Navaratri 2021: దేవీ నవరాత్రి ఉత్సవాలు.. గాయత్రీ దేవిగా దర్శమనిస్తున్న విజయవాడ దుర్గమ్మ..
Navaratri 2021: దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మూడవ రోజున విజయవాడ దుర్గమ్మ గాయత్రిదేవి అవతారంలో దర్శనమిచ్చారు. సలక మంత్రాలకు మూలమైన గాయత్రి దేవికి వేదమూర్తులు,

Navaratri 2021: దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మూడవ రోజున విజయవాడ దుర్గమ్మ గాయత్రిదేవి అవతారంలో దర్శనమిచ్చారు. సలక మంత్రాలకు మూలమైన గాయత్రి దేవికి వేదమూర్తులు, అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం 4 గంటల నుంచే అమ్మవారిని భక్తులు దర్శించుకుంటున్నారు. సకల మంత్రాలకు మూలమైన గాయత్రి శక్తిగా దర్శనమిస్తున్నారు అమ్మవారు. వేదమాతగా ప్రసిద్ది పొందిన ముక్తా, విద్రుమ, హేమ నీల, దవళ వర్ణాలతో ప్రకాశించే పంచ ముఖాలతో గాయత్రీదేవి దివ్యమంగళ రూపాన్ని దర్శించుకుంటున్నారు భక్తులు. గాయత్రీదేవి శిరస్సులో బ్రహ్మ, హృదయంలో విష్ణువు, శిఖలో రుద్రుడు నివసిస్తారని పురాణాలు చెబుతున్నాయి. కర్మసాక్షి సూర్యభగవానుడు గాయత్రీ మంత్రానికి అధిష్టాన దేవతగా భాసిల్లుతున్నాడు.
గాయత్రీ మాతను దర్శించుకోవడం వల్ల సకల మంత్ర సిద్ది ఫలాన్ని పొందుతారని భక్తుల విశ్వాసం. అమ్మవారిని దర్శించుకోవడాని భక్తులు పెద్ద ఎత్తున ఇంద్రకీలాద్రికి తరలి వస్తున్నారు. కాగా, కరోనా మహమ్మారి నేపథ్యంలో ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఆన్‌లైన్ ద్వారా టికెట్ పొందిన భక్తులకు మాత్రమే దర్శనం కల్పిస్తున్నారు. క్యూలైన్లో భక్తుల మధ్య దూరం ఉండేలా చర్యలు చేపడుతున్నారు.
Also read:
MAA Elections 2021: పాపం ఆ ఫ్యామిలీని చూస్తుంటే జాలేస్తుంది.. జీవిత రాజశేఖర్ సంచలన వ్యాఖ్యలు..




