AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Operation Sindhoor: ఆపరేషన్ సిందూర్ కి ప్రేరణ అదేనా? హనుమంతుడితో సంబంధం ఉందా?

ప్రస్తుతం దేశంలో మాత్రమే కాదు ప్రపంచ వ్యాప్తంగా వినిపిస్తోన్న పేరు ఆపరేషన్ సిందూర్. దాయాది దేశం పాక్ లో ఉన్న ఉగ్రస్తావరాలపై దాడి చేసిన ఆపరేషన్ సింధూర్‌ను పరిశీలిస్తే.. దీనికి ప్రేరణ రామాయణ ఇతిహాసమైన శ్రీ రామ చరిత మానస్ నుంచి తీసుకోబడిందని స్పష్టంగా తెలుస్తుంది. భారత ప్రభుత్వం కూడా ఈ వాస్తవాన్ని అంగీకరించింది. భారత సైన్యం హనుమంతుడి సూత్రాలను అనుసరిస్తుందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్వయంగా ఒక కార్యక్రమంలో అన్నారు. అయితే ఆపరేషన్ సిందూర్ కి రామ చరిత మానస్ కి ఉన్న లింక్ ఏమిటో తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాం ఈ రోజు

Operation Sindhoor: ఆపరేషన్ సిందూర్ కి ప్రేరణ అదేనా? హనుమంతుడితో సంబంధం ఉందా?
Operation Sindhur
Surya Kala
|

Updated on: May 08, 2025 | 3:53 PM

Share

ఏప్రిల్ 22న పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద సంఘటనకు ప్రతీకారం తీర్చుకోవడానికి.. భారతదేశం మంగళవారం ఆపరేషన్ సిందూర్ నిర్వహించింది. ఈ ఆపరేషన్‌లో 100 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారనే వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు ఈ ఆపరేషన్ తర్వాత పాకిస్తాన్ ప్రభుత్వం భయాందోళనలకు గురవుతోంది. అయితే భారత ఆర్మీ ఆపరేషన్ సింధూర్ అనే పేరుతో చర్యలు తీసుకుంది. అయితే నేటి తరానికి ఆపరేషన్ సిందూర్ అనే పేరు కొత్తది అయినప్పటికీ ఆ ఆపరేషన్ పేరు చాలా పాతదని తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోవచ్చు. దాదాపు 10 లక్షల సంవత్సరాల క్రితం అంటే త్రేతా యుగంలో మొదటిసారిగా ఈ ఆపరేషన్ రామాయణ యుద్ధానికి ముందు అంటే రామ-రావణ యుద్ధానికి ముందు జరిగింది.

మహర్షి వాల్మీకి రాసిన రామాయణం, గోస్వామి తులసీదాస్ రచించిన శ్రీ రామచరిత మానస్ ప్రకారం ఈ ఆపరేషన్‌ను మొదట రాముడి ప్రత్యేక దూత హనుమంతుడు నిర్వహించాడు. ఆ సమయంలో ఈ ఆపరేషన్ చాలా కష్టం. ఎందుకంటే లంకకు కాపలాగా రాడార్ వ్యవస్థ (లంకిణి) చాలా బలంగా ఉండేది. లంకిణి దృష్టి దాటిఒక దోమ కూడా తప్పించుకుని లంకలోకి అడుగు పెట్టలేకపోయేది. అటువంటి లంకిణి చాకచక్యంగా తప్పించుకుని హనుమంతుడు లంకలో తన లక్ష్యాన్ని చేరుకున్నాడు. ఇలా లంకలో చేరుకుని సీతమ్మ జాడ కనుగొనేందుకు హనుమంతుడికి 24 గంటల కన్నా తక్కువ సమయం పట్టింది. అదే విధంగా ఇప్పుడు భారత నిఘా సంస్థ పాక్ రాడార్ వ్యవస్థను తప్పించుకుని పాకిస్తాన్‌లోని తన లక్ష్యాలను ఇదే తరహాలో గుర్తించింది.

ఇవి కూడా చదవండి

లంకలో అధర్మమైన ప్రదేశాలపై మాత్రమే హనుమంతుడు దాడి

లంకలో చేరుకున్న హనుమంతుడు లంకలో ఎవరైతే అధర్మానికి సపోర్ట్ గా నిలబడ్డారో వారికి చెందిన వాటిని మాత్రమే నాశనం చేశాడని రామాయణంలో ఒక కథ ఉంది. న్యాయం మాట్లాడే విభీషణుడితో సహా అనేక మంది భవనాలకు హనుమంతుడు ఎటువంటి నష్టం కలిగించలేదు. ఈ విషయాలను గోస్వామి తులసీదాస్ శ్రీరామ చరిత మానస్‌లో, మహర్షి వాల్మీకి రామాయణంలో పేర్కొన్నారు. తులసీదాస్ రచించిన శ్రీ రామ చరిత మానస్‌లో రావణుడు దూతగా వచ్చిన హనుమంతుడిని పట్టుకుని బంధించినప్పుడు ‘నన్ను చంపేవారిని నేను చంపుతాను’ అని హనుమంతుడు సమాధానం ఇచ్చినట్లు పేర్కొన్నాడు.

అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగం

ధునాతన సాంకేతిక పరిజ్ఞానం వాడకం విషయానికొస్తే అప్పట్లో కూడా హనుమంతుడు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించినట్లు శ్రీ రామచరిత మానస్‌లో ఒక కథ ఉంది, రాక్షసులు హనుమంతుడి తోకకు వస్త్రం చుట్టినప్పుడు. హనుమంతుడు తన దైవం అయిన శ్రీరాముడితో మానసికంగా శ్రీరాముడితో మాట్లాడి.. ఇప్పుడు ఏమి చేయాలి అంటూ మార్గదర్శకత్వం కోరాడని .. అప్పుడు శ్రీ రాముడు అతనికి లంకను దహనం చేసేందుకు అనుమతి ఇచ్చాడని ఓ కథ. ఇపుడు మనం ఉపయోగిస్తున్న మొబైల్ ఫోన్ ఒకే ఒక్క తరంగంతో పనిచేస్తుంది. అయితే అప్పట్లోనే హనుమాన్ దగ్గర 49 తరంగదైర్ఘ్యాలు కలిగిన ఉపగ్రహం ద్వారా శ్రీ రాముడుతో సంభాషణ చేసినట్లు తులసీదాస్ రాశారు. సీతమ్మ జాడ తెలుసుకునే సమయంలో హనుమంతుడు హరి ప్రేరణతో.. నలభై తొమ్మిది మంది మరుత్తులు తరలివెళ్లారు.

శరదృతువులో ఆపరేషన్ చేసిన హనుమంతుడు

ఈ ఆపరేషన్ సిందూర్ పూర్తి చేయడానికి భారత సైన్యానికి 25 నిమిషాలు పట్టింది. అయితే రాముడి అనుమతి పొందిన తర్వాత హనుమంతుడు రాఫెల్ కంటే చాలా రెట్లు వేగంగా వివిధ రకాల వనరులను ఉపయోగించి కేవలం కొన్ని క్షణాల్లోనే మొత్తం లంకను తగలబెట్టాడు. ఈ వాస్తవాలను భారత ప్రభుత్వం బహిరంగంగా అంగీకరించింది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్వయంగా ఒక సభలో ప్రసంగిస్తూ ఈ ఆపరేషన్ సిందూర్ హనుమంతుడి సూత్రాలను అనుసరించి జరిగిందని అన్నారు. అయితే ఈ రెండు ఆపరేషన్ల సమయంలో ఖచ్చితంగా తేడా ఉంది. చాతుర్మాస్యం తర్వాత శరదృతువు కాలంలో హనుమంతుడు ఈ ఆపరేషన్ చేసాడు. అయితే భారత సైన్యం వేసవి కాలంలో ఈ ఆపరేషన్ సిందూర్ ని నిర్వహించింది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.

ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ
ఈ రెండు చిరుతిండ్లు తింటే కాలేయం ఖతమే.. జాగ్రత్త పడకపోతే..
ఈ రెండు చిరుతిండ్లు తింటే కాలేయం ఖతమే.. జాగ్రత్త పడకపోతే..