Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

How to Get Rich: ధనవంతులు కావాలనుకుంటున్నారా.. అయితే ఈ టిప్స్ మీ కోసమే!

'ధనం మూలం ఇదం జగత్'.. ఈ నానుడి ఊరికే రాలేదు. ప్రస్తుతం డబ్బుతో ఏదైనా.. దేనినైనా సొంతం చేసుకోవచ్చు. అంతగా డబ్బు.. ప్రపంచాన్ని శాసిస్తుంది. డబ్బుతోనే ప్రపంచం కూడా నడుస్తుంది. ఏది కావాలన్నా.. ఏం చేయాలన్నా దానికి మూల కారణం డబ్బు. ధనవంతులుగా బతకాలని చాలా మందికి ఉంటుంది. ఖరీదైన కార్లలో తిరగాలని.. డబ్బులో మునిగి తేలాలని ఉంటుంది. ఇలా డబ్బు కోసం రేయింబవళ్లు శ్రమించి.. ధనాన్ని సంపాదిస్తూ ఉంటారు. ఈ డబ్బును పొదుపు చేసుకుంటేనే భవిష్యత్తులో ఎలాంటి..

How to Get Rich: ధనవంతులు కావాలనుకుంటున్నారా.. అయితే ఈ టిప్స్ మీ కోసమే!
Rich
Follow us
Chinni Enni

| Edited By: Ram Naramaneni

Updated on: Dec 24, 2023 | 8:41 PM

‘ధనం మూలం ఇదం జగత్’.. ఈ నానుడి ఊరికే రాలేదు. ప్రస్తుతం డబ్బుతో ఏదైనా.. దేనినైనా సొంతం చేసుకోవచ్చు. అంతగా డబ్బు.. ప్రపంచాన్ని శాసిస్తుంది. డబ్బుతోనే ప్రపంచం కూడా నడుస్తుంది. ఏది కావాలన్నా.. ఏం చేయాలన్నా దానికి మూల కారణం డబ్బు. ధనవంతులుగా బతకాలని చాలా మందికి ఉంటుంది. ఖరీదైన కార్లలో తిరగాలని.. డబ్బులో మునిగి తేలాలని ఉంటుంది. ఇలా డబ్బు కోసం రేయింబవళ్లు శ్రమించి.. ధనాన్ని సంపాదిస్తూ ఉంటారు.

ఈ డబ్బును పొదుపు చేసుకుంటేనే భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉంటారు. సరైన ప్లాన్ తో డబ్బు సేవ్ చేసుకుంటే ధనవంతులు అవ్వొచ్చు. అయితే ధనవంతులుగా ఎదగాలంటే అదృష్టం కూడా కలిసి రావాలని అంటారు. కానీ అది మన చేతుల్లోనే ఉందని చాలా మందికి తెలీదు. మనీ మేనేజ్ మెంట్ గురించి సరిగ్గా తెలుసుకుంటే.. ధనవంతులుగా మారవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

వృథా ఖర్చులు తగ్గించాలి:

మీరు ధనవంతులుగా మారాలంటే చేయాల్సిన మొట్ట మొదటి విషయం ఏంటో తెలుసా.. వృథా ఖర్చులు తగ్గించు కోవాలి. డబ్బు ఉంది కదా అని చాలా మంది వృథా ఖర్చులు చేస్తారు. తినే విషయంలో, నెలవారీ బడ్జెట్, మీరు ఉపయోగించే వస్తువుల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అందుకు తగ్గట్టే మీ ప్లానింగ్ కూడా ఉండాలి. ఇది మీకు చాలా ఉపయోగ పడుతుంది.

ఇవి కూడా చదవండి

క్యాష్ ఇవ్వండి:

చాలా వరకు ఇప్పుడు ఆన్ లైన్ పేమెంట్స్, లావా దేవీలు జరుగుతున్నాయి. ఆన్ లైన్ లో లావాదేవీలు చేస్తే.. మీకు డబ్బు ఖర్చు గురించి పెద్దగా ఆశక్తి ఉండదు. అదే నగదు చెల్లింపులు చేస్తే.. అనవసరమైన ఖర్చులను తగ్గించు కోవచ్చు. నగదు చెల్లింపు చేస్తే.. ఖచ్చితంగా ఖర్చు చేసే ముందు ఆలోచిస్తారు.

ట్యాక్స్ లు సేవ్ చేసుకోండి:

మీరు ఎక్కువగా ట్యాక్స్ లు చెల్లిస్తే.. వివిధ ప్రభుత్వ పథకాల్లో డబ్బును ఇన్వెస్ట్ చేసుకోవాలి. మీరు చాలా వరకు ట్యాక్స్ సేవ్ చేసుకోవచ్చు. ఇలా చేస్తే మీకు మంచి బెనిఫిట్స్ ఉంటాయి. ట్యాక్స్ సేవ్ కావడంతో పాటు.. ఎక్కడ పెట్టుబడి పెట్టినా మంచి ఆదాయం పొందొచ్చు.

ఇన్వెస్ట్ చేయడం నేర్చుకోవాలి:

మీరు వచ్చిన డబ్బు.. వచ్చినట్టు ఖర్చు చేస్తూ ఉంటే.. ఆదాయం ఉండదు. ప్రతి నెలా కొంచొం అమౌంట్ సేవ్ చేసుకుంటూ వెళ్తేనే.. భవిష్యత్తులో ఉపయోగ పడుతుంది. ప్రస్తుతం ఇప్పుడు మార్కెట్లో ఎన్నో రకాల ఇన్వెస్ట్ స్కీమ్స్ ఉన్నాయి.