Viral Video: నీ ధైర్యానికి హ్యాట్సాఫ్ అక్క..!! అంతపెద్ద పాముకు ఎలా ముద్దుపెట్టేసిందో చూడండి.. ఆ తరువాత జరిగిందో మీరే చూడండి!
ఈ యువతి వేదికపై నిర్భయంగా పాము తలకి ముద్దు ఇస్తున్న వీడియో చూస్తే ఒక్క క్షణం గుండె ఆగిపోయినంత పనైంది. ఆమె ఎదురుగా ఉన్న మరో మహిళ పాము తోకను గట్టిగా పట్టుకుని ఉంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాకింగ్ రియాక్షన్స్ ఇస్తున్నారు. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఎంత కాలం జీవించామన్నది కాదు, ఎలా జీవించామన్నదే ముఖ్యం అనే క్యాప్షన్‌తో వీడియో షేర్ చేశారు.
పాములు, జంతువులను ఇష్టపడే వాళ్లు చాలా మందే ఉంటారు. అలాంటి జంతు ప్రేమికులకు మూగజీవాలంటే..ఎనలేని అభిమానం, ప్రేమ చూపుతుంటారు. కుక్కలు, పిల్లలు వంటివాటిని చాలా మంది తమ ఇళ్లల్లో పెంచుకుంటారు. వాటిని తమ కుటుంబ సభ్యులతో సమానంగా చూసుకుంటారు. వాటికి ఆహారం తినిపించటం, ఎత్తుకుని ముద్దు చేయటం చేస్తుంటారు. అలాగే కొందరు పాములను కూడా పెంచుకుంటారు. కానీ, జంతువులు, పాములు స్వీయ విచక్షణ లేకుండా ప్రవర్తిస్తుంటాయి. అవి ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతాయో ఎవరూ చెప్పలేరు. కానీ, అలాంటి పాములతో కొందరు పరాచకాలు ఆడుతుంటారు. విషపూరిత పాములు, కింగ్ కోబ్రా లాంటి వాటితో కొందరు పిచ్చి పనులు చేస్తుంటారు. కొందరు విషపూరిత పాములను ముద్దుపెట్టుకునే ప్రయత్నం చేస్తుంటారు. అలాంటి వారిలో కొందరు ప్రాణాలు పొగొట్టుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ యువతి పామును ముద్దుపెట్టుకోవడానికి ప్రయత్నించింది. సాధారణంగా ఎవరైనా పామును చూస్తే హడలిపోతారు. ఆ పాముకు దూరంగా పరిగెడతారు.. కానీ ఈ వీడియోలో ఉన్న యువతి మాత్రం అలా కాదు. అదేదో పామును ముద్దుపెట్టుకుంటానంటూ పందెం వేసుకున్నట్టుగా చుట్టూ జనాలు చూస్తుంటే…పామును ముద్దును పెట్టుకునే ప్రయత్నం చేసింది. అక్కడ ఏదో మ్యూజిక్ టీం ఉన్నట్టుగా వీడియో చూస్తే అర్థం అవుతుంది. అక్కడే ఓ యువతి భారీ సైజున్న ఓ పాము తోక పట్టుకుని ఉంది. దానికి ఎదురుగా మరో యువతి చేతిలో నల్లటి రుమాలు పట్టుకుని పాము ముందు కూర్చుని ఉంది. ఆమె తన చేతి రుమాలుతో పామును రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంది. మెల్లి మెల్లిగా పాముకు దగ్గరగా వెళ్లి దాని పడగపై ముద్దు పెట్టింది.
View this post on Instagram
హిజాబ్ ధరించిన యువతి కోపంతో ఉన్న నాగుపాము తలను ముద్దుపెట్టుకున్న ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ యువతి వేదికపై నిర్భయంగా పాము తలకి ముద్దు ఇస్తున్న వీడియో చూస్తే ఒక్క క్షణం గుండె ఆగిపోయినంత పనైంది. ఆమె ఎదురుగా ఉన్న మరో మహిళ పాము తోకను గట్టిగా పట్టుకుని ఉంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాకింగ్ రియాక్షన్స్ ఇస్తున్నారు. ఈ వీడియోను @Bellashariman ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఎంత కాలం జీవించామన్నది కాదు, ఎలా జీవించామన్నదే ముఖ్యం అనే క్యాప్షన్‌తో వీడియో షేర్ చేశారు.
ఇప్పటివరకు ఈ వీడియోను లక్షల మంది వీక్షించారు. ఈ యువతి సాహసాన్ని పలువురు ప్రశంసిస్తున్నారు. భద్రతపై కూడా శ్రద్ధ వహించాలని సూచించారు. ఇలాంటి అడవి జంతువులతో ఎందుకు ఇలాంటి షోలు చేస్తున్నారంటూ మరొకరు ప్రశ్నించారు. ఇంత ఘోరమైన సాహసానికి ఎందుకు దిగుతున్నారని మరొకరు ప్రశ్నించగా, ధైర్యవంతురాలు అంటూ మరికొందరు ఆమెను ప్రశంసిస్తున్నారు. తమ నిర్భయతను ప్రదర్శించేందుకు వన్యప్రాణులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని మరొకరు అన్నారు. మొత్తంమీద ఈ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.
మరిన్ని వైరల్ వార్తల కోసం క్లిక్ చేయండి