గ్రౌండ్‌లో గోల్ప్ ఆడుకుంటున్న వ్యక్తి.. రెండు పాములు పెనవేసుకొని గ్రౌండ్‌లోకి ఎంట్రీ !!
కొందరు ఏదైనా పని మొదలు పెడితే దానిలో పూర్తిగా మునిగిపోతారు. మిన్ను విరిగి మీదపడినా పట్టించుకోరు. తాజాగా అలాంటి సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట హల్‌చల్ చేస్తోంది. కొందరు పాముల పేరు చెబితే ఆమడదూరం లగెత్తుతారు. కానీ ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ వ్యక్తి పక్కనే రెండు పాములు సయ్యాటలాడుతున్నా పట్టించుకోకుండా గోల్ఫ్ ఆటలో మునిగిపోయాడు.
కొందరు ఏదైనా పని మొదలు పెడితే దానిలో పూర్తిగా మునిగిపోతారు. మిన్ను విరిగి మీదపడినా పట్టించుకోరు. తాజాగా అలాంటి సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట హల్‌చల్ చేస్తోంది. కొందరు పాముల పేరు చెబితే ఆమడదూరం లగెత్తుతారు. కానీ ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ వ్యక్తి పక్కనే రెండు పాములు సయ్యాటలాడుతున్నా పట్టించుకోకుండా గోల్ఫ్ ఆటలో మునిగిపోయాడు. ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్‌లోని గోల్ఫ్ కోర్స్‌లో ఓ వ్యక్తి గోల్ఫ్ ఆడుతున్నాడు. ఇంతలో ఎక్కడినుంచి వచ్చాయో రెండు పెద్ద పాములు వచ్చాయి. అవి పెనవేసుకుని సయ్యాటలో మునిగితేలుతున్నాయి. అలా ఆ పాములు రెండూ కాసేపటికి ఆ వ్యక్తి సమీపానికి వచ్చాయి. అయినా ఆ వ్యక్తి ఏమాత్రం వాటిని పట్టించుకోకుండా తన గోల్ఫ్ ఆటలో మునిగిపోయాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. పనిలో ఏకాగ్రత అంటే ఇలాగే ఉండాలి అని కొందరంటే.. కాస్త ముందూ వెనుకా చూసుకో బ్రదర్ అంటూ మరికొందరు.. వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మలబద్ధకంతో ఇబ్బందిపడుతున్నారా.. ఇదిగో మీ సమస్యకు సింపుల్ పరిష్కారం
Prabhas’ Salaar : సలార్ పై.. వాళ్ల కుట్ర ప్లాప్ అంటూ పోస్టులు..
ఆసియాలోనే టాలీవుడ్ నుంచి ఒకే ఒక్కడు.. దటీజ్ NTR క్రేజ్
డంకీ పని డమాల్ దారుణంగా పడిపోయిన కలెక్షన్స్
Sandeep Reddy Vanga: ‘పేరెంట్స్ ముందు ముద్దు సీన్..’ క్రేజీ ఆన్సర్ ఇచ్చిన వంగా
భూమిలోకి కుంగిపోతున్న నగరాలు.. పెను ప్రమాదం తప్పదా
ఈ నర్స్ చేసిన దారుణం తెలిస్తే.. మీరు రగిలిపోతారు
లోకో పైలట్ మానవత్వం.. మూగజీవుల రక్షకులు అంటూ నెటిజెన్స్ కామెంట్స్
రాక్షసానందం.. స్ట్రాను ఎంగిలి చేసి.. వెండింగ్ మెషీన్లో పెట్టి.
ఎంతకు తెగించార్రా.. ఏటీఎంకు తాడుకట్టి బొలెరోతో లాక్కుపోయిన దొంగలు
‘సూపర్ ఎల్ నినో’ వచ్చేసింది..! వచ్చే రెండున్నరేళ్లూ కరువే
అదిగదిగో లచ్చిందేవి.. డ్రైవర్‌కు కలిసొచ్చిన లక్.. రాత్రికి రాత్రే

