Holy River Ganga: గంగా నది ఎందుకు అంత పవిత్రమైనది.. దీనికి వెనుక ఉన్న పరమ రహస్యం ఏంటో తెలుసా..?

గంగా నది ప్రజల జీవితాల్లో పరిశుభ్రతను తీసుకువస్తుందని చెబుతారు. ఇది పరమ పవిత్రమైన నది అని కూడా అంటారు. గంగానది పవిత్ర నది అని, గంగా జలాన్ని తాగితే పాపాలు తీరిపోతాయని చెబుతారు. గంగా జలం ముఖ్యమైన లక్షణం ఏమిటంటే అది ఎంత కాలం నిల్వ ఉంచినా చెడిపోదు. పాపాలను పోగొట్టి మోక్షాన్ని ఇస్తుంది. అయితే దీని వెనుక శాస్త్రీయ కారణం కూడా ఉందంటున్నారు. పరిశోధకులు..

Holy River Ganga: గంగా నది ఎందుకు అంత పవిత్రమైనది.. దీనికి వెనుక ఉన్న పరమ రహస్యం ఏంటో తెలుసా..?
River Ganga
Follow us
Jyothi Gadda

|

Updated on: Aug 20, 2023 | 9:30 PM

నీరు ఒకే చోట ఎక్కువసేపు ఉంటే అందులో పురుగులు పెరుగుతాయి. అయితే మీకు ఒక ఆసక్తికరమైన విషయం తెలుసా? గంగానదిలో క్రిమి, కీటకాలు ఎప్పుడూ పెరగవు. గంగా నది భారతదేశంలో చాలా పవిత్రమైనది. గంగానదిలో నీరు ఎంతకాలం నిల్వ ఉంచినా అందులో క్రిమికీటకాలు పెరగవని మీకు తెలుసా? అవును, దీని వెనుక ఉన్న ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయంటున్నారు శాస్త్రవేత్తలు. చరిత్రకారుల ప్రకారం.. అక్బర్ స్వయంగా గంగాజలం తాగేవాడని చెబుతారు. ఇది మాత్రమే కాదు అతను తన ఆస్థానానికి వచ్చిన అతిథులకు కూడా గంగా నది నుండి నీటినే తెప్పించి తాగడానికి ఇచ్చేవాడని చెబుతారు.

భారతదేశంలో పవిత్ర నది గంగానది. గంగోత్రి హిమానీనదం లోతు నుండి ఉద్భవించింది. దీనిని గంగ అని పిలుస్తారు. గంగా నది ప్రజల జీవితాల్లో పరిశుభ్రతను తీసుకువస్తుందని చెబుతారు. ఇది పరమ పవిత్రమైన నది అని కూడా అంటారు. గంగానది పవిత్ర నది అని, గంగా జలాన్ని తాగితే పాపాలు తీరిపోతాయని చెబుతారు. గంగా జలం ముఖ్యమైన లక్షణం ఏమిటంటే అది ఎంత కాలం నిల్వ ఉంచినా చెడిపోదు. పాపాలను పోగొట్టి మోక్షాన్ని ఇస్తుంది. అయితే దీని వెనుక శాస్త్రీయ కారణం కూడా ఉందంటున్నారు. పరిశోధకులు..

గంగా నది గోముఖ ఖండ నుండి ప్రారంభమై మైదానాలకు చేరుకుంటుంది. వివిధ రకాల వృక్షాలు అంటే మూలికలపై ప్రవహించడం ద్వారా ఇది తన మార్గాన్ని చేరుకుంటుంది. గంగా నీటిలో వైద్యం చేసే గుణాలు ఉన్నాయి. ఇందులోని జీవులు నదీజలాలు మురికిగా మారకుండా నిరోధించి, కాలుష్యాన్ని తొలగిస్తాయి. కాబట్టి ఈ నీటిలో క్రిములు పుట్టవు.

ఇవి కూడా చదవండి

మత గ్రంధాల ప్రకారం, గంగా నది నీటిలో స్నానం చేయడం వల్ల అన్ని రకాల పాపాలు తొలగిపోతాయని చెబుతారు. అందుకే చాలా మంది చనిపోయిన తర్వాత తమ చితాభస్మాన్ని గంగలో వదిలేస్తారు. నీటిలో వైరస్ గంగా నదిలోని వైరస్ నీటి నుండి మలినాలను తొలగిస్తుంది. తద్వారా దాని పరిశుభ్రత ఎల్లప్పుడూ నిర్వహించబడుతుంది. దాంతో గంగలో నీరు ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంటుంది.

గతంలో హైడ్రాలజిస్టులు చేసిన పరిశోధనల్లో గంగాజలంలో రసాయన చర్యల వల్ల ఉత్పత్తయ్యే అవాంఛనీయ పదార్థాలను తినేసే బట్రియాఫాస్ అనే బ్యాక్టీరియా గంగాజలంలో ఉన్నట్లు గుర్తించారు. ఇది గంగాజలం స్వచ్ఛతను కాపాడుతుంది. శాస్త్రవేత్తల ప్రకారం, గంగాజలంలో సల్ఫర్ అధికంగా ఉండటం వల్ల దాని స్వచ్ఛత అలాగే ఉంటుంది. అలాగే ఎక్కువ కాలం చెడిపోకుండా నిల్వవుంటుంది. దేశంలోని ఇతర నదులు పదిహేను నుండి ఇరవై కి.మీ ప్రవహించిన తర్వాత తమను తాము శుభ్రం చేసుకోగలవని శాస్త్రీయ పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. నదులలో కనిపించే మురికి నదుల అడుగున, పాతాళంలో పేరుకుపోతుంది. కానీ గంగానది కేవలం ఒక కిలోమీటర్లు ప్రవాహంలోనే శుభ్రపరుస్తుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..