Nithya Menon: నీ నుంచి ఇది ఊహించలేదు నిత్యా.. హీరోయిన్ తీరుపై ఫ్యాన్స్ ఫైర్..

తెలుగు సినీపరిశ్రమలో నటిగా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఒకప్పుడు బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో ప్రేక్షకులను అలరించింది. కానీ కొన్నాళ్లుగా నిత్యా మీనన్ తెలుగులో అంతగా యాక్టివ్ గా ఉండడం లేదు. తాజాగా ఈ బ్యూటీకి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతుంది.

Nithya Menon: నీ నుంచి ఇది ఊహించలేదు నిత్యా.. హీరోయిన్ తీరుపై ఫ్యాన్స్ ఫైర్..
Nithya Menen
Follow us
Rajitha Chanti

|

Updated on: Jan 10, 2025 | 10:40 AM

తెలుగు సినీ ప్రియులకు హీరోయిన్ నిత్యా మీనన్ సుపరిచితమే. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే తాజాగా హీరోయిన్ నిత్యా మీనన్ తీరుపై సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్. ఓ ఫిల్మ్ ఫెస్టివల్ వేడుకలో పీఆర్ఓ స్టేజ్ పై చేయి అందించగా.. అతడికి షేక్ హ్యాండ్ ఇవ్వడానికి నిత్యా మీనన్ ఇష్టపడలేదు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుండగా.. ఆమె నుంచి ఇది అసలు ఊహించలేదంటూ కామెంట్స్ చేస్తున్నారు. కన్నడ, మలయాళం, తెలుగు, తమిళ సినిమాల్లో తన నటనకు ఎందరో అభిమానులను సంపాదించుకుంది నిత్యా మీనన్. అయితే సినిమాల్లోకి అరంగేట్రం చేయకముందు నిత్యా జర్నలిస్టు కావాలనుకుందట. కానీ అనుకోకుండా సినీరంగంలోకి అడుగుపెట్టింది.

కొన్నాళ్లుగా సినిమాల్లో అంత యాక్టివ్ గా ఉండడం లేదు. అలాగే సోషల్ మీడియాలో అంతగా యాక్టివ్ గా లేదు. తాజాగా ఈ అమ్మడుకు సంబంధించిన వీడియోపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. అసలేం జరిగిందంటే.. ఫిల్మ్ ఫెస్టివల్ వేడుకలో స్టేజ్ పైకి నిత్యా మీనన్ రావడంతో ఆమెకు స్వాగతం చెబుతూ అక్కడే ఉన్న పీఆర్ఓ నిత్యాకు షేక్ హ్యాండ్ ఇవ్వడానికి ప్రయత్నించాడు. అతడు చేయి చాపినా నిత్యా కరచాలనం చేయడానికి ఒప్పుకోలేదు. దీంతో ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతుండగా.. నిత్యాపై ఫైర్ అవుతున్నారు ఫ్యాన్స్.

ఇవి కూడా చదవండి

ఇక అదే వీడియోలో నిత్యా మీనన్ దర్శకుడు మిష్కిన్‌ను ముద్దుపెట్టుకుని, నటుడు జయం రవిని హాగ్ చేసుకుంది. దీంతో ఆమె తీరుపై మండిపడుతున్నారు నెటిజన్స్. ఆమె నుండి ఇది ఊహించలేదని కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు మాత్రం ఆమెకు మద్దతుగా నిలిచారు. ఎవరికైనా హ్యాండ్ ఇవ్వడం ఆమె వ్యక్తిగత ఇష్టమని నిత్యాకు సపోర్ట్ తెలుపుతున్నారు.

ఇది చదవండి : Tollywood: చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్.. గుర్రపు స్వారీ చేస్తోన్న ఈ హీరోయిన్ ఎవరంటే..

Tollywood: రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. స్టార్ హీరోల కంటే ఎక్కువ ఫాలోయింగ్.. ఎవరో తెలుసా.. ?

Tollywood: అరె ఏంట్రా ఇది.. ఇప్పుడు గ్లామర్‏తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి.. గుర్తుపట్టారా..?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.