Mysuru Dasara 2024: అంగరంగ వైభవంగా మైసూర్‌ దసరా ఉత్సవాలు.. ఆకట్టుకుంటున్న జంబూ సవారీ

మైసూరులో దసరా ఉత్సవాలు అత్యంత ఘనంగా సాగుతున్నాయి. శక్తి నామంతో మైసూరు నగరం పులకించి పోతోంది. జంబూ సవారీని చూసేందుకు కర్నాటక ప్రజలు భారీగా తరలివచ్చారు.

Mysuru Dasara 2024: అంగరంగ వైభవంగా మైసూర్‌ దసరా ఉత్సవాలు.. ఆకట్టుకుంటున్న జంబూ సవారీ
Mysore Dasara
Follow us
Ram Naramaneni

|

Updated on: Oct 12, 2024 | 3:26 PM

మైసూరులో దసరా ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. మైసూరు దసరా ఉత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణ నిలిచే జంబూ సవారీ కలర్‌ఫుల్‌గా జరుగుతోంది. జంబూ సవారీని తిలకించేందుకు మైసూరు ప్యాలెస్‌కు చేరుకున్నారు కర్నాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌. అటు.. జంబూ సవారీని చూసేందుకు కర్నాటక ప్రజలు భారీగా తరలివచ్చారు. దసరా ఉత్సవాల కోసం మైసూర్‌ ప్యాలెస్‌ను అందంగా అలంకరించారు. వర్షంలోనే ఉత్సవాలు కొనసాగుతున్నాయి. శక్తి నామంతో మైసూరు నగరం పులకించి పోతోంది. . జగన్మాత సేవలో గజరాజులు తరించిపోతున్నాయి. మైసూర్‌ ఇక చాముండేశ్వరీ అమ్మ వారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున క్యూ కడుతున్నారు.

గత ఏడాది రాష్ట్రంలో కరువు పరిస్థితి ఏర్పడ్డా.. రుతుపవనాల ప్రభావంతో వర్షాలు బాగా కురవడంతో రైతాంగం కుదుటపడింది. అందుకే.. ఈ ఏడాది దసరా వేడుకల్ని మునుపటి కంటే ఘనంగా నిర్వహిస్తోంది కన్నడ సర్కార్. మైసూరు నగరం సర్వాంగ సుందరంగా ముస్తాబౌతుంది. దాదాపు సగం పోలీసు ఫోర్స్ మైసూర్ మహోత్సవ్ మీదే ఫోకస్ పెట్టింది. మైసూర్‌ దసరా ఉత్సవాలు తిలకించేందుకు దేశవిదేశాల నుంచి జనం తరలివచ్చారు. అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. కన్నడ సంస్కృతిని ప్రతిబింబిచేలా శకటాలను ప్రదర్శించారు. రాష్ట్రం నలుమూలల నుంచి కళాకారులు తరలివచ్చారు. 1610 నుంచి మైసూర్‌ దసరా ఉత్సవాలను ప్రతి ఏటా ఘనంగా నిర్వహిస్తున్నారు. వడయార్‌ పాలకులు ఈ వేడుకలకు శ్రీకారం చుట్టారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

అరటి పండ్ల బండి వస్తుందంటే కోతులన్నీ పరార్..!
అరటి పండ్ల బండి వస్తుందంటే కోతులన్నీ పరార్..!
ప్రతీ ఒక్కరికీ ఇంపార్టెంట్‌... గేమ్ చేంజర్ అవుతుందా?
ప్రతీ ఒక్కరికీ ఇంపార్టెంట్‌... గేమ్ చేంజర్ అవుతుందా?
న్యూ ఇయర్‌లో దుమ్మురేపనున్న నయా స్మార్ట్‌ఫోన్స్..!
న్యూ ఇయర్‌లో దుమ్మురేపనున్న నయా స్మార్ట్‌ఫోన్స్..!
జియో నుంచి అద్భుతమైన రీఛార్జ్‌ ప్లాన్‌.. 3 నెలల వ్యాలిడిటీ?
జియో నుంచి అద్భుతమైన రీఛార్జ్‌ ప్లాన్‌.. 3 నెలల వ్యాలిడిటీ?
ఐఆర్‌సీటీ ఎమర్జెన్సీ కోటా..లాస్ట్ మినిట్‌లో కన్‌ఫర్మ్‌డ్ టికెట్.!
ఐఆర్‌సీటీ ఎమర్జెన్సీ కోటా..లాస్ట్ మినిట్‌లో కన్‌ఫర్మ్‌డ్ టికెట్.!
సీఎం సీరియస్‌ అవ్వడంపై అల్లు అర్జున్ ప్రెస్‌మీట్‌
సీఎం సీరియస్‌ అవ్వడంపై అల్లు అర్జున్ ప్రెస్‌మీట్‌
చదివిందేమో డాక్టర్.. సినిమాల్లో హాట్ యాక్టర్.. ఈ అమ్మడు ఎవరంటే
చదివిందేమో డాక్టర్.. సినిమాల్లో హాట్ యాక్టర్.. ఈ అమ్మడు ఎవరంటే
ఎక్స్‌పైరీ చికెన్ తినడం వలన ఎంత ప్రమాదమో తెలుసా..
ఎక్స్‌పైరీ చికెన్ తినడం వలన ఎంత ప్రమాదమో తెలుసా..
మధ్యతరగతికి మళ్లీ జీఎస్టీ బాదుడు.. ఈ వస్తువులపై ట్యాక్స్‌ పెంపు!
మధ్యతరగతికి మళ్లీ జీఎస్టీ బాదుడు.. ఈ వస్తువులపై ట్యాక్స్‌ పెంపు!
ఆర్డినరీగా కనిపించే ఎక్స్‌ట్రార్డినరీ పర్సన్ ఎన్టీఆర్.! నెక్స్ట్
ఆర్డినరీగా కనిపించే ఎక్స్‌ట్రార్డినరీ పర్సన్ ఎన్టీఆర్.! నెక్స్ట్