Saffron Benefits: ఖాళీ కడుపుతో కుంకుమ పువ్వు నీరు తాగండి.. ఉపయోగం తెలిస్తే అస్సలు వదలరు..!

కుంకుమపువ్వు నీటిని తయారు చేయడానికి 1 కప్పు నీటిలో కుంకుమపువ్వు వేసి, దాల్చినచెక్క, ఏలకులు వేసి ఐదు నిమిషాలు నీటిని మరిగించాలి. ఆ తర్వాత కాసేపు చల్లార్చాలి. దీన్ని తేనెతో కలిపి చల్లారిన తర్వాత తాగాలి. నీళ్లు చాలా వేడిగా ఉన్నప్పుడు తేనెను కలపకూడదు. వేడి నీటిలో తేనె కలపడం వల్ల దాని పోషకాలను నాశనం చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

Saffron Benefits: ఖాళీ కడుపుతో కుంకుమ పువ్వు నీరు తాగండి.. ఉపయోగం తెలిస్తే అస్సలు వదలరు..!
Saffron
Follow us
Jyothi Gadda

|

Updated on: Aug 20, 2023 | 7:00 PM

సాధారణంగా అందరూ టీ, కాఫీతో తమ రోజును ప్రారంభిస్తారు. అయితే ఉదయాన్నే ఖాళీ కడుపుతో కుంకుమపువ్వు నీరు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసా? ఈ డ్రింక్‌తో ఉదయం ప్రారంభించడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. పురాతన కాలం నుండి ఆయుర్వేదంలో కుంకుమపువ్వును ఉపయోగిస్తున్నారు. ఇందులో ఫైబర్, కాల్షియం పుష్కలంగా ఉంటాయి. ఇది మీ చర్మం, మొత్తం శరీర ఆరోగ్యానికి సమానంగా ప్రయోజనకరంగా ఉంటుందని రుజువు చేస్తుంది. రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో కుంకుమపువ్వు నీరు తాగడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు నయం అవుతాయి. కుంకుమ పువ్వు నీళ్లు తాగడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇక్కడ తెలుసుకుందాం..

కుంకుమపువ్వులో కొన్ని ప్రత్యేక యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. కుంకుమ పువ్వు ఉపయోగించడం వల్ల ముఖంపై మొటిమలు తొలగిపోతాయి. రోజూ కుంకుమపువ్వును ముఖానికి రాసుకుంటే ముఖంపై మచ్చలు తొలగిపోతాయి. కుంకుమ పువ్వు వాడకంతో ముఖం ఛాయ మెరుగుపడుతుంది. ఇది జిడ్డు, పొడి బారిన చర్మానికి కుంకుమ పువ్వు దివ్యౌషధంగా పనిచేస్తుంది.

* కుంకుమపువ్వు నీటి ప్రయోజనాలు..

1. ఇది మీ రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది.

ఇవి కూడా చదవండి

2. రోజంతా మీ శరీరాన్ని శక్తివంతంగా ఉంచడంలో సహాయపడుతుంది.

3. దీని ఉపయోగం జుట్టు రాలడం సమస్యకు కూడా సహాయపడుతుంది.

4. మీ చర్మాన్ని మెరిసేలా చేస్తుంది.

5. గుండె ఆరోగ్యానికి కూడా మంచిది.

06. బహిష్టు నొప్పి నుండి ఉపశమనాన్ని కలిగిస్తుంది.

* కుంకుమపువ్వు నీటిని ఎలా తయారు చేయాలి..?

కుంకుమపువ్వు నీటిని తయారు చేయడానికి 1 కప్పు నీటిలో కుంకుమపువ్వు వేసి, దాల్చినచెక్క, ఏలకులు వేసి ఐదు నిమిషాలు నీటిని మరిగించాలి. ఆ తర్వాత కాసేపు చల్లార్చాలి. దీన్ని తేనెతో కలిపి చల్లారిన తర్వాత తాగాలి. నీళ్లు చాలా వేడిగా ఉన్నప్పుడు తేనెను కలపకూడదు. వేడి నీటిలో తేనె కలపడం వల్ల దాని పోషకాలను నాశనం చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

ఉదయం పూట కుంకుమపువ్వు నీరు త్రాగడం వల్ల మీ చర్మం పునరుజ్జీవింపబడుతుంది. మీ స్కిన్‌ టోన్ అవుతుంది. దీన్ని రోజూ తాగితే చర్మం మృదువుగా, కాంతివంతంగా ఉంటుంది. కుంకుమపువ్వు నీరు చర్మాన్ని సహజంగా కాంతివంతంగా, మృదువుగా చేయడానికి కూడా సహాయపడుతుంది. మొటిమలు, మచ్చలను తగ్గించడానికి సహజ నివారణగా పనిచేస్తుంది. ప్రతి రోజూ ఉదయాన్నే ఒకటి లేదా రెండు కప్పులు కుంకుమ పువ్వు నీళ్లు తాగడం ఆరోగ్యకరం. ఉదయాన్నే కుంకుమపువ్వు నీటిని తీసుకోవడం వల్ల ఎనర్జీ బూస్టర్‌గా పనిచేస్తుంది. రోజంతా చురుకుగా ఉండేలా చేస్తుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..