Telangana: ఫలించిన మంత్రి హరీష్‌ రావు ప్రయత్నం.. చెరుకు రైతులకు రూ. 14 కోట్ల బకాయిలు..

చెరుకు పంటను కొనుగోలు చేసిన కంపెనీ డబ్బులు ఇవ్వని సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అలాగే ప్రతి ఏటా క్రషింగ్ చేయడానికి కూడా ఇబ్బందులు పెట్టేవారు. ఒక దశలో ఈ కంపెనీ పెట్టిన ఇబ్బందులకు, ఈ ప్రాంత చెరుకు రైతులు చెరుకు పంట వేయడం ఆపేయాలని నిర్ణయించుకున్నారు కూడా. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి..రానున్న సీజన్ లో ట్రెడెం ట్ షుగర్ ఫ్యాక్టరీ క్రషింగ్ ప్రారంభించేందుకు ఉన్న అడ్డంకులు తొలగిపోతున్నాయి. కేన్ కమిషనరేట్ అధికారులు, ఫ్యాక్టరీ యాజమాన్యంతో...

Telangana: ఫలించిన మంత్రి హరీష్‌ రావు ప్రయత్నం.. చెరుకు రైతులకు రూ. 14 కోట్ల బకాయిలు..
Minister Harish Rao
Follow us
P Shivteja

| Edited By: Narender Vaitla

Updated on: Aug 20, 2023 | 3:59 PM

జహీరాబాద్ చెరుకు రైతులకు తీపి కబురు అందింది. ప్రతి ఏటా ఇక్కడ ఉన్న ట్రెండేట్ షుగర్ ఫ్యాక్టరీ వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులకు ఈసారి ఉపశమనం దక్కింది. మంత్రి హరిష్ రావు ఆ పరిశ్రమ యాజమాన్యంతో జరిపిన చర్చలు సఫలం కావడంతో ఆ ప్రాంత చెరుకు రైతులు అందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జహీరాబాద్ అంటేనే చెరుకు పంటకు ఫేమస్‌. ఈ ప్రాంతంలో ఎక్కువగా చెరుకు పంటను సాగు చేస్తారు ఇక్కడి రైతులు. వేల ఎకరాల్లో ఇక్కడ చెరుకు సాగు అవుతు ఉంటుంది. అయితే ఇక్కడ ఉన్న ట్రెండేట్ షుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యంతో రైతులకు గతకొన్ని రోజులుగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

చెరుకు పంటను కొనుగోలు చేసిన కంపెనీ డబ్బులు ఇవ్వని సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అలాగే ప్రతి ఏటా క్రషింగ్ చేయడానికి కూడా ఇబ్బందులు పెట్టేవారు. ఒక దశలో ఈ కంపెనీ పెట్టిన ఇబ్బందులకు, ఈ ప్రాంత చెరుకు రైతులు చెరుకు పంట వేయడం ఆపేయాలని నిర్ణయించుకున్నారు కూడా. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి..రానున్న సీజన్ లో ట్రెడెం ట్ షుగర్ ఫ్యాక్టరీ క్రషింగ్ ప్రారంభించేందుకు ఉన్న అడ్డంకులు తొలగిపోతున్నాయి. కేన్ కమిషనరేట్ అధికారులు, ఫ్యాక్టరీ యాజమాన్యంతో మంత్రి హరీష్ రావు ఇటీవల సంగారెడ్డి కలెక్టరేట్ లో సమీక్ష సమావేశం నిర్వహించారు. దీంతో ఈ సారి క్రషింగ్ ప్రారంభించేందుకు యాజమాన్యం సానుకూలంగా స్పందించింది..మరో వైపు రైతులకు ఇవ్వాల్సి బకాయిలు 14.15 కోట్ల రూపాయలను విడతల వారీగా చెల్లించేందుకు కూడా యాజమాన్యం అంగీకరించింది. దీంతో జిల్లాలో చెరకు సాగు చేస్తున్న రైతులకు కొంత మేర భరోసా కలిగిందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు రైతులు.

సంగారెడ్డి జిల్లాలో ప్రతి ఏటా నవంబర్ రెండో వారం తర్వాత క్రషింగ్ ప్రారంభమవుతుంది. ఆయా ఫ్యాక్టరీలు క్రషింగ్ ప్రారంభించాలంటే కనీసం రెండు నెలల ముందు నుంచి ఫ్యాక్టరీని సిద్ధం చేసే పనులు చేయాల్సి ఉంటుంది. బాయిలర్లు, టర్బైన్, ఇతర యంత్రాల మరమ్మతులు, ఓవరాలింగ్ చేయాలి. పనులను యుద్ధ ప్రాతిపదికన ప్రారంభిస్తేనే అనుకున్న సమయానికి క్రషింగ్ ప్రారంభించేందుకు వీలు కలుగుతుంది..మరోవైపు చెరకు కొట్టే (కోసే) వలస కూలీలు కూడా దీపావళి తర్వాత వస్తారు..నారాయణఖేడ్, ఉద్గిర్ నుంచి కూలీలు వచ్చాక చెరకు కోతలు ప్రారంభమ వుతాయి..ట్రైడెంట్ షుగర్ ఫ్యాక్టరీ పరిధిలో ఎనిమిది మండలాల్లోని మొత్తం 198 గ్రామాలు ఉన్నాయి. సుమారు 18 వేల ఎకరాల్లో రైతులు చెరకు సాగు చేస్తున్నారు. కేన్ కమిషనరేట్ అధికారుల అంచనా ప్రకారం రానున్న సీజన్లో సుమారు ఆరు లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నారు ట్రెండేట్ షుగర్ ఫ్యాక్టరీ వాళ్లు.

ఇవి కూడా చదవండి

ఈ నేపధ్యంలోనే ఆ కంపెనీ యాజమాన్యాలతో మంత్రి హరీష్ రావు ఎప్పటికప్పుడు సమన్వయం చేస్తూ రానున్న సీజన్లో సకాలంలో క్రషింగ్ ప్రారంభించేలా మంత్రి ఫ్యాక్టరీ యాజమాన్యాలతో పలుమార్లు చర్చలు జరిపారు. దీంతో సజావుగా క్రషింగ్ సాగేందుకు మార్గం సుగమం అయింది. ఇలా చేసిన మంత్రికి అభినందలు తెల్పడనికి జహీరాబాద్ లో ఓ అభినందన సభను కూడా ఏర్పాటు చేయబోతున్నరు రైతులు. గతేడాది క్రషింగ్ సీజన్‌లో ట్రెడెంట్ షుగర్ ఫ్యాక్టరీ 2.55 లక్షల మెట్రిక్ టన్నుల చేరకు క్రషింగ్ చేసింది. ఈ ప్రాంత చెరుకు రైతులకు ఈ షుగర్ పరిశ్రమ అత్యంత కీలకమైనది. ఇది కనుక లేకపోతే పండించిన పంటను అమ్ముకోవడానికి చెరుకు రైతులు నానా అవస్థలు పడేవారు. ఇక్కడ ఇది లేకపోతే సంగారెడ్డిలోని గణపతి షుగర్స్, కామారెడ్డి జిల్లాలోని గాయత్రీ షుగర్స్ ఫ్యాక్టరీకి వెళ్ళాలి లేదా పక్క రాష్ట్రాలైన కర్నాటకలోని బొంగూరు,బసవకళ్యాణ్ ప్రాంతాలకు వెళ్ళాలి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..