AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నవ నారసింహ క్షేత్రాల యాత్ర: ఒకసారి దర్శిస్తే మీ గ్రహ దోషాలు మటాష్!

Nava Narasimha Kshetras: దోషాలను తొలగించుకునేందుకు చాలా మంది అనేక మార్గాలను అన్వేషిస్తుంటారు. అయితే, అన్ని దోషాలను హరించే నవ నరసింహస్వామి దేవాలయాలను దర్శించుకుంటే సరిపోతుందని కొందరు తెలిసిన పండితులు సూచిస్తున్నారు. హిరణ్యకశిపుని సంహరించిన తర్వాత, నారసింహ స్వామి అహోబిల కొండల్లో రౌద్ర స్వరూపంలో దర్శనమిచ్చి, తొమ్మిది భిన్నమైన రూపాల్లో వెలసినట్లు పురాణాలు చెబుతున్నాయి. వీటి ప్రత్యేకత గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

నవ నారసింహ క్షేత్రాల యాత్ర: ఒకసారి దర్శిస్తే మీ గ్రహ దోషాలు మటాష్!
Nava Narasimha Kshetralu
Rajashekher G
|

Updated on: Mar 23, 2026 | 7:26 PM

Share

శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో ఒకటైన నారసింహ స్వరూపం అత్యంత ఉగ్రత కలిగిన రూపం. హిరణ్యకశిపుని సంహరించిన తర్వాత, నారసింహ స్వామి రౌద్ర స్వరూపంతో అహోబిల కొండల్లో దర్శనమిచ్చి, తొమ్మిది భిన్న రకాల రూపాల్లో వెలసినట్లు పూర్వపు పురాణాలు చెబుతున్నాయి. ఈ తొమ్మిది ప్రదేశాలను నవ నారసింహ క్షేత్రాలు అని పిలుస్తారు. వీటిని దర్శనమిస్తే నవగ్రహ దోషాలు తొలగిపోతాయని విశ్వాసం ఉంది. ఈ క్షేత్రాలు, వాటి గ్రహ దోష నివారణ లక్ష్యం ఈ విధంగా ఉంది. పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

1. జ్వాల నరసింహ స్వామి

స్థానం: యాదగిరిగుట్ట, హైదరాబాద్ నుంచి 65 కి.మీ. ప్రత్యేకత: స్వామి గండభేరుండ, జ్వాల, యోగానంద రూపాల్లో దర్శనమిస్తారు. గ్రహ దోష నివారణ: కుజగ్రహ దోషాలు తొలగుతాయి.

2. అహోబిల నరసింహ స్వామి

ప్రత్యేకత: హిరణ్యకశిపుని చీల్చిన ఉగ్ర నారసింహ రూపం. గ్రహ దోష నివారణ: గురు గ్రహ దోషాలు తొలగుతాయి.

3. మాలోల నరసింహ స్వామి

స్థానం: వేదాద్రి పర్వతం, ఎగువ అహోబిలకు 1 కి.మీ దూరం. ప్రత్యేకత: లక్ష్మీదేవి కూర్చున్న భంగిమలో స్వామి దర్శనమిస్తారు. గ్రహ దోష నివారణ: శుక్రగ్రహ దోషాలు తొలగుతాయి.

4. వరాహ నరసింహ స్వామి

ప్రత్యేకత: వేదాలను, భూదేవిని రక్షించిన అవతారం. గ్రహ దోష నివారణ: రాహుగ్రహ దోషాలు తొలగుతాయి.

5. కారంజ నరసింహ స్వామి

ప్రత్యేకత: కారంజ వృక్షం క్రింద పద్మాసనంలో ధ్యానమగ్నుడైన స్వామి. గ్రహ దోష నివారణ: చంద్రగ్రహ దోషాలు తొలగుతాయి.

6. భార్గవ నరసింహ స్వామి

స్థానం: దిగువ అహోబిల, 2 కి.మీ. ఉత్తర దిశలో. ప్రత్యేకత: పరశురాముడుకు దర్శనమిచ్చిన స్వరూపం. గ్రహ దోష నివారణ: సూర్యగ్రహ దోషాలు తొలగుతాయి.

7. యోగానంద నరసింహ స్వామి

ప్రత్యేకత: యోగంలో ఆనందాన్ని ప్రసాదించే స్వామి. గ్రహ దోష నివారణ: శనిగ్రహ దోషాలు తొలగుతాయి.

8. చత్రవట నారసింహ స్వామి

ప్రత్యేకత: పద్మాసనంలో అభయహస్తాలతో, నల్ల రంగులో స్వరూపం. గ్రహ దోష నివారణ: కేతుగ్రహ దోషాలు తొలగుతాయి.

9. పావన నరసింహ స్వామి

స్థానం: ఎగువ అహోబిలకు 6 కి.మీ. దక్షిణ దిశలో. ప్రత్యేకత: ఏడు పడగల ఆదిశేషుని క్రింద వెలసిన స్వామి, పాపములను తొలగించే శక్తి కలవాడు. గ్రహ దోష నివారణ: బుధగ్రహ దోషాలు తొలగుతాయి.

ఈ నవ నారసింహ క్షేత్రాలును దర్శనం చేసుకోవడం ద్వారా, పూర్వజన్మల దోషాలు, నష్టాలు తొలగి, శాంతి, సంపద, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందవచ్చని విశ్వసించవచ్చు.

(Disclaimer: ఈ వార్తలోని సమాచారం మత సంబంధమైన అంశాలపై ఆధారపడి ఉన్నాయి. పాఠకుల ఆసక్తి మేరకు అందించడం జరిగింది. దీనిని సంస్థ ధృవీకరించదు.)

Follow Us
రూ. 10 లక్షలు పెట్టి సాంగ్ తీసి యూట్యూబ్‌లో పెడితే..
రూ. 10 లక్షలు పెట్టి సాంగ్ తీసి యూట్యూబ్‌లో పెడితే..
నవ నారసింహ క్షేత్రాల యాత్ర: ఒకసారి దర్శిస్తే మీ గ్రహ దోషాలు మటాష్
నవ నారసింహ క్షేత్రాల యాత్ర: ఒకసారి దర్శిస్తే మీ గ్రహ దోషాలు మటాష్
విజయ్-రష్మికల వెడ్డింగ్‌పై గబ్బర్ సింగ్ బ్యాచ్ వీడియో వైరల్
విజయ్-రష్మికల వెడ్డింగ్‌పై గబ్బర్ సింగ్ బ్యాచ్ వీడియో వైరల్
ఒక్క వ్యక్తి ఇంట్లో ఎంత పెట్రోల్ ఉంచుకోవచ్చు.. ఈ రూల్స్ పక్కా..
ఒక్క వ్యక్తి ఇంట్లో ఎంత పెట్రోల్ ఉంచుకోవచ్చు.. ఈ రూల్స్ పక్కా..
పాక్ సూపర్ లీగ్‌కు ఉగ్ర ముప్పు..జారుకుంటున్న విదేశీ ప్లేయర్లు
పాక్ సూపర్ లీగ్‌కు ఉగ్ర ముప్పు..జారుకుంటున్న విదేశీ ప్లేయర్లు
కొండచిలువ రక్తంతో మనుషుల బరువు తగ్గి, గుండె పదిలంగా ఉంటుందట..!
కొండచిలువ రక్తంతో మనుషుల బరువు తగ్గి, గుండె పదిలంగా ఉంటుందట..!
పీఎఫ్ ఖాతాదారుల అకౌంట్లోకి డబ్బులు.. కేంద్రం అప్డేట్
పీఎఫ్ ఖాతాదారుల అకౌంట్లోకి డబ్బులు.. కేంద్రం అప్డేట్
బిగ్ బాస్ హౌస్ గురించి షాకింగ్ విషయాలు బయటపెట్టిన యాంకర్ రవి
బిగ్ బాస్ హౌస్ గురించి షాకింగ్ విషయాలు బయటపెట్టిన యాంకర్ రవి
ప్రధాన గ్రహాల అనుకూలత..ఇక ఆ రాశులకు గోల్డెన్ టైమ్ మొదలైనట్టే..!
ప్రధాన గ్రహాల అనుకూలత..ఇక ఆ రాశులకు గోల్డెన్ టైమ్ మొదలైనట్టే..!
సబ్బు ముక్కలను చెత్తలో వేస్తున్నారా?.. వీటి బెనిఫిట్స్ తెలుసా?
సబ్బు ముక్కలను చెత్తలో వేస్తున్నారా?.. వీటి బెనిఫిట్స్ తెలుసా?