కడుపు చల్లగా ఉంటుంది. హార్మోన్ల అసమతుల్యతతో బాధపడేవారికి ఎండుద్రాక్ష నానబెట్టిన నీరు దివ్యౌషధంలా పనిచేస్తుంది. పీరియడ్స్ సమస్యలు దూరమవుతాయి. ప్రతి రోజూ ఉదయం నిద్రలేవగానే నీళ్లలో నానబెట్టిన ఎండుద్రాక్షలను తినాలి. అలాగే నానబెట్టిన బాదం, వాల్‌నట్స్‌, ఖర్జూరం తింటే శరీరంలో ఎలాంటి సమస్యలు తలెత్తవు. బరువు తగ్గి ఆరోగ్యంగా ఉంటారు.
Jyothi Gadda
|

Updated on: Dec 24, 2023 | 5:27 PM

Share

తరచుగా జలుబు, దగ్గుతో బాధపడేవారు రోజూ డ్రై ఫ్రూట్స్ తినడం ద్వారా నివారించవచ్చు. కొన్ని డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు దరిచేరవు..దాంతో పాటు ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో కూడా డ్రై ఫ్రూట్స్‌ అద్భుతంగా సహాయపడతాయి. పెద్దలు, వైద్యులు చెబుతున్న దాని ప్రకారం..తరచూ జలుబు, దగ్గుతో బాధపడేవారికి ప్రతిరోజూ డ్రై ఫ్రూట్స్ తినమని సలహా ఇస్తూ ఉంటారు. అయితే ఖర్జూరాన్ని నానబెట్టుకుని, లేదంటే వేయించి తింటే శరీరానికి వెచ్చదనంతో పాటు మరెన్నో లాభాలు ఉన్నాయంటున్నారు. అనేక అనారోగ్య సమస్యలు పరిష్కరించబడతాయి. అలాగే మూత్ర సంబంధిత సమస్యలు ఉన్నవారు కూడా చలికాలంలో నానబెట్టిన ఖర్జూరాలను తినడం వల్ల పలు రకాల సమస్యలను తగ్గించుకోవచ్చునని చెబుతున్నారు. మరింత సమాచారంలోకి వెళితే..

నానబెట్టిన ఖర్జూరం, లేద వేయించిన ఖర్జూరం తినడం వల్ల శరీరంలో విటమిన్ బి-6 పెరుగుతుంది. అంతేకాకుండా ఇందులో విటమిన్ సి, విటమిన్ బి1, బి2, రిబోఫ్లావిన్, నికోటినిక్ యాసిడ్, విటమిన్ ఎ కూడా ఉన్నాయి. ఈ విటమిన్లన్నీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ విటమిన్ శరీరంలో రక్తహీనతను నివారిస్తుంది. వేయించిన ఖర్జూరం తినడం వల్ల శరీరంలో ఇంటర్‌లుకిన్ లభిస్తుంది. ఇది ఇన్ఫ్లమేటరీ సైటోకిన్‌లను తగ్గిస్తుంది. ఇది నాడీ వ్యవస్థను చాలా వేగవంతం చేస్తుంది. నిద్రలేమితో బాధపడేవారికి కూడా ఖర్చూరం గొప్పగా హెల్ప్‌ చేస్తుంది. ఇందుకోసం గోరువెచ్చని నీటిలో ఖర్జూరాన్ని కలుపుకుని తాగితే నిద్రలేమి సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది.

జలుబు, దగ్గుతో ఇబ్బంది పడేవారు వేయించిన ఖర్జూరం తినడం వల్ల శరీరానికి గొప్ప ప్రయోజనాలు లభిస్తాయి. శరీరాన్ని వెచ్చగా ఉంచడమే కాకుండా, శరీరం నుండి కఫం తొలగించడానికి కూడా ఇది పనిచేస్తుంది. అదనంగా శ్వాసను క్లియర్‌ చేస్తుంది. ఊపిరితిత్తులలో నిండుకున్న కఫాన్ని బయటకు పంపడానికి కూడా ఇది పనిచేస్తుంది. ఖర్జూరంలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఇవి జ్వరం, తలనొప్పిని నివారిస్తాయి. ఖర్జూరాన్ని నానబెట్టి తింటే జలుబు, దగ్గు తగ్గుతాయి. ఇది శరీరాన్ని చాలా వెచ్చగా ఉంచుతుంది. ఇది శరీరం నుండి కఫాన్ని బయటకు పంపడానికి కూడా పనిచేస్తుంది. బట్టి ఖర్జూరాన్ని పాలలో 24 గంటలు లేదా రాత్రంతా నానబెట్టి మరుసటి రోజు అందులో కాస్త కుంకుమపువ్వు, యాలకులు, అల్లం కలిపి తాగితే మంచి ఫలితాలు ఉంటాయి.

ఇవి కూడా చదవండి

(గమనిక: ఆరోగ్య నిపుణులు, ఇతర అధ్యాయనాల ద్వారా అందిన సమాచారం మేరకు ఈ వివరాలు అందిస్తున్నాం.. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఏదైనా సందేహాలు,సమస్యలు ఉన్నా వైద్యులను సంప్రదించడమే మంచిదని గమనించగలరు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..