Nag Panchami 2023: రేపే నాగ పంచమి.. మొదటిసారిగా పూజ చేస్తున్నారా.. పూజా విధానం మీకోసం

నాగ పంచమి రోజున ఉదయాన్నే స్నానం చేసి, ధ్యానం చేసి, శుభ్రమైన బట్టలు ధరించి, దర్శనం, పూజ కోసం నాగదేవత ఆలయానికి వెళ్లాలి. ఏదైనా కారణం చేత మీరు ఆలయానికి వెళ్లలేకపోతే.. గోడపై పిండి లేదా నల్ల స్కెచ్‌తో నాగదేవత చిత్రాన్ని తయారు చేసి మీ ఇంటి ప్రధాన ద్వారం వద్ద పూజించవచ్చు. పాముని పూజించే ముందు పూజా సామాగ్రితో పాటు ఒక రాగి పాత్రలో నీరు,  పాలు ఉంచండి.

Nag Panchami 2023: రేపే నాగ పంచమి.. మొదటిసారిగా పూజ చేస్తున్నారా.. పూజా విధానం మీకోసం
Nag Panchami 2023
Follow us
Surya Kala

|

Updated on: Aug 20, 2023 | 9:54 AM

హిందూమతంలో నాగుపాముకి విశిష్ట స్థానం ఉంది. దైవంగా భావించి పూజిస్తారు.  శివుని మెడలోని ఆభరణం, విష్ణువు శేషతల్పమైన నాగపాముని భక్తితో పూజిస్తారు. ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో శుక్ల పక్ష పంచమిని నాగ పంచమి లేదా నాగులు పంచమిగా హిందువులు జరుపుకుంటారు. నాగదేవతను ఆరాధిస్తూ ప్రత్యేక పూజలను నిర్వహిస్తారు. పంచాంగం ప్రకారం ఈ సంవత్సరం నాగ పంచమి పండుగ ఆగస్టు 21, 2023 సోమవారం జరుపుకుంటారు. పౌరాణిక నమ్మకం ప్రకారం నాగ పంచమి రోజున నాగదేవతను ఆరాధించడం ద్వారా ఆనందం, అదృష్టాన్ని పొందుతాడు. అంతేకాదు ఏడాది పొడవునా పాములకు సంబంధించిన అన్ని రకాల భయాల నుండి విముక్తి పొందుతాడని విశ్వాసం. ఈ నేపథ్యంలో నాగపంచమి విశిష్టత..  పూజ పద్దతిని    తెలుసుకుందాం.

నాగ దేవతను ఎలా పూజించాలంటే

నాగ పంచమి రోజున ఉదయాన్నే స్నానం చేసి, ధ్యానం చేసి, శుభ్రమైన బట్టలు ధరించి, దర్శనం, పూజ కోసం నాగదేవత ఆలయానికి వెళ్లాలి. ఏదైనా కారణం చేత మీరు ఆలయానికి వెళ్లలేకపోతే.. గోడపై పిండి లేదా నల్ల స్కెచ్‌తో నాగదేవత చిత్రాన్ని తయారు చేసి మీ ఇంటి ప్రధాన ద్వారం వద్ద పూజించవచ్చు. పాముని పూజించే ముందు పూజా సామాగ్రితో పాటు ఒక రాగి పాత్రలో నీరు,  పాలు ఉంచండి. దీని తరువాత మీ చేతిలో కొద్దిగా అక్షతలు నీటిని తీసుకొని నాగదేవతను ధ్యానం చేసి, నియమ నిబంధనల ప్రకారం ఉపవాసం, పూజలు చేస్తానని ప్రతిజ్ఞ చేయండి.

దీని తరువాత సర్ప దేవతను మొదట నీటితో, తరువాత పాలతో, మరోసారి నీటితో స్నానం చేయండి. దీని తరువాత, నాగ దేవతకు కుంకుమ, గంధం, అక్షతం, పువ్వులు మొదలైన వాటిని సమర్పించేటప్పుడు నాగ దేవతా మంత్రాన్ని జపించండి లేదా నాగ స్తోత్రాన్ని పఠించండి.

ఇవి కూడా చదవండి

నాగ పంచమి రోజున వీలైతే, శివునికి జంట వెండి సర్పాలను సమర్పించండి. వాటిని ప్రవహించే నీటిలో సమర్పించండి. ఈ పరిహారం చేయడం వలన జాతకంలో ఉన్న సకల దోషాలు తొలగిపోతాయని నమ్ముతారు.

నాగదేవత ఆరాధనకు మతపరమైన ప్రాముఖ్యత

హిందూ మతంలో నాగదేవత పూజకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఆదిశేషుడు సర్ప రూపంలో మొత్తం భూమిని తన తలపై ఉంచుకుని ఎల్లవేళలా కాచి కాపాడతాడని విశ్వాసం. మరోవైపు శివుని మెడలో హారంగా.. హాలాహలాన్ని తన కంఠంలో దాచుకున్నాడు. మొత్తం మీద ఆదిశేషుడు భూమిని మాత్రమే కాదు..  దానిపై నివసించే ప్రజలను కూడా రక్షిస్తాడు. ఆనందం, శ్రేయస్సు, అదృష్టాన్ని ప్రసాదిస్తాడు. అందుకే నాగపంచమి పర్వదినాన నాగదేవత అనుగ్రహం పొందేందుకు నియమ నిబంధనల ప్రకారం పూజలు చేస్తారు. హిందూ విశ్వాసం ప్రకారం నాగ దేవతను పూజించిన తర్వాత ఇంట్లో సుఖ శాంతులనుఇస్తాయని విశ్వాసం.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)

ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో
స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో
ప్లానింగ్‌తో పిచ్చెక్కిస్తున్న డాకూ మహరాజ్
ప్లానింగ్‌తో పిచ్చెక్కిస్తున్న డాకూ మహరాజ్