వార్నీ ఇదెక్కడి పంచాయతీరా సామీ..! బర్త్‌డే కేక్‌ను 20 ముక్కలుగా కట్ చేసినందుకు అంత బిల్లా !
మరొక రెస్టారెంట్ - శాండ్ విచ్ ను రెండు ముక్కలుగా చేసిన సప్లై చేసినందుకు కూడా కస్టమర్లకు చార్జీ వేశారు. పూర్తి శాండ్ విచ్ ధర7.50 యూరోలు. అయితే, దీనిని కట్ చేసినందుకు 2 యూరోలు వసూలు చేశారు. ఒక యూరో మన కరెన్సీలో అయితే 90రూపాయలు. అంటే రెండు పీసులు చేసినందుకు రూ.180 వసూలు చేశారు.. అదే బిల్లులో ఒక కాఫీకి వేసిన ధర 1.20 యూరోలే. అంటే కాఫీ కంటే చాకుతో రెండు ముక్కలు కట్‌చేసిన శాండ్‌విచ్ పై రెట్టింపు చార్జ్ వసూలు చేసింది సదరు రెస్టారెంట్. దీంతో అతను అవాక్కయ్యారు.
ఈ రోజులు హోటళ్లు, రెస్టారెంట్లకు వెళ్లటం సర్వ సాధారణం. చాలా మంది ఫ్యామిలీతో, ఫ్రెండ్స్‌తో కలిసి రెస్టారెంట్లకు వెళ్తుంటారు. కావాల్సిన ఫుడ్ ఆర్డర్ చేసుకుని హాయిగా తినేసి.. ఏం చక్కా బిల్లు పే చేసి వస్తుంటాం.. అయితే, తిన్న దానికి కాకుండా సర్విస్ చార్జీ కూడా వసూలు చేసే రెస్టాంట్స్ కూడా ఉన్నాయంటే.. నమ్ముతారా..? అదేంటి.. తిన్నదానికి కాకుండా సప్లై చేసిన దానికి కూడా బిల్లు వేస్తారా.? అని షాక్ అవుతున్నారు కదా..కానీ, కస్టమర్లపై ఛార్జీలు వసూలు చేయడంలో ఇటాలియన్ రెస్టారెంట్లు ముందంజలో ఉన్నాయి. డైనింగ్ టేబుల్ వద్ద పుట్టినరోజు జరుపుకోవడానికి వచ్చిన కుటుంబ సభ్యులు ఈసారి రెస్టారెంట్‌లో సర్వీస్ ఛార్జీని చూసి ఆశ్చర్యపోయారు.
బర్త్‌డే కేక్‌ను 20 ముక్కలుగా కత్తిరించినందుకు రెస్టారెంట్ వారికి సర్వీస్ ఛార్జీగా రూ.1800 వసూలు చేసింది. పుట్టినరోజు వేడుకలు జరుపుకునేందుకు వచ్చిన కుటుంబ సభ్యులు రెస్టారెంట్ బిల్లు చూసి షాక్ తిన్నారు. వారు కూల్‌డ్రింక్స్, పిజ్జా కోసం దాదాపు 130 ఖర్చు చేశారు. బిల్లుపై అదనంగా €20 వసూలు చేశారు. ఎందుకని అడిగితే కేక్‌ను 20 ముక్కలుగా కట్ చేసేందుకు సర్వీస్ చార్జీ 20 యూరోలు (1800 రూపాయలు) అని రెస్టారెంట్ సిబ్బంది వెల్లడించారు. దీనికి ముందు, గెరా లారియోలోని బార్ పేస్ అనే రెస్టారెంట్ ఇలాంటి సర్వీస్ ఛార్జీలు వసూలు చేయడంతో సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి.
కానీ, ఇటాలియన్ రెస్టారెంట్ ఇలాంటి అధిక ఛార్జీలు వసూలు చేస్తుంది అనేది ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా ఒక కస్టమర్ శాండ్‌విచ్‌ను రెండు భాగాలు కట్ చేయమని అడిగినందుకు అదనంగా ఛార్జ్ చేశారు. ఎందుకని నిలదీయగా..అందుకోసం రెండు సాసర్లు, రెండు న్యాప్‌కిన్‌లు ఉపయోగించాల్సి ఉంటుందని చెప్పారు. అలాగే, రెండు చేతులతో టేబుల్ వద్దకు వెళ్లి సప్లై చేయాల్సి ఉంటుందని చెప్పారు.
మరిన్ని వైరల్ వార్తల కోసం క్లిక్ చేయండి