Anand Mahindra Reacts: త్వరలో మేం దివాళా తీస్తాం..! ఆనంద్ మహీంద్రా చేసిన పోస్ట్‌ వైరల్‌.. ఏం జరిగిందంటే..

మహీంద్రా తార్, X UV700 కారుకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఈ అబ్బాయిని నియమించాలని మరో నెటిజన్ పోస్ట్ చేశాడు. ఎందరో యువకుల కలల కారుగా పేరుగాంచిన మహీంద్రా థార్ కారును 700 రూపాయలకు అడిగేలా ఈ కుర్రాడు అందరి హృదయాలను దోచుకున్నాడని మరో నెటిజన్ తెలిపారు. మహీంద్రాకు చెందిన 'తార్' మోడల్ కారు చెన్నైలో సుమారు రూ.10 లక్షల నుంచి 16 లక్షలకు అమ్ముడవుతుండడం గమనార్హం.

Anand Mahindra Reacts: త్వరలో మేం దివాళా తీస్తాం..! ఆనంద్ మహీంద్రా చేసిన పోస్ట్‌ వైరల్‌.. ఏం జరిగిందంటే..
Anand Mahindra
Follow us
Jyothi Gadda

|

Updated on: Dec 24, 2023 | 7:30 PM

సోషల్ మీడియాలో దిగ్గజ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్ర ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటారు. తాజాగా ఆయన చేసిన ట్వీట్ ఒకటి తెగ వైరల్ అవుతోంది. పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా డిసెంబర్ 24న చీకు యాదవ్ అనే నోయిడా కుర్రాడి అందమైన వీడియోను షేర్ చేశారు. నోయిడాలో చీకు యాదవ్ అనే పిల్లవాడు తన తండ్రితో రూ.700కి థార్ కారు కొనుక్కోవడం గురించి మాట్లాడుతున్న వీడియోపై ఆనంద్ మహీంద్ర ట్విట్టర్ వేదికగా చమత్కారంగా స్పందించారు.

ఆనంద్‌ మహీంద్ర షేర్‌ చేసిన వీడియోలో చీకూ అనే కుర్రాడు తన తండ్రితో మహీంద్రా కార్ల కొనుగోలు గురించి చెబుతున్నాడు.. వాడి ముద్దు ముద్దు మాటాలతో తండ్రితో చేస్తున్న సంభాషణలో మహీంద్రా థార్, మహీంద్రా ఎక్స్‌యూవీ 700 మోడళ్లు రెండూ ఒకటేనని బుడ్డొడి అభిప్రాయం. అదే మరీ పసితనం అంటే..అంతేకాదు.. బుడ్డొడి ఉద్దేశంలో ఎక్స్‌యూవీ 700 మోడల్ పేరులో 700 ఉంది కాబట్టి ఏడు వందలకు ఆ కారు కొనేయచ్చని అంటున్నాడు. ఆ పిల్లవాడి మాటల్ని తండ్రి జాగ్రత్తగా రికార్డు చేశాడు. వారిద్దరి సంభాషణకు సంబంధించిన వీడియోని ఇంటర్‌నెట్‌లో పోస్ట్‌ చేయటంతో వీడియో నెట్టింట తెగ వైరల్‌గా మారింది. చివరకు ఆనంద్ మహీంద్రా వరకూ చేరింది. దాంతో బాలుడి మాటలకు సమాధానంగా ఆనంద్‌ మహీంద్రా స్పందించారు.. తాను కొన్ని చీకు యాదవ్ ఇన్ స్టా పోస్టులను చాలానే చూశానని చెప్పాడు.. అతను అంటే తనకు కూడా ఇష్టమే అన్నారు. కానీ, ఇక్కడ ఉన్న ఏకైక సమస్యల్లా.. చీకు చెప్పినట్లు తమ మహీంద్రా థార్ వాహనాన్ని రూ.700 అమ్మితే.. అతి త్వరలోనే దివాళా తీస్తామంటూ ఆనంద్ మహీంద్ర చమత్కారంగా ట్వీట్ చేశారు.

ఇవి కూడా చదవండి

ఈ వీడియో వాస్తవానికి ఈ ఏడాది జూలైలో అతని తండ్రి నిర్వహిస్తున్న చీకు ఇన్‌స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేయబడింది. క్లిప్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో 7 లక్షలకు పైగా వీక్షణలను సంపాదించింది. చీకూ అమాయకత్వానికి సోషల్ మీడియా వినియోగదారులు సంబరపడుతున్నారు. మరికొందరు చీకూ మాటలు నిజమేనని ఆశించారు. “అతని మాటలు నిజమని నేను ఆశిస్తున్నాను. నేను రెండు కొనాలనుకుంటున్నాను, ఒకటి నాకు, ఒకటి నా భార్యకు అంటూ ఒక X వినియోగదారు రాశారు.

నెటిజన్ల వ్యాఖ్య: మహీంద్రా తార్, X UV700 కారుకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఈ అబ్బాయిని నియమించాలని మరో నెటిజన్ పోస్ట్ చేశాడు. ఎందరో యువకుల కలల కారుగా పేరుగాంచిన మహీంద్రా థార్ కారును 700 రూపాయలకు అడిగేలా ఈ కుర్రాడు అందరి హృదయాలను దోచుకున్నాడని మరో నెటిజన్ తెలిపారు. మహీంద్రాకు చెందిన ‘తార్’ మోడల్ కారు చెన్నైలో సుమారు రూ.10 లక్షల నుంచి 16 లక్షలకు అమ్ముడవుతుండడం గమనార్హం.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే