AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maha shivaratri 2021: శివాలయాన్ని తనలో దాచుకునే సముద్రం.. ఆ కొన్ని గంటలు మాత్రమే దర్శనం.. ఎక్కడుందో తెలుసా..

సముద్రం మధ్యలో శివాలయం. కేవలం మధ్యాహ్నం తర్వాత మాత్రమే భక్తులకు కనిపిస్తుంది. ఆ తర్వాత తిరిగి సముద్రం.. తనలో ఈ శివాలయాన్ని

Maha shivaratri 2021: శివాలయాన్ని తనలో దాచుకునే సముద్రం.. ఆ కొన్ని గంటలు మాత్రమే దర్శనం.. ఎక్కడుందో తెలుసా..
Rajitha Chanti
|

Updated on: Mar 11, 2021 | 6:40 AM

Share

సముద్రం మధ్యలో శివాలయం. కేవలం మధ్యాహ్నం తర్వాత మాత్రమే భక్తులకు కనిపిస్తుంది. ఆ తర్వాత తిరిగి సముద్రం.. తనలో ఈ శివాలయాన్ని దాచుకుంటుంది. అవును.. ఇది పూర్తిగా నిజం. ఈ శివాలయం ఎక్కుడ ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.

గుజరాత్ లోని భావనగర్ కు తూర్పున 23 కిలోమీటర్ల దూరంలో కొలియాక్ సముద్ర తీర ప్రాంతం ఉంటుంది. ఈ తీర ప్రాంతంలో నిష్కలంక్ శివాలయం ఉంటుంది. పురాణాల ప్రకారం పాండవులు ఇక్కడ నిష్కలంక్ మహాదేవ్ ఆలయాన్ని స్థాపించినట్లుగా చెబుతారు ఈ కొలియాక్ తూర్పు సముద్ర తీరానికి 3 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంటుంది. అయితే ఇక్కడ ప్రత్యేకత ఎంటీ అంటే.. ఈ ఆలయం.. సముద్ర తీరాన కాదు ఉండేది.. సముద్రం లోపల ఉంటుంది. అంటే సముద్రం మధ్యలో దీనిని నిర్మించారు. పాండవులు తమ దోషాలను, తమకు ఏర్పడిన కళంకాలను పొగోట్టుకోవడానికి ఈ ఆలయాన్ని నిర్మించారని.. అందుకే ఈ ఇక్కడి శివాలయానికి నిష్కలంక్ అని పేరు పెట్టినట్లుగా పురాణాల్లో ఉంది.

కొలియాక్ సముద్ర తీరానికి చాలా మంది పర్యాటకులు వస్తుంటారు. అయితే ఇక్కడ ఏ ఆలయం ఉన్నట్లు కనిపించదు. ఉదయం పూట ఈ ఆలయం పూర్తిగా నీటమునిగి ఉంటుంది. సముద్రం మధ్యలో ఆలయం ఉంది అనడానికి గుర్తుగా.. అక్కడ ఒక ధ్వజస్తంభంపై జెండా ఉంటుంది. ఇక ఆ తర్వాత మధ్యాహ్నం 11 గంటలు దాటిన తర్వాత నుంచి మెల్లగా సముద్రం వెనక్కి వెళ్తుతుంది. దీంతో ఆలయానికి వెళ్లే మార్గం కనిపిస్తుంది. ఇక్కడ పౌర్ణమి, అమావాస్య రోజులలో భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు. ఆ సమయంలో సముద్రం పూర్తిగా వెనక్కు వెళ్తుతుంది. ఇక ప్రతి సంవత్సరం మహాశివరాత్రి రోజున ఇక్కడ అత్యంత వైభవంగా ఉత్సవాలు జరుగుతుంటాయి.

సముద్రం మధ్యలో శివాలయం ఎలా నిర్మించారనే విషయం మాత్రం ఇప్పటికీ తెలియరాలేదు. ఆలయం నిర్మాణం చూస్తుంటే అప్పటి పనితనం, నైపుణ్యాలు కళ్ళకు కట్టినట్లుగా ఉంటాయి. ఇక ప్రతి రోజూ మధ్యాహ్నం ఒంటి గంట సమయానికి సముద్రం పూర్తిగా వెనక్కి వెళ్ళగానే.. అక్కడి చిరు వ్యాపారులు తమ తోపుడు బండ్లపై పూలు, పూజా సామగ్రితో ఆలయం చుట్టు చేరుకుంటారు. ఆ తర్వాత ఆలయానికి కూడా భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు. మధ్యాహ్నం తర్వాత మళ్ళీ సముద్రం ముందుకు రావడం ప్రారంభిస్తుంది. అర్థరాత్రి సమయానికి మళ్లీ ఈ శివాలయాన్ని తన సముద్రగర్బంలో దాచుకుంటుంది.

Also Read:

Maha Shivaratri: మహాశివరాత్రి పూజా చేస్తున్నారా ? పూజా సమయంలో పాటించవలసిన నియమాలెంటో తెలుసా..