- Telugu News Spiritual My Home Group Chairman Jupally Rameshwar Rao Grand Daughter Edya Classical Dance Performance At Samatha Kumbh 2023
Samatha kumbh 2023: నయనాందనకరంగా నృత్య ప్రదర్శన.. సమతకుంభ్‌లో చిన్నారి ఈడ్య అద్భుత ప్రదర్శన.
మైహోం గ్రూప్స్ చైర్మన్ జూపల్లి రామేశ్వరరావుగారి మనవరాలు జూపల్లి ఈడ్యా..మిత్ర బృందంతో కలిసి నృత్య కళా ప్రదర్శన ఇచ్చారు. చిన్నారి ఈడ్యా నృత్యం అందరినీ ఆకట్టుకుంది..
Updated on: Feb 06, 2023 | 9:30 PM

పిట్టకొంచెం కూత ఘనం అన్నట్టు మైహోం గ్రూప్ చైర్మన్ జూపల్లి రామేశ్వరరావు మనవరాలు జూపల్లి ఈడ్య నృత్య ప్రదర్శన కన్నుల పండుగగా సాగింది.

సమతా కుంభ్ 2023లో సోమవారం సాయంత్రం జరిగిన సాంస్కృతి కార్యక్రమాల్లో భాగంగా దీపాంజలి కూచిపూడి నృత్య అకాడమీ శిష్య బృందం కూచిపూడి ప్రదర్శన భక్తులను ఎంతగానో ఆకట్టుకుంది.

ససాక్షాత్తూ ఆదిశేషుని అవతారం అయిన శ్రీ రామానుజాచార్యుల వారు విశష్ట అధ్వైత తత్వాన్ని, అష్టాక్షరీ వైశిష్యాన్ని చాటి చెప్పిన శ్రీ వైష్ణవాచార్యులు.

సమానత్వాన్ని, సమతాభావాన్ని జాగృతం చేసిన వారి మహనీయతను కొనియాడుతూ వారి జీవిత చరిత్ర ఆధారంగా రచించి స్వరపరిచిన శ్రీరామానుజ అనే పాటకు ఈడ్య మిత్ర బృందం ఈ ప్రదర్శన ఇచ్చింది.

అనంతరం శ్రీ చినజీయర్ స్వామివారు కూచిపూడి నృత్య అకాడమీ శిష్య బృందానికి మంగళ శాసనాలు అందించారు.

చివరగా తాతయ్య, నానమ్మల ఆశీర్వదం తీసుకుంది చిన్నారి ఈడ్య.
