Navaratri 2022: ఈ ఏడాది శరన్నవరాత్రులు ఎప్పుడు, పూజా సమయం, పూజా విధానం , శుభముహర్తం.. పూర్తి వివరాలు మీ కోసం
శరన్న నవరాత్రులు అత్యంత వైభవంగా జరుపుకుంటారు. ఈ సంవత్సరం నవరాత్రుల పవిత్ర పండుగ 26 సెప్టెంబర్ 2022 నుండి ప్రారంభమై అక్టోబర్ 05 వరకు కొనసాగుతుంది.

Navaratri 2022: సనాతన సంప్రదాయంలో.. దసరా పర్వదినం కోసం అమ్మవారి భక్తులు సంవత్సరం మొత్తం వేచి ఉంటారు. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి ఆశ్వయుజ శుద్ధ నవమి వరకు తొమ్మిది రోజులు దేవీ నవరాత్రులు పదవ రోజు విజయ దశమి కలసి దసరా పండగ జరుపుకుంటారు. శక్తి సాధనకు నవరాత్రులు అత్యంత పవిత్రమైనవి.. ఫలవంతమైనవిగా పరిగణిస్తారు. దుర్గా దేవిని ఆరాధించేవారు నవరాత్రి పండుగను సంవత్సరానికి నాలుగు సార్లు జరుపుకుంటారు. చైత్ర నవరాత్రులు, శరన్నవరాత్రులతో పాటు రెండు గుప్త నవరాత్రులు కూడా వస్తాయి. ఈ నాలుగింటిలో శరన్న నవరాత్రులు అత్యంత వైభవంగా జరుపుకుంటారు. ఈ సంవత్సరం నవరాత్రుల పవిత్ర పండుగ 26 సెప్టెంబర్ 2022 నుండి ప్రారంభమై అక్టోబర్ 05 వరకు కొనసాగుతుంది. దుర్గా దేవి ఆరాధనకు సంబంధించిన ప్రధాన తేదీలు, పూజా విధానం.. దాని శుభ సమయం మొదలైన వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.
నవరాత్రుల్లో కలశ స్థాపన శుభ ముహూర్తం: నవరాత్రుల మొదటి రోజున అమ్మవారి ఆరాధన కోసం కలశాన్ని స్థాపిస్తారు. శక్తి ఆరాధనలో భాగంగా ఈ కలశాన్ని తొమ్మిది రోజులు పూజిస్తారు. ఈ ఏడాది శరన్నవరాత్రులు మొదటి రోజు 26 సెప్టెంబర్ 2022 న వస్తుంది. ఆరోజు కలశాన్ని స్థాపిస్తారు. కలశాన్ని స్థాపనకు ఉదయం 06:11 నుండి 07 వరకు శుభ ముహర్తం. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:48 నుండి మధ్యాహ్నం 12:36 వరకు ఉంటుంది.
నవరాత్రి 09 పవిత్ర తేదీలు (09 నవరాత్రి 2022 తేదీ) నవరాత్రి మొదటి రోజు: 26 సెప్టెంబర్ 2022, సోమవారం – ప్రతిపాద ( శైలపుత్రి).. (శ్రీ బాలాత్రిపుర సుందరి) నవరాత్రి రెండవ రోజు: 27 సెప్టెంబర్ 2022, మంగళవారం – ద్వితీయ (బ్రహ్మచారిణి).. (శ్రీ గాయత్రి దేవి అలంకారం) నవరాత్రి మూడవ రోజు: 28 సెప్టెంబర్ 2022, బుధవారం – తృతీయ (చంద్రఘంట)..(శ్రీ మహాలక్ష్మి తేది)




నవరాత్రి నాల్గవ రోజు: 29 సెప్టెంబర్ 2022, గురువారం – చతుర్థి (కూష్మాండ).. (శ్రీ అన్నపూర్ణేశ్వరి దేవి)
నవరాత్రి ఐదవ రోజు: 30 సెప్టెంబర్ 2022, శుక్రవారం – పంచమి (స్కందమాత).. (శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవివేవి) నవరాత్రి ఆరవ రోజు: 01 అక్టోబర్ 2022, శనివారం – షష్ఠి (కాత్యాయని).. ( శ్రీ మహా సరస్వతీ దేవి) నవరాత్రి ఏడవ రోజు: 02 అక్టోబర్ 2022, ఆదివారం – సప్తమి ( కాలరాత్రి).. (శ్రీ దుర్గా దేవి అలంకారం) నవరాత్రి ఎనిమిదవ రోజు: 03 అక్టోబర్ 2022, సోమవారం – అష్టమి (మహాగౌరి)..( శ్రీ మహిషాసుర మర్ధినీ దేవి అలంకారం) నవరాత్రి తొమ్మిదవ రోజు: 04 అక్టోబర్ 2022, మంగళవారం – నవమి (సిద్ధిదాత్రి).. ( శ్రీరాజరాజేశ్వరి దేవి అలంకారం)
దుర్గా నిమజ్జనం రోజు: 05 అక్టోబర్ 2022, బుధవారం – దశమి (దుర్గా విగ్రహం నిమజ్జనం)
నవరాత్రి పూజ విధానం: అమ్మవారిని పూజించడానికి భక్తులు నవరాత్రులలో మొదటి రోజున సూర్యోదయానికి ముందే ఉదయాన్నే లేచి, స్నానం చేసి, ధ్యానం చేసిన తర్వాత, తొమ్మిది రోజుల పాటు నవరాత్రి ఉపవాసం, శుభ సమయంలో ఆచారాల ప్రకారం కలశ స్థాపన చేయండి. దుర్గాదేవికి పండ్లు, పుష్పాలు మొదలైన వాటిని సమర్పించడం, మంత్ర స్తోత్రాలతో దుర్గాదేవిని పూజించడం మొదలైనవి. నవరాత్రుల్లో ప్రతిరోజూ దుర్గా సప్తశతిని ముఖ్యంగా అమ్మవారి పూజలో పారాయణం చేయండి. దీని తరువాత మీ సంప్రదాయం ప్రకారం, అష్టమి లేదా నవమి రోజున, అమ్మవారిని పూజించి.. తొమ్మిది మంది అమ్మాయిలను కూడా ప్రత్యేకంగా పూజించండి. ఆడపిల్లలకు పూరీ, శనగలు, పాయసం మొదలైన వాటిని ఆహారంగా పెట్టండి. మీ శక్తికి తగ్గట్టు దక్షిణ ఇచ్చి వారి ఆశీర్వాదం తీసుకుని, గౌరవంగా పంపించండి. ఆ తర్వాత ఉపవాసం విరమించండి.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..