Telangana: మాతా శిశు మరణాలు తగ్గించడంలో తెలంగాణ ఫస్ట్ అన్న మంత్రి హరీష్ రావు.. గాంధీ ఆస్పత్రిలో రూ.52 కోట్లతో..

ప్రసవం సమయంలో, ఆ తర్వాత.. మహిళలు ఎదుర్కొనే వివిధ రకాల ఆరోగ్య సమస్యలతో పాటు.. అప్పుడే పుట్టిన శిశువు ఆరోగ్య సంరక్షణకు సంబంధించిన సేవలు ఈ ఎంసీహెచ్‌ సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్స్‌లో అందుతాయని మంత్రి హరీష్‌ రావు వెల్లడించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో డెలవరీల సంఖ్య 72 శాతానికి పెంచుకున్నామని చెప్పారు. ఇవన్నింటికి సీఎం కేసీఆర్  తీసుకున్న నిర్ణయాలే కారణం అన్నారు మంత్రి హరీష్ రావు.

Telangana: మాతా శిశు మరణాలు తగ్గించడంలో తెలంగాణ ఫస్ట్ అన్న మంత్రి హరీష్ రావు.. గాంధీ ఆస్పత్రిలో రూ.52 కోట్లతో..
Gandhi Hospital
Follow us

|

Updated on: Aug 20, 2023 | 5:56 PM

Harish Rao : మాతా శిశు మరణాలను చాలా వరకు తగ్గించామన్నారు మంత్రి హరీష్ రావు. తల్లి మరణాలను లక్ష కు 93 ఉంటే … ఇప్పుడు 42 తగ్గించామని తెలిపారు. ఆగస్టు 20 ఆదివారం రోజున హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలో ఎంసీహెచ్ బ్లాక్ ను మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి హరీష్ రావు మాట్లాడారు. గాంధీ ఆస్పత్రి లో 52 కోట్ల రూపాయలతో నిర్మించిన సూపర్ స్పెషాలిటీ మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్,నియో నాటల్, డైట్ కిచెన్ కోసం 33 అంబులెన్స్ లు అందుబాటులోకి తీసుకువచ్చినట్టుగా చెప్పారు. చిన్నారుల మరణాలను కూడా అరికట్టగలిగామని చెప్పారు.

రాష్ట్రంలో 3 mch ఆస్పత్రులు నిర్మించాలని అనుకున్నామని వెల్లడించారు. ఒకటి గాంధీ ఆసుపత్రిలో నిర్మాణం పూర్తయిందని చెప్పారు. నిమ్స్ హాస్పిటల్ లో అనుకున్న 3 mch నిర్మాణ పనులు జరుగుతున్నట్టుగా చెప్పారు. అల్వాల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం లో భాగంగా ఎంసిఎచ్ ఆస్పత్రి నిర్మాణంలో ఉందని చెప్పారు. ఈ మూడు సూపర్‌ స్పెషాలిటీ ఎంసీహెచ్‌ హాస్పిటల్స్‌లో మాతా, శిశువులకు అన్ని రకాల మల్టీపుల్‌ వైద్య సేవలు ఒకే చోట అందుబాటులో ఉండనున్నాయని చెప్పారు. మొత్తం 600 పడకలు మాతా శిశు సంరక్షణ కోసం అందుబాటులోకి తెనున్నట్టుగా వెల్లడించారు.

ప్రసవం సమయంలో, ఆ తర్వాత.. మహిళలు ఎదుర్కొనే వివిధ రకాల ఆరోగ్య సమస్యలతో పాటు.. అప్పుడే పుట్టిన శిశువు ఆరోగ్య సంరక్షణకు సంబంధించిన సేవలు ఈ ఎంసీహెచ్‌ సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్స్‌లో అందుతాయని మంత్రి హరీష్‌ రావు వెల్లడించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో డెలవరీల సంఖ్య 72 శాతానికి పెంచుకున్నామని చెప్పారు. ఇవన్నింటికి సీఎం కేసీఆర్  తీసుకున్న నిర్ణయాలే కారణం అన్నారు మంత్రి హరీష్ రావు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..