CM KCR: జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటు.. సూర్యాపేట సభలో సీఎం కేసీఆర్
వంద కోట్ల రూపాయలతో ప్రభుత్వ కార్యాలయాలను ప్రారంభించుకున్నామని, ఇందులో అధికారుల కృషి కూడా ఎంతో ఉందని, వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నానని అన్నారు. రాష్ట్రంలో 23వ జిల్లా కలెక్టరేట్‌ను ప్రారంభించుకోవడం చాలా ఎంతో సంతోషంగా ఉందన్నారు. తలసరి ఆదాయంలో విషయంలో తెలంగాణ రాష్ట్రంలో దేశంలోనే మొదటి స్థానంలో ఉందన్నారు. అలాగే దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేసుకునే విధంగా చర్యలు చేపడుతున్నామని అన్నారు..
రాష్ట్ర అభివృద్ధి అనేది అందరితోనే కృషి అవుతుందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఆదివారం కేసీఆర్ సూర్యాపేట పర్యటనలో భాగంగా మెడికల్ కాలేజీని ప్రారంభించారు. అలాగే కొత్త ప్రభుత్వ కార్యాలయాలు, ఇంటిగ్రేటెడ్ డిస్ట్రిక్ట్ ఆఫీసెస్ కాంప్లెక్స్‌ను ప్రారంభోత్సవం చేసిన అనంతరం సీఎం కేసీఆర్ మాట్లాడారు. సూర్యాపేట జిల్లా కావడమే ఒక చరిత్ర అని, రానున్న రోజుల్లో అన్ని రంగాల్లో అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు.
వంద కోట్ల రూపాయలతో ప్రభుత్వ కార్యాలయాలను ప్రారంభించుకున్నామని, ఇందులో అధికారుల కృషి కూడా ఎంతో ఉందని, వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నానని అన్నారు. రాష్ట్రంలో 23వ జిల్లా కలెక్టరేట్‌ను ప్రారంభించుకోవడం చాలా ఎంతో సంతోషంగా ఉందన్నారు. తలసరి ఆదాయంలో విషయంలో తెలంగాణ రాష్ట్రంలో దేశంలోనే మొదటి స్థానంలో ఉందన్నారు. అలాగే దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేసుకునే విధంగా చర్యలు చేపడుతున్నామని అన్నారు. ఇప్పటికే దేశంలోనే అగ్రస్థానంలో ఉన్నామని, ఇప్పటికే అత్యుత్తమ దశకు చేరుకున్నామన్నారు. ఆర్థిక సాంఘిక అసమానతలు పోవాలన్నారు.
మెడికల్ కాలేజీ నిర్మాణానికి రూ.156 కోట్లు ఖర్చు అయ్యింది. ఎస్పీ కార్యాలయం, మార్కెట్ యార్డును సైతం కేసీఆర్ ప్రారంభించారు. 30 కోట్ల రూపాయలతో ఆసియాలోనే అతిపెద్ద మార్కెట్ యార్డును నిర్మాణం చేపట్టారు. కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ, సచివాలయాలు కూడా సరిగ్గా లేవని, మీ జిల్లాల్లో ఉండే కలెక్టరేట్ అంతా కూడా తమ అసెంబ్లీ కూడా లేదని కొందరు చెబుతున్నారని, దేశంలో ఏ రాష్ట్రంలో లేని అభివృద్ధి తెలంగాణలో జరుగుతుందని అన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత రైతుల ఆత్మహత్యలు, ఆకలి చావులు తగ్గిపోయాయని, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో పస్తులుండాల్సిన పరిస్థితి లేదన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి