- Telugu News Photo Gallery Keep these important points in mind while ironing silk sarees, Check here is details in Telugu
Tips for Silk Saree Iron: పట్టు చీరల్ని ఐరన్ చేసేటప్పుడు ఈ ముఖ్య విషయాలను గుర్తు పెట్టుకోండి!
సాధారణంగా బట్టల్ని ఐరన్ చేస్తూ ఉంటారు. ఇంట్లో ఉంటే ఏదో ఒకటి వేసేసుకుంటారు కానీ.. ఆఫీసులకు, పిల్లలు స్కూళ్లకు వెళ్లేటప్పుడు బట్టలకు ఖచ్చితంగా ఇస్త్రీ ఉండాల్సిందే. ఇప్పుడు ఐరన్ బాక్సులు వచ్చాక ఎవరి ఇంట్లో వాళ్లే ఐరన్ చేసుకుంటూ ఉన్నారు. అన్నీ బట్టలు ఒక ఎత్తు అయితే.. పట్టు చీరలు మాత్రం మరో ఎత్తు. పట్టు చీరలు ఎప్పటికీ కొత్తగా కనిపించాలంటే కొన్ని రకాల టిప్స్ ఖచ్చితంగా పాటించాలి. అందులో ఇస్త్రీ కూడా ఒకటి. పట్టు చీరల్ని ఎప్పటికప్పుడు ఇస్త్రీ..
Chinni Enni | Edited By: Ram Naramaneni
Updated on: Dec 24, 2023 | 8:41 PM

సాధారణంగా బట్టల్ని ఐరన్ చేస్తూ ఉంటారు. ఇంట్లో ఉంటే ఏదో ఒకటి వేసేసుకుంటారు కానీ.. ఆఫీసులకు, పిల్లలు స్కూళ్లకు వెళ్లేటప్పుడు బట్టలకు ఖచ్చితంగా ఇస్త్రీ ఉండాల్సిందే. ఇప్పుడు ఐరన్ బాక్సులు వచ్చాక ఎవరి ఇంట్లో వాళ్లే ఐరన్ చేసుకుంటూ ఉన్నారు. అన్నీ బట్టలు ఒక ఎత్తు అయితే.. పట్టు చీరలు మాత్రం మరో ఎత్తు. పట్టు చీరలు ఎప్పటికీ కొత్తగా కనిపించాలంటే కొన్ని రకాల టిప్స్ ఖచ్చితంగా పాటించాలి. అందులో ఇస్త్రీ కూడా ఒకటి.

పట్టు చీరల్ని ఎప్పటికప్పుడు ఇస్త్రీ చేస్తేనే కొత్త వాటిలా కనిపిస్తాయి. కానీ పట్టు చీరలు ఇస్త్రీ చేసేటప్పుడు తప్పకుండా కొన్ని రకాల టిప్స్ ని పాటించాలి. చాలా మందికి తెలియక ఎలా పడితే అలా చేసి.. చీరల్ని పాడు చేస్తూ ఉంటారు. అలా కాకుండా ఉండాలంటే ఈ టిప్స్ మీకు సహాయ పడతాయి.

ముందు పట్టు చీరలు కొనేటప్పుడే చెక్ చేసుకోవాలి. వాటిని ఇస్త్రీ చేయవచ్చో లేదో అడగండి. లేబుల్ ఉంటే దానిని చెక్ చేయండి. దీంతో చీరలు పాడవ్వకుండా ఉంటాయి. పట్టు చీరల్ని ఇస్త్రీ చేసేటప్పుడు దానిపై కాటన్ వస్త్రం ఉంచి చేయాలి. ఇలా చేస్తే.. వేడికి త్వరగా కాలిపోకుండా ఉంటాయి.

అలాగే పట్టు చీరల్ని ఐరన్ చేసేటప్పుడు.. ఐరన్ బాక్స్ లోని మోడ్స్ ని మార్చుకోవాలి. సిల్క్ సెట్టింగ్ ఉంటే దానికి మార్చి ఇస్త్రీ చేయాల్సి ఉంటుంది. దీని వల్ల చీరలు త్వరగా పాడవకుండా.. ఉంటాయి. అందుకే ఐరన్ బాక్స్ లో సెట్టింగ్స్ మార్చాలి.

పట్టు చీరల్ని ఇస్త్రీ చేసేముందు.. బార్డర్స్ ను ఐరన్ చేయాలి. ఆ తర్వాత చీర మధ్యలో చేయాలి. ఇలా చేస్తే ముడతలు చక్కగా పోతాయి. ఐరన్ చేయగానే వెంటనే మడతలు పెట్టకూడదు. హ్యాంగర్ కు వేలాడదీయండి. వెంటనే మడత పెడితే ముడతలు వచ్చేస్తాయి.





























