Telangana: నిజామాబాద్ రైతుల షాకింగ్ నిర్ణయం.. పసుపు సాగుపై విరక్తి.. క్రాప్ హలీడే ప్రకటించాలని డిసైడ్..
వాణిజ్యపంటల్లో అత్యంత ముఖ్యమైనది పసుపు పంట.. అంతర్జాతీయంగా కూడా పసుపు పంటకు మంచి డిమాండ్ ఉంది. అయితే ప్రతియేట పసుపు సాగుచేసే రైతులు మాత్రం ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. మద్దతు ధర కోసం రోడ్డెక్కుతున్నారు. గత రెండేళ్ళూగా ఇదే పరిస్థితి ఉంది. క్వింటాలుకు రూ. 5 వేలు కూడా ధర లేకపోవడంతో పసుపు రైతుల పరిస్థితి దయానీయంగా మారింది. దీంతో పసుపు మద్దతు ధర కోసం రైతులు ఉద్యమ బాట పట్టారు. డిల్లీ్ వెళ్లి మంత్రులను కలిసిన రైతులకు ఒరిగిందేమి లేదు. దీంతో ఈ ఖరీఫ్ సీజన్లో..
ఒకప్పుడు వావ్ పసుపు అన్న నిజామాబాద్ రైతులు.. ఇప్పడు వామ్మో పసుపు అంటున్నారు. రోడ్డేక్కి ఉద్యమాలు చేసి.. డీల్లి వేళ్లి వినతులు ఇచ్చిన పసుపు రైతులు.. ఇక ఇతర పంటల వైపు చూస్తున్నారు. పసుపు కి కేరాఫ్ గా ఉండే నిజామాబాద్‌లో ఇప్పుడు సగానికి పడిపోయిన పసుపు సాగు ఇంకా తగ్గే అవకాశం లేకపోలేదు. అసలు పసుపు సాగు తగ్గడానికి గల కారణలేంటి ఓసారి చూద్దాం..
నిజామాబాద్ జిల్లాలో వరి తర్వాత ప్రధాన పంట పసుపు. ఇక్కడ పండే పసుపుకి ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ ఉంది. ఒక రకంగా చెప్పాలంటే ఆసియాలోనే అత్యధికంగా పసుపు పండేది నిజామాబాద్‌లోనే. అయితే పలు కారణాలతో ఈ సంవత్సరం పసుపు సాగు తగ్గింది. మద్దతు ధర లేకపోవటం, ప్రభుత్వం ప్రవేశపెట్టిన నియంత్రిత సాగు విధానం లాంటి కారణాల వల్ల పసుపు సాగు భాగా తగ్గింది.
ప్రపంచంలో నాణ్యమైన నిజామాబాద్ పసుపు..
వాణిజ్యపంటల్లో అత్యంత ముఖ్యమైనది పసుపు పంట.. అంతర్జాతీయంగా కూడా పసుపు పంటకు మంచి డిమాండ్ ఉంది. అయితే ప్రతియేట పసుపు సాగుచేసే రైతులు మాత్రం ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. మద్దతు ధర కోసం రోడ్డెక్కుతున్నారు. గత రెండేళ్ళూగా ఇదే పరిస్థితి ఉంది. క్వింటాలుకు రూ. 5 వేలు కూడా ధర లేకపోవడంతో పసుపు రైతుల పరిస్థితి దయానీయంగా మారింది. దీంతో పసుపు మద్దతు ధర కోసం రైతులు ఉద్యమ బాట పట్టారు. డిల్లీ్ వెళ్లి మంత్రులను కలిసిన రైతులకు ఒరిగిందేమి లేదు. దీంతో ఈ ఖరీఫ్ సీజన్‌లో పసుపు సాగు చేయటాని ముందుకు రావటం లేదు రైతులు. ప్రపంచంలోనే అత్యధిక పసుపు ఉత్పాదక దేశం బారతదేశం. ప్రపంచ ఉత్పత్తిలో 80 శాతాం మన దేశంలోనే ఉత్పత్తి అవుతుంది. మన దేశంలో ఎక్కువ నాన్యమైన కర్క్యూమిన్ శాతం పంట ఉత్పత్తి అవుతుంది. ఇక దేశ వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రం ఎక్కువ పసుపుని పండిస్తుంది. అందులో అత్యధికంగా నిజామాబాద్ జిల్లాలొ పసుపుని పండిస్తారు రైతులు. దేశ దిగుబడిలో దాదాపు 32 శాతం వాటా నిజామాబాద్ జిల్లాదే అని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఎకరానికి 1 లక్ష 20 వేల పెట్టుబడి అవుతుండగా సుమారుగా 18 క్వింటాళ్ళ దిగుబడి వస్తుంది. బాగా పండితే మాత్రం 25 క్వింటాళ్ళ వరకు దిగుబడి వస్తుంది. అయితే ప్రస్తుతం ధర మాతరం 4 నుంచి 5 వేలు మాత్రమే ఉంది. గత పదేళ్ళ కాలంలో పసుపు మద్దతు ధర గణానీయంగా పడిపోయింది. ప్రతి శుభ కార్యానికి వాడే పసుపుని ఎలాంటి తప్పటడగు వేయకుండా పండించే రైతు చివరకు అప్పుల పాలవుతున్నడు.
క్రాప్ హలిడే నిర్ణయం..
నిజామాబాద్ జిల్లాలో ఆర్మూర్ డివిజన్లో అత్యదికంగా పసుపు సాగు అవుతుంది. ప్రతియేట సుమారు 65 వేల ఎకరాల్లో ఈ పంట సాగువుతుంది.. ఉద్యాన వ్యవసాయ శాఖ అధికారులు, శాస్త్రవేత్తల సలహాలుసూచనలతో సంబందం లేకుండా సాంప్రదాయ పద్దతిలో రైతులు తమ స్వీయ అనుభవాన్ని జోడించి ఈ పంటను సాగు చేస్తారు. జిల్లాలో ప్రధానంగా గుంటూరు రకం పసుపును ఎక్కువగా పండిస్తారు. ప్రభుత్వం నుండి ఎలాంటి ఎరువులు, విత్తనాలుగాని సరఫరా కావడం లేదు. ఒక్క ఎకరానికి సుమారు 1 లక్ష 20వేల రూపాయలకు వరకు ఖర్చు చేస్తు పసుపుని సాగు చేస్తున్నారు రైతులు. అయితే కొన్నేళ్లుగా పసుపు రైతులకు ప్రతికూల పరిస్థితులు వెంటాడుతున్నాయి. తొమ్మిది నెలల పాటు అనేక కష్టానష్టాలకు , వ్యయప్రయాసాలకోర్చి ఈ పంటను సాగు చేస్తే ఆశించిన కనీస మద్దతు ధరలేకపోవడంతో నష్టాల పాలవుతున్నామని రైతులు వాపోతున్నారు. ఈ యేడు కూడా అదే పరిస్థితి నెలకొంది. ఎకరానికి సుమారు 16 క్వింటాళ్ల దిగుబడి సాదిస్తుండగా మార్కెట్ లో ధర మాత్రం ఆరు నుండి రూ.5 వేలు కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట సాగుకోసం చేసిన ఖర్చులు కూడా చేతికి రావటం లేదని, అప్పులు కట్టలేక ఇబ్బందిపడుతున్నామణి, తమ కష్టం వ్రుదా అవుతోందని ఆందోళన చెందుతున్నారు పసుపు రైతులు.
ఇక చాలు మేము సాగు చేయలేం – పసుపు రైతులు..
పసుపు పంటకి మద్దతు ధర ఇచ్చే విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒక అవగాహనతో పని చేయటాం లేదని, తమకి పెట్టూబడి కూడా రాని పంట సాగు చేయటాం దేనికని రైతులు అంటూన్నారు. ఇకపై 90 రోజుల్లో చేతికొచ్చే పంటలు మాత్రమే సాగు చేస్తామని అంటూన్నారు రైతులు. గత సంవత్సరం 47 వేలా ఎకరాలు పసుపు సాగు చేసిన రైతులు ఈ సారి 22 వేలా ఎకరాలు మాత్రమే సాగు చేసారు. గత సీజన్లో సాగు చేసిన మొత్తంలో ఈ సారి సగం కూడా సాగు చేయటం లేదు రైతులు. మద్దతు ధర లేకపోవటం, కరోనా కారనంగా ఈ సారి కొనుగోళ్ళూ నిలిచిపోవటం తర్వాత కొనుగోళ్ళూ జరిగినా ధర లేకపోవటంతో భవిష్యత్తులో పరిస్థితులు ఎలా ఉంటాయోనని రైతులు ఈ సారి సాగుకి జంకుతున్నారు. దింతో పసుపు సాగు విస్తీర్ణం భాగా తగ్గింది. దీనికి తోడూ ప్రభుత్వం నియంత్రుత సాగు విధానం అమలు చేయటం కూడా రైతులు పసుపు సాగు తగ్గించటానికి ఒక కారణం.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..