Face Pack: గంధంతో ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే ముఖం మెరిసిపోవాల్సిందే..! మొటిమలు, మచ్చలు, గుంటలు మాయం!!

గంధాన్ని ఆయుర్వేదంలో విరివిగా ఉపయోగిస్తారు. ముఖంపై మొటిమలను నివారించి, ముఖం మెరిసిపోయేలా చేయడానికి చందనం ఉపయోగపడుతుంది. అదనంగా, చర్మ సమస్యలను నయం చేయడంలో కూడా చందనం అద్భుతమైనదని వైద్య నిపుణులు చెబుతున్నారు. చందనం అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది. గంధాన్ని పొడి, పేస్ట్, నూనె రూపంలో ఉపయోగించవచ్చు. ఈ సహజ పదార్ధం చర్మాన్ని ఆరోగ్యవంతంగా, మెరిసేలా చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.

Jyothi Gadda

|

Updated on: Aug 20, 2023 | 2:54 PM

ఆయుర్వేదంలో చందనాన్ని విరివిగా ఉపయోగిస్తారు.  ముఖంపై మొటిమలను నివారించి, ముఖం మెరిసిపోయేలా చేయడానికి చందనం ఉపయోగపడుతుంది.  అంతేకాకుండా చర్మ సమస్యలను నయం చేయడంలో కూడా చందనం పేస్ట్ అద్భుతంగా పనిచేస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. చందనం అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది. గంధాన్ని పొడి, పేస్ట్ లేదా నూనె రూపంలో ఉపయోగించవచ్చు. ఈ సహజ పదార్ధం చర్మాన్ని ఆరోగ్యవంతంగా, మెరిసేలా చేస్తుందని నిపుణులు అంటున్నారు. చందనం వల్ల చాలా ఉపయోగాలున్నాయి. శాండల్‌వుడ్‌తో కలిగే లాభాలు, ఎలాంటి చర్మ సమస్యలను నయం చేసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

1 / 6
చందనం పేస్ట్ అప్లై చేయడం వల్ల మొటిమలు తొలగిపోతాయి. చందనం చర్మ సమస్యలను దూరం చేస్తుంది. చర్మాన్ని అలర్జీల నుంచి రక్షిస్తుంది. ఒక చెంచా చందనం నూనె, చిటికెడు పసుపు, కర్పూరం కలిపి ఫేస్ ప్యాక్ లా వేసుకోవాలి.  రాత్రంతా అలాగే ఉంచి ఉదయాన్నే గోరువెచ్చని నీటితో కడిగేస్తే మొటిమలు, నల్ల మచ్చలు తొలగిపోతాయి.

2 / 6
చర్మాన్ని మెరిసేలా చేస్తుంది: గంధంలోని తేలికపాటి ఎక్స్‌ఫోలియేటింగ్ గుణాల వల్ల.. చర్మాన్ని మెరిసేలా చేస్తుంది.  ఇది మీ చర్మంపై డార్క్ స్పాట్‌లను పోగొట్టడంలో సహాయపడుతుంది. ఇది టాన్ తొలగించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఒక గిన్నెలో ఒక టేబుల్ స్పూన్ చందనం పొడి, కొబ్బరి నూనె కలపండి. దీన్ని మీ ముఖానికి పట్టించి, మసాజ్ చేసి రాత్రంతా అలాగే ఉంచండి. డార్క్ స్పాట్స్ పోగొట్టుకోవడానికి రెగ్యులర్ గా ఉపయోగిస్తే నార్మల్ టాన్ వచ్చి, మచ్చలు మాయమై.. ముఖం మెరిసిపోతుంది.

3 / 6
ఏజ్ బ్రేక్!: చందనంలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టంతో పోరాడుతాయి. ఇది చర్మం ముడతలు, వృద్ధాప్యాన్ని నివారిస్తుంది. ఇది చర్మాన్ని కాంతివంతంగా, యవ్వనంగా మార్చుతుంది. దీని కోసం 2 చెంచాల ముల్తానీ మట్టి, 2 చెంచాల గంధాన్ని కలిపి పేస్ట్ తయారు చేయండి. ఈ పేస్ట్‌ని ముఖానికి ప్యాక్‌లా అప్లై చేసుకోవాలి.15-20 నిమిషాలు అలాగే ఉంచి బాగా ఆరిపోయిన తర్వాత నీటితో శుభ్రం చేసుకోండి.

4 / 6
డ్రై స్కిన్ రెమెడీ: చాలా మంది డ్రై, డల్ స్కిన్‌తో బాధపడుతుంటారు. అలాంటి వారు చందనం ఫేస్ ప్యాక్ వేసుకోవడం ద్వారా పొడి, నిర్జీవ చర్మానికి చెక్ పెట్టవచ్చు.  ఒక గిన్నెలో ఒక చెంచా పాలపొడి, కొన్ని చుక్కల గంధం నూనె, రోజ్ వాటర్ మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయాలి. 15 నిమిషాలు అలాగే ఉంచి నీటితో కడిగేస్తే చర్మం తేమగా ఉంటుంది.

5 / 6
జిడ్డు చర్మం: జిడ్డు చర్మం వారి ముఖంపై మురికి, ధూళి పేరుకుపోతుంది. అలాంటి వారికి చందనం దివ్య ఔషధంలా పనిచేస్తుంది. ఒక గిన్నెలో అర చెంచా గంధపు పొడి, కొద్దిగా టామాటా రసం, అర చెంచా ముల్తానీ మట్టి వేసి బాగా కలపాలి. ఈ పేస్ట్‌ని ముఖానికి పట్టించి 15 నిమిషాల తర్వాత కడిగేయాలి. ఇలా చేయడం వల్ల చర్మం మెరుస్తుంది.

6 / 6
Follow us
కొబ్బరి చెట్టు మొదలులో శివలింగం ప్రత్యక్షం !!

క్షుద్ర పూజలు ఎంత భయంకరంగా ఉంటాయో తెలుసా ??

మహిళలకు గుడ్ న్యూస్.. త్వరలోనే ఉచిత బస్సు ప్రయాణం

మమ్మల్నే ఈ ప్రభుత్వం తట్టుకోలేకపోతోంది.. కేటీఆర్‌ సంచలన వ్యాఖ్యలు

హైదరాబాద్‌లో కారు బీభత్సం.. డ్రైవర్ని చితకబాదిన స్థానికులు.

దైవ దర్శనానికి వెళ్లి ప్రదక్షిణలు చేస్తున్న యువకుడు. అంతలోనే షాక్

కూలిన మర్రి చెట్టు కింద శివలింగం ప్రత్యక్షం.. పోటెత్తిన జనం.!

గోండ్ కటిరా, పెరుగు కలిపి తింటే ఏమవుతుందో తెలుసా.?

అమెరికా వెళ్లాలనుకునేవారికి షాకింగ్‌ న్యూస్‌.! ఇండియన్స్ కి మరింత

బ్రష్ పై టూత్ పేస్ట్ ను ఎక్కువుగా పెడుతున్నారా.? అయితే ఇది మీకోసం