AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: సెల్‌ టవర్‌ ఎక్కిన అభిమానం.. మా నాయకుడికి ఎమ్మెల్యే టికెట్‌ ఇవ్వాల్సిందే అంటూ..

జనగామ, స్టేషన్ ఘనపూర్ అభ్యర్థుల మార్పు ప్రచారం నేపథ్యంలో రగులుతున్న గందగోళాన్ని చల్లర్చెందుకు పార్టీ అధిష్టానం ప్రయత్నాలు చేస్తుంటే ఇప్పుడు భూపాలపల్లిలో అగ్గిరాజుకుంటుంది. మాజీ స్పీకర్, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి వర్గీయులు రోడ్డెక్కారు. రావాలి మదన్న.. కావాలి మధన్న అనే నినాదంతో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. భూపాలపల్లి టికెట్ మధుసూదనాచారికి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ర్యాలీలు, ధర్నాలు చేపట్టారు.. అధినేత దృష్టికి వారి అభిప్రాయాన్ని తెలియపర్చారు..

Telangana: సెల్‌ టవర్‌ ఎక్కిన అభిమానం.. మా నాయకుడికి ఎమ్మెల్యే టికెట్‌ ఇవ్వాల్సిందే అంటూ..
Telangana
G Peddeesh Kumar
| Edited By: |

Updated on: Aug 20, 2023 | 8:00 PM

Share

బీఆర్‌ఎస్‌ పార్టీ అధిష్టానానికి కొత్త తలనొప్పి మొదలైంది. సోమవారం ఎమ్మెల్యేల జాబితా విడుదల చేస్తారని వార్తలు వస్తున్న నేపథ్యంల పార్టీలో అలజడి మొదలైంది. కొంత మంది సిట్టింగ్‌ స్థానాలను మార్చుతున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో నేతలు తమ లాబియింగ్ మొదలు పెడుతున్నారు. ఎలాగైనా తమకే సీటు రావాలని తెర వెనక ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఈ నేపథ్యంలో కొందరు కార్యకర్తలు సైతం తమ అభిమాన నాయకులకు మద్ధతుగా నిలుస్తున్న నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఎమ్మెల్య టికెట్ల కేటాయింపు పంచాయితీ రచ్చలేపుతోంది. పలు నియోజకవర్గాల్లో ఉద్రిక్తతలకు దారితీస్తుంది మొన్న జనగామ, నిన్న స్టేషన్ ఘనపూర్, నేడు భూపాలపల్లిలో గందగోళానికి దారి తీసింది.

జనగామ, స్టేషన్ ఘనపూర్ అభ్యర్థుల మార్పు ప్రచారం నేపథ్యంలో రగులుతున్న గందగోళాన్ని చల్లర్చెందుకు పార్టీ అధిష్టానం ప్రయత్నాలు చేస్తుంటే ఇప్పుడు భూపాలపల్లిలో అగ్గిరాజుకుంటుంది. మాజీ స్పీకర్, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి వర్గీయులు రోడ్డెక్కారు. రావాలి మదన్న.. కావాలి మధన్న అనే నినాదంతో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. భూపాలపల్లి టికెట్ మధుసూదనాచారికి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ర్యాలీలు, ధర్నాలు చేపట్టారు.. అధినేత దృష్టికి వారి అభిప్రాయాన్ని తెలియపర్చారు.. కానీ అధిష్టానం నుంచి ఎలాంటి రియాక్షన్ లేకపోవడంతో ఆందోళన బాట పట్టారు.

ఓ ముగ్గురు కార్యకర్తలు ఏకంగా టవర్ ఎక్కారు.. సెల్ టవర్ పై భీష్మించుకు కూర్చున్న శ్రీకాంత్, పూర్ణచందర్, పృథ్వి అనే ముగ్గురు కార్యకర్తలు పార్టీ అధిష్టానం మధుసూదనాచారి కి టికెట్ ప్రకటించేంతవరకు తాము దిగే ప్రసక్తే లేదని భీష్మించుకు కూర్చున్నారు..ఉద్యమకారుడు చారి కి భూపాలపల్లి టికెట్ కేటాయించాలని డిమాండ్ చేశారు.. దీంతో ఉద్రిక్తత నెలకొంది. అయితే మధుసూదనాచారికా..? లేక ఆయన తనయుడు ప్రశాంత్‌కా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ఇవి కూడా చదవండి

మధుసూదనా చారి తనయుడు ప్రశాంత్ తనకే ఈ టిక్కెట్టు కోసం వెనుకుండి నడిపిస్తున్నాడని గులాబీ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది.. ఆయనే టిక్కెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారని ప్రచారం జరుగుతుంది. మొత్తం మీద రేపో మాపో అభ్యర్థుల జాబితా ప్రకటించడానికి ముహూర్తం ఖరారవుతున్న వేళ నియోజకవర్గాల్లో ఈ గందరగోళం తీవ్ర ఉద్ధృతులకు దారితీస్తుంది.. గులాబీ శ్రేణులను పరేషాన్ చేస్తుంది.. ఈ వివాదాన్ని గులాబీ బాస్ ఏ విధంగా పరిష్కరిస్తారో చూడాలి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..